అక్రమంగా మొరం రవాణా.. టిప్పర్ పట్టివేత
అనుమతులు లేకుండా తరలిస్తుండగా గుర్తింపు
అక్రమ రవాణాపై కఠిన చర్యలు తప్పవు : ఎస్‌ఐ శేఖర్‌రెడ్డి
కాకతీయ, శంకరపట్నం : అనుమతులు లేకుండా మొరం తరలిస్తున్న టిప్పర్‌ను కేశవపట్నం పోలీసులు పట్టుకున్నారు. మొలంగూరు క్రాస్‌రోడ్డు వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా, అక్రమంగా మొరం తరలిస్తున్న టిప్పర్ (టీఎస్ 08 వీడీ 9010)ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. టిప్పర్ డ్రైవర్ కనుకుంట్ల మల్లేశం, మానకొండూరు మండలం ఊటూరు గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు కేశవపట్నం ఎస్‌ఐ శేఖర్‌రెడ్డి తెలిపారు. అనుమతులు లేకుండా మొరం, ఇతర ఖనిజాలను అక్రమంగా తరలిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ హెచ్చరించారు. అక్రమ రవాణాకు పాల్పడే వారిపై పోలీసుల నిఘా కొనసాగుతుందని స్పష్టం చేశారు.

