epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కేసీఆర్‌కు పాపం త‌గిలింది

కేసీఆర్‌కు పాపం త‌గిలింది

ఆయ‌న కుటుంబంలో పైస‌ల పంచాయితీ రాజుకుంది

కాళేశ్వ‌రం కూలింది.. వాళ్లింట్లో కాసులు కురిసిన‌య్‌

ప్రజల సొమ్ము తిన్నోళెవ‌రూ బాగుపడ‌లే..

రెండేళ్లుగా ఒక్క రోజూ సెలవు తీసుకోకుండా పని చేస్తున్నా

సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా భావిస్తూ ముందుకెళ్తున్నాం

ఎర్ర బస్ రావడమే కష్టం అనుకున్న చోటుకు ఎయిర్ బస్ తీసుకొస్తా

ఏడాది తిరిగే లోపే ఎయిర్పోర్ట్ పనులు ప్రారంభిస్తా ..

ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి

ఆదిలాబాద్ జిల్లాలో సీఎం పర్యటన

రూ.18.70 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన

ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాల బహిరంగ సభలో ప్రసంగం

జిల్లాపై ముఖ్య‌మంత్రి వ‌రాల జ‌ల్లు

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: గత రెండేళ్లుగా ఒక్క రోజూ సెలవు తీసుకోకుండా పని చేస్తున్నానని సీఎం రేవంత్​ రెడ్డి తెలిపారు. ఎర్రబస్సు రావడమే కష్టమనుకున్న ఆదిలాబాద్‌లో ఎయిర్‌ బస్‌ను దించి పరిశ్రమలు తీసుకువచ్చే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. ఏడాది తిరిగేలోపు ఆదిలాబాద్‌లో విమానాశ్రయం నిర్మాణ పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ప్రజాపాలన – ప్రజా విజయోత్సవాల్లో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలో సీఎం పర్యటించారు. రూ.18.7 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఇందిరా ప్రియదర్శిని మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. రెండు సంవత్సరాల క్రితం ఓటును ఆయుధంగా మార్చి నిరంకుశ ప్రభుత్వాన్ని సాగనంపారని అన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా భావిస్తూ ముందుకెళ్తున్నామని తెలిపారు.

కాళేశ్వ‌రం కూలేశ్వ‌ర‌మైంది

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ చేసిన పాపం ఊరికే పోదని విమర్శలు చేశారు. కేసీఆర్ కుటుంబంలో పైస‌ల పంచాయితీ తప్ప.. మరొకటి లేదని ఎద్దేవా చేశారు. ప్రజల సొమ్ము తిన్నవారు ఎవరూ బాగుపడే చరిత్ర లేదని హెచ్చరించారు. కాళేశ్వరం కడితే కూలేశ్వరం అయిందని.. వారింట్లో కాసులు కురిశాయని విమర్శించారు. ఆ ప్రాజెక్టు పేరు మారిందని, ప్లేస్‌ మారింది, అంచనాలు లక్ష కోట్లకు పెరిగాయని మండిప‌డ్డారు. ఒక పెద్దాయన ఆదిలాబాద్‌కు దెయ్యంలా పట్టారని సెటైర్లు గుప్పించారు.

ప్రజల దీవెన, దేవుడి సంకల్పం

ప్రజలు తెచ్చుకున్న ప్రజాప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకుంటోందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. సంక్షేమం – అభివృద్ధి రెండుకళ్లుగా భావిస్తూ ముందుకెళ్తున్నామని అన్నారు. చిన్న వయసులోనే నాకు గొప్ప అవకాశం దక్కడం ప్రజల దీవెన, దేవుడి సంకల్పమని పేర్కొన్నారు. వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా కృషి చేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం పదేళ్లపాటు విపక్ష ఎమ్మెల్యేలను ప్రభుత్వ కార్యక్రమాలకు కూడా అనుమతించలేదని, ఎమ్మెల్యేలను కూడా సచివాలయంలోకి రాకుండా అడ్డుకున్న ప్రభుత్వాన్ని గత పదేళ్లలో చూశామని ఆరోపించారు.

గత ప్రభుత్వంపై నేను పోరాటం ప్రారంభించాను

ఏ ఆశయంతో సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారో గత పదేళ్లలో అది నెరవేరలేదని వివర్శించారు. రాష్ట్ర అభివృద్ధికి తెలంగాణ రైజింగ్‌-2047 డాక్యుమెంటరీ రూపొందించామని, పెట్టుబడులు సాధించే లక్ష్యంతో ఈనెల 8, 9న గ్లోబల్‌ సమ్మిట్‌ నిర్వహిస్తున్నామని అన్నారు. ఏడాది తిరిగేలోపు ఆదిలాబాద్‌లో విమానాశ్రయం పనులు ప్రారంభం అవుతాయని, ఇంద్రవెల్లి స్ఫూర్తిగానే గత ప్రభుత్వంపై తాను పోరాటం ప్రారంభించానని తెలిపారు. అధికారంలోకి రాగానే ఇంద్రవెల్లి అమరుల స్థూపం పర్యాటకంగా అభివృద్ధి చేసే దస్త్రంపై సంతకం పెట్టానని గుర్తు చేశారు. ఆదిలాబాద్‌ జిల్లాకు త్వరలోనే మరోసారి వచ్చి పనులను సమీక్షిస్తానని అన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కరెంటు లేక రైతుల అవస్థలు

కరెంటు లేక రైతుల అవస్థలు కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యంతో పంటలు ఎండుతున్నాయి ఎల్‌నినో ముప్పు...

ఏఎమ్మార్‌లో ఈడీ రైడ్‌

ఏఎమ్మార్‌లో ఈడీ రైడ్‌ రూ.650 కోట్ల బొగ్గు నిధుల మళ్లింపుపై సోదాలు! హైదరాబాద్‌లో ఏఎంఆర్‌...

వాస్తవాలు రాస్తే ఉక్రోషం..!

వాస్తవాలు రాస్తే ఉక్రోషం..! నాపై వార్తలు రాసిన వాళ్లపై కేసులు పెట్టండి ‘కాకతీయ’ స్టాఫర్‌పై...

మా కుటుంబాన్ని వేధించొద్దు

మా కుటుంబాన్ని వేధించొద్దు సుమంత్ విష‌యంలో వాస్తవాలను ప‌రిశీలించండి 20 రోజులుగా మా కుటుంబంపై...

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.