epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కమలాపూర్‌లో అన్ని సర్పంచ్ స్థానాలు మా ఖాతాలోనే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

కమలాపూర్‌లో అన్ని సర్పంచ్ స్థానాలు మా ఖాతాలోనే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

కేసీఆర్ పథకాల్ని బందు పెట్టిన కాంగ్రెస్‌ని బొంద పెట్టాలి ఓటుతో బుద్ధి చెప్పాలి

కాకతీయ, హుజురాబాద్ : హుజురాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండలం మొత్తం బీఆర్ఎస్ వైపు మొగ్గుచూపుతుందని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బుధవారం కమలాపూర్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.ఈనెల 11న జరగనున్న సర్పంచ్ ఎన్నికల తొలి విడతలో కమలాపూర్ మండలంలోని 23 గ్రామపంచాయతీలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని, అలాగే మూడో విడతలో హుజురాబాద్, జమ్మికుంట, వీణవంక,ఇల్లంతకుంట మండలాల్లో కూడా పార్టీ ఘనవిజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తంచేశారు. మొత్తం హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న 107 గ్రామపంచాయతీలన్నీ బీఆర్ఎస్ ఖాతాలో పడతాయన్నారు.కమలాపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా దశరథం పేరును ఫైనల్ చేస్తున్నట్టు ప్రకటించారు. పార్టీ అంతర్గత ఆశావాహులెవరూ బాధపడకూడదని, భవిష్యత్తులో ప్రతి ఒక్కరికీ తగిన గౌరవం కల్పిస్తామని హామీ ఇచ్చారు.కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ కమలాపూర్ మండలంలో అభివృద్ధి అంటే కేసీఆర్ గారు చేసిన పనులే గుర్తుకు వస్తాయి. రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కానీ ఈ ప్రాంతంలో తట్టెడు మన్ను కూడా పోశారా? ప్రజలు ఆలోచించాలి అన్నారు.అలాగే స్థానిక రాజకీయాలపై మండిపడుతూ.ఈ ప్రాంతానికే నాయకుడిని అని చెప్పుకునే ఒకరు ఇక్కడ ఓడిపోయాక బయట ప్రాంతాల్లో పోటీకి వెళ్లాడు. కానీ నేను మాత్రం హుజురాబాద్ ప్రజల కోసం పోరాడుతూ నిలబడిన వ్యక్తిని. బైట ప్రాంతాల నుంచి వచ్చి ‘మీ నాయకున్ని’ అంటున్నవారిని నమ్మొద్దు, అన్నారు.కేంద్ర,రాష్ట్ర నిధుల విషయంలో తీవ్ర విమర్శలు చేస్తూ 2019 నుండి 2025 వరకు రాష్ట్రం కేంద్రానికి 4 లక్షల కోట్లకుపైగా పన్ను చెల్లించింది, తిరిగి వచ్చినది మూడులక్షల కోట్లలోపే. రాష్ట్రం పంపిన ప్రతి రూపాయికి కేంద్రం 84 పైసలు మాత్రమే తిరిగి ఇస్తోంది. 16 పైసలు వేరే రాష్ట్రాలకు వెళ్తున్నాయి. ఈ నిజాలపై చర్చకు సిద్ధం అన్నారు.తాను చెప్పినవి అబద్ధమైతే కమలాపూర్ గ్రామంలో ‘ముక్కు నేలకు రాసేందుకు’ కూడా సిద్ధమని సవాల్ విసిరారు.అంతేకాకుండా ఉపఎన్నికల సమయంలో గెలిచిన ఈటల రాజేందర్ కేంద్రం నుంచి ఏమాత్రం నిధులు తెచ్చారో కూడా ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. కమలాపూర్ ఆయన స్వగ్రామం అయినప్పటికీ అక్కడ కూడా అభివృద్ధి జరగలేదన్నారు.కేసీఆర్ హయాంలో చిన్న గ్రామాలకు 30 కోట్లు, పెద్ద గ్రామాలకు 100 కోట్లు ఖర్చు చేసి అభివృద్ధి చేశారని, ఈ ప్రాంతంలోని దళిత కుటుంబాలకు దళిత బంధు పథకం ద్వారా 10 లక్షల రూపాయలు అందించినవారు కూడా కేసీఆర్ గారేనని గుర్తుచేశారు.కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలన్నింటినీ ఒకటొకటిగా బంద్ చేసిందని, ప్రజలు ఈసారి కాంగ్రెస్,బీజేపీలకు ఓటు ఆయుధంతో తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక కాకతీయ, శంకరపట్నం: జిల్లా స్థాయి...

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు బండి సంజయ్ చొరవతో పనులకు శ్రీకారం కాకతీయ,శంకరపట్నం:కేంద్ర...

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.