epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఎన్నికల ప్రక్రియలో అప్రమత్తంగా ఉండాలి

ఎన్నికల ప్రక్రియలో అప్రమత్తంగా ఉండాలి
: అడిషనల్ డీసీపీ అడ్మిన్ రామానుజం
ఎన్నికలకు పటిష్టమైన బందోబస్తు : అడిషనల్ డీసీపీ ప్రసాద్ రావు
కట్టుదిట్టమైన భద్రత: ఏసీపీ వసుంధర యాదవ్

కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పక్రియ ముగిసే వరకు పోలీస్ సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించాలని అడిషనల్ డీసీపీ అడ్మిన్ రామానుజం అన్నారు. పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు చింతకాని, బోనకల్ మండలాల ఎన్నికల సందర్భంగా పోలీస్ బందోబస్తు సిబ్బంది యొక్క విధివిధానాలపై ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ డీసీపీ మాట్లాడుతూ..ఎన్నికల భద్రత అనేది సమష్టి బాధ్యతని, ఎన్నికలను విజయవంతం చేయడంలో సిబ్బంది పూర్తి సహాయ సహకారాలు అందించాలని సూచించారు. ఎన్నికల విధులలో ఎవరైనా నిర్లక్ష్యం వహించినా, నిబంధనలను ఉల్లంఘించినా శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. విధినిర్వహణలో సిబ్బందికి ఏదైనా ఇబ్బందులు, ఆకస్మిక సమస్యలు ఎదురైతే, వెంటనే ఉన్నత అధికారులకు సమాచారం అందించాలని, వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకోవద్దని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రవర్తన నియమావలిని ఖచ్చితంగా పాటిస్తూ.ఎన్నికల విధులలో ఎలాంటి అలసత్వం లేకుండా క్రమశిక్షణతో తమకు కేటాయించిన విధులను సక్రమంగా నిర్వహించాలని సూచించారు.

ఎన్నికలకు పటిష్టమైన బందోబస్తు : అడిషనల్ డీసీపీ ప్రసాద్ రావు

గురువారం జరగనున్న మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను పురస్కరించుకొని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఖచ్చితమైన ప్రణాళికతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు అడిషనల్ డీసీపీప్రసాద్ రావు తెలిపారు. రఘునాథ‌పాలెం మండలం ఎన్నికల పోలింగ్ బందోబస్తు, రూట్ మొబైల్ బందోబస్త్, పోలింగ్ స్టేషన్ బందోబస్త్ సిబ్బంది యొక్క విధివిధానాలపై స్థానిక పీఎస్‌లో అవ‌గాహ‌న క‌ల్పించారు. ఎన్నికల ఫలితాలు వెల్లడించిన అనంతరం ఎలాంటి విజయోత్సవ ర్యాలీలకు అనుమతులు లేదని అన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ని ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పాటించాలని తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ (ఏఆర్) కుమారస్వామి, టౌన్ ఏసీపీ రమణమూర్తి, సిఐ ఉస్మాన్ షరీఫ్ పాల్గొన్నారు.

కట్టుదిట్టమైన భద్రత: ఏసీపీ వసుంధర యాదవ్

గ్రామ పంచాయతీ మొదటి విడత పోలింగ్ సందర్భంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశామని కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ అన్నారు.
మధిర మండలం మొదటి విడత గ్రామ పంచాయితీ ఎన్నికల పురస్కరించుకొని ఎన్నికల బందోబస్త్ కు కేటాయించిన పోలీస్ సిబ్బంది యొక్క విధివిధానాలపై అవగాహన కార్యక్రమం మధిరలోనిర్వహించారు. అనంతరం ఆమె గురువారం జరగనున్న ఎర్రుపాలెం మండలంలోని పలు క్రిటికల్ పోలింగ్ స్టేషన్లను వైరా ఇన్చార్జి ఏసీపీ వసుంధర యాదవ్ సందర్శించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా ప్రతి ఒక్కరు సమన్వయం పాటించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సిఐ రమేష్, ఎస్సై లక్ష్మి భార్గవి పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.