epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

గుంతలు పూడ్డి.. ప్రాణాలు కాపాడిన ఆటో డ్రైవర్లు

గుంతలు పూడ్డి.. ప్రాణాలు కాపాడిన ఆటో డ్రైవర్లు

కాకతీయ, ఖిలావరంగల్ : కరీమాబాద్ నుంచి బట్టల బజారు వైపు వెళ్లే ఫ్లైఓవర్‌పై ఏర్పడిన భారీ గుంతలు రోజురోజుకీ ప్రమాదకరంగా మారుతున్నాయి. ఈ రోడ్డుపై ప్రయాణించే వాహనదారులు, ముఖ్యంగా ఆటో డ్రైవర్లు తీవ్ర భయాందోళనల మధ్య ప్రయాణం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. సంబంధిత అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా సమస్యను పరిష్కరించడంలో నిర్లక్ష్యం కనిపించిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల అదే ఫ్లైఓవర్‌పై ఒక ఆటో అదుపు తప్పి బోల్తా పడటంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదం తప్పినప్పటికీ, ఇక ఆలస్యం చేస్తే ప్రాణ నష్టం తప్పదని అక్కడి అడ్డా ఆటో డ్రైవర్లు గ్రహించారు. అధికారుల కోసం ఎదురుచూడకుండా, ప్రజల భద్రతే ముఖ్యమని భావించిన ఆటో డ్రైవర్లు స్వయంగా రంగంలోకి దిగారు. అందరూ కలిసి చందాలు వేసుకుని ఇసుక, సిమెంట్, కంకర వంటి నిర్మాణ సామగ్రిని తెప్పించారు. ఫ్లైఓవర్‌పై ఉన్న గుంతలను తమ చేతులతోనే పూడ్చి తాత్కాలికంగా అయినా ప్రమాదాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు. ఆటో డ్రైవర్లు తీసుకున్న ఈ ముందస్తు చర్యల వల్ల ప్రస్తుతం ఫ్లైఓవర్ మీదుగా వెళ్లే వాహనదారులకు ఊరట లభించింది. ముఖ్యంగా రాత్రి వేళల్లో జరిగే ప్రమాదాల ముప్పు గణనీయంగా తగ్గిందని ప్రయాణికులు చెబుతున్నారు. ప్రజల ప్రాణాలు కాపాడాలనే బాధ్యతతో ప్రభుత్వ పనిని తామే చేయాల్సి రావడం బాధాకరమని, అయినా ప్రమాదం జరగకుండా చూడాలనే ఉద్దేశంతో ఈ పని చేశామని ఆటో డ్రైవర్లు తెలిపారు. వారి సేవా భావానికి స్థానికులు, వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం మంచినీరు, ఘన వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణపై ప్రత్యేక...

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక...

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర!

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర! రోడ్లన్నీ ఆక్రమణ.. పార్కింగ్ స్థ‌లాల్లోనూ అమ్మకం చైర్ పర్సన్...

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం పంటల వైవిధ్యీకరణతో వాతావరణ మార్పులు మార్కెట్‌ ఒడిదుడుకులను...

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే కేసీఆర్‌ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి...

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి మట్టి...

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.