epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

సైబర్‌ మోసం… మాజీ ఐజీ ప్రాణం తీసింది!

సైబర్‌ మోసం… మాజీ ఐజీ ప్రాణం తీసింది!
రూ.8.10 కోట్ల సైబర్‌ ఫ్రాడ్‌కు బలైన పంజాబ్ మాజీ ఐజీ
పాటియాలా నివాసంలో తుపాకితో కాల్చుకున్న అమర్ సింగ్ చాహల్
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
12 పేజీల సూసైడ్ నోట్ స్వాధీనం

కాకతీయ, నేషనల్ డెస్క్ : భారీ సైబర్‌ మోసం ఒక మాజీ ఉన్నతాధికారిని బలి తీసుకుంది. పంజాబ్ రాష్ట్రానికి చెందిన రిటైర్డ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీ) అమర్ సింగ్ చాహల్ (65) సైబర్‌ ఫ్రాడ్‌లో రూ.8.10 కోట్ల వరకు నష్టపోయి తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డారు. సోమవారం పాటియాలాలోని తన నివాసంలో తుపాకితో కాల్చుకున్న ఆయన, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన పోలీసు వర్గాల్లోనే కాకుండా ప్రజల్లోనూ తీవ్ర కలకలం రేపింది. పాటియాలాలోని తన ఇంట్లో భద్రతా సిబ్బందికి చెందిన రివాల్వర్‌తో అమర్ సింగ్ చాహల్ కాల్చుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. సమాచారం అందిన పది నిమిషాల్లోనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కొన ఊపిరితో ఉన్న ఆయన్ని పార్క్ ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో చికిత్స ఫలించక ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.

12 పేజీల సూసైడ్ నోట్ స్వాధీనం

ఘటనా స్థలం నుంచి 12 నుంచి 16 పేజీల వరకు ఉన్న సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ లేఖను పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్‌ను ఉద్దేశించి రాసినట్లు సమాచారం. అందులో తాను ఎలా సైబర్‌ మోసానికి గురయ్యానో, ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులు, మానసిక వేదనలను వివరించినట్లు పోలీసులు తెలిపారు. గత అక్టోబర్‌లో ఓ మోసపూరిత కంపెనీలో అమర్ సింగ్ చాహల్ పెట్టుబడులు పెట్టడం ప్రారంభించినట్లు దర్యాప్తులో తేలింది. మొదట తన సొంత డబ్బు రూ.1 కోటి పెట్టగా, ఆ తర్వాత కంపెనీ నిర్వాహకుల ఒత్తిడితో స్నేహితులు, బంధువుల నుంచి అప్పులు చేసి మరిన్ని కోట్ల రూపాయలు చెల్లించినట్లు తెలుస్తోంది. మొత్తం రూ.8.10 కోట్ల వరకు నష్టపోయినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ మోసంపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు కూడా ఆయన లేఖలు రాసినట్లు సమాచారం.

వివాదాస్పద నేపథ్యం… కొనసాగుతున్న దర్యాప్తు

అమర్ సింగ్ చాహల్ సేవా కాలంలో వివాదాలు కూడా ఉన్నాయి. 2015లో జరిగిన బెహబల్ కలాన్, కోట్‌కపురా కాల్పుల ఘటనల్లో ఆయన నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్, ఆయన కుమారుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌తో పాటు పలువురు పోలీసు అధికారులపై సిట్ చార్జిషీట్ దాఖలు చేసింది. తాజా ఆత్మహత్య ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. సైబర్‌ నేరగాళ్ల బారిన ఒకప్పుడు రాష్ట్ర పోలీసు వ్యవస్థలో కీలకంగా పనిచేసిన అధికారి కూడా పడటం, చివరకు ప్రాణాలు తీసుకోవడం దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. సైబర్‌ మోసాలపై మరింత అప్రమత్తత అవసరమన్న హెచ్చరికగా ఈ ఘటన మారింది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వ్యూహకర్త కాదు… విజేత..!

వ్యూహకర్త కాదు... విజేత..! బీజేపీ కంచుకోటలో ప్రశాంత్ కిశోర్ సంచలనం ప్రత్యక్ష రాజకీయాల తొలి...

పురుగులు ప‌రుగులు పెట్టించాయి

పురుగులు ప‌రుగులు పెట్టించాయి ఢిల్లీని కదిలించిన జెన్‌జీ జోరు! హేళనగా పుట్టిన 'కాక్రోచ్ జనతా...

13 ఏళ్ల విద్యార్థినిపై తోటి విద్యార్థుల లైంగిక వేధింపులు

13 ఏళ్ల విద్యార్థినిపై తోటి విద్యార్థుల లైంగిక వేధింపులు పాఠశాల ఆవరణలోనే జరిగిన...

జీ7 సదస్సులో మరోసారి మెరిసిన ‘మెలోడీ’ జోడీ

జీ7 సదస్సులో మరోసారి మెరిసిన 'మెలోడీ' జోడీ ఎవియన్‌లో ముచ్చటించుకున్న మోదీ, మెలోనీ సోషల్...

భార్యకు పెళ్లి చేసిన భర్త

భార్యకు పెళ్లి చేసిన భర్త పన్నెండేళ్లు చిన్నవాడైన యువకుడితో వివాహిత ఎఫైర్ మహిళను కలిసేందుకు...

బెంగాల్ వీధుల్లో ‘అంకుశం’ సీన్ రిపీట్

బెంగాల్ వీధుల్లో ‘అంకుశం’ సీన్ రిపీట్ దోపిడీలు, భూకబ్జాల కేసుల్లో అరెస్టయిన ‘ఫాల్తా...

మంత్రి రామలింగారెడ్డి రాజీనామా!

మంత్రి రామలింగారెడ్డి రాజీనామా! బెంగళూరు అభివృద్ధి శాఖ ఇస్తామని మాటిచ్చి త‌ప్పారు సాగునీటి శాఖ...

రితాబ్రతా బెనర్జీ తిరుగుబాటు

రితాబ్రతా బెనర్జీ తిరుగుబాటు సీపీఎం నుంచి తృణమూల్ మీదుగా బీజేపీ వైపు నయా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.