epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

దేశంలోనే ధనవంతమైన బల్దియా !

దేశంలోనే ధనవంతమైన బల్దియా !
ఆదాయంలో బీఎంసీ రికార్డు..!
మేయర్ ఎన్నికల వేళ ప్రత్యేక దృష్టి

ముంబై : మహారాష్ట్రలో జనవరి 15న జరగనున్న మున్సిపల్ మేయర్ ఎన్నికల్లో 29 కార్పొరేషన్లు కొత్త నాయకత్వాన్ని ఎన్నుకోనున్నాయి. ఈ ఎన్నికల్లో దేశంలోనే అత్యంత ధనవంతమైన మున్సిపల్ సంస్థగా పేరుగాంచిన బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)పై ప్రత్యేక దృష్టి కేంద్రీకృతమైంది. కోట్ల రూపాయల బడ్జెట్‌, విస్తృత ఆదాయ వనరులు, భారీ వ్యయాలతో బీఎంసీ దేశంలోని ఇతర మహానగర కార్పొరేషన్లకు భిన్నంగా నిలుస్తోంది. 2024–25 ఆర్థిక సంవత్సరానికి బీఎంసీ బడ్జెట్‌ అంచనా రూ.59,954.7 కోట్లుగా ఉంది. ఇది ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌ (రూ.16,683 కోట్లు), బెంగళూరు బీబీఎంపీ (రూ.12,369 కోట్లు) బడ్జెట్లను కలిపినా రెట్టింపు కావడం విశేషం. కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్‌ బడ్జెట్‌ మాత్రం రూ.5,166.5 కోట్లకే పరిమితమైంది. గత పదేళ్లలో బీఎంసీ బడ్జెట్‌ దాదాపు రెట్టింపు అయ్యింది. 2015–16లో రూ.20,500 కోట్లుగా ఉన్న వ్యయం 2024–25 నాటికి రూ.44,500 కోట్లకు చేరింది.

ఆదాయంలోనూ దూసుకుపోతున్న బీఎంసీ

2024–25లో బీఎంసీ మొత్తం ఆదాయం రూ.81,774 కోట్లుగా అంచనా వేశారు. ఫీజులు, యూజర్‌ ఛార్జీలు ప్రధాన ఆదాయ వనరులుగా ఉన్నాయి. సేవలు, లైసెన్సులు, రిజిస్ట్రేషన్‌, ప్రకటనలు, నీటి కనెక్షన్లు వంటి వాటి ద్వారా 2016 నుంచి 2025 మధ్య రూ.94,600 కోట్లు వసూలయ్యాయి. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుంచి గ్రాంట్లు, సబ్సిడీల రూపంలో రూ.86,700 కోట్లు లభించాయి. ఇతర ప్రభుత్వ సంస్థల తరఫున సేవలు అందించినందుకు కూడా బీఎంసీ భారీ మొత్తాలు వసూలు చేసింది. 2023–24లో బాంద్రా–కుర్లా రోడ్ల శుభ్రతకు ఎంఎంఆర్‌డీఏ నుంచి రూ.61.7 కోట్లు వసూలు చేయడం అందుకు ఉదాహరణ.

పన్నుల వసూళ్లతో భారీ లాభం
విద్యుత్‌, ప్రాపర్టీ, నీటి, థియేటర్‌, వీధి పన్నుల రూపంలో 2016–25 మధ్య రూ.75,800 కోట్లు బీఎంసీ ఖజానాకు చేరాయి. స్థిర నిధులు, వాటిపై వడ్డీ కూడా వార్షిక ఆదాయంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.గత పదేళ్లలో నగర అభివృద్ధి, మౌలిక వసతులపై బీఎంసీ రూ.1,11,600 కోట్లు ఖర్చు చేసింది. రోడ్లు, వంతెనలు, మురుగునీటి వ్యవస్థ, ప్రజారోగ్యం, విద్య, భద్రత, ఉద్యోగుల జీతాలు–పింఛన్లు ప్రధాన వ్యయాంశాలుగా ఉన్నాయి. ఆసుపత్రులు, విద్యాసంస్థలు, గ్రంథాలయాలకు గ్రాంట్లుగా రూ.10,700 కోట్లు వెచ్చించింది. ప్రజా మౌలిక సదుపాయాల నిర్వహణకు రూ.36,300 కోట్లు ఖర్చు చేసింది.
2024–25లో మాత్రమే దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల నియంత్రణకు రూ.99.5 కోట్లు, ఎలుకల నియంత్రణకు రూ.12.8 కోట్లు వెచ్చించడం గమనార్హం. దేశంలోని ఇతర మున్సిపల్ కార్పొరేషన్లతో పోలిస్తే బీఎంసీ ఆర్థిక శక్తి, వ్యయ సామర్థ్యం అసమానంగా ఉండటంతో, రాబోయే మేయర్ ఎన్నికలు రాజకీయంగా మాత్రమే కాక ఆర్థికంగా కూడా ఎంతో కీలకంగా మారాయి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వ్యూహకర్త కాదు… విజేత..!

వ్యూహకర్త కాదు... విజేత..! బీజేపీ కంచుకోటలో ప్రశాంత్ కిశోర్ సంచలనం ప్రత్యక్ష రాజకీయాల తొలి...

పురుగులు ప‌రుగులు పెట్టించాయి

పురుగులు ప‌రుగులు పెట్టించాయి ఢిల్లీని కదిలించిన జెన్‌జీ జోరు! హేళనగా పుట్టిన 'కాక్రోచ్ జనతా...

13 ఏళ్ల విద్యార్థినిపై తోటి విద్యార్థుల లైంగిక వేధింపులు

13 ఏళ్ల విద్యార్థినిపై తోటి విద్యార్థుల లైంగిక వేధింపులు పాఠశాల ఆవరణలోనే జరిగిన...

జీ7 సదస్సులో మరోసారి మెరిసిన ‘మెలోడీ’ జోడీ

జీ7 సదస్సులో మరోసారి మెరిసిన 'మెలోడీ' జోడీ ఎవియన్‌లో ముచ్చటించుకున్న మోదీ, మెలోనీ సోషల్...

భార్యకు పెళ్లి చేసిన భర్త

భార్యకు పెళ్లి చేసిన భర్త పన్నెండేళ్లు చిన్నవాడైన యువకుడితో వివాహిత ఎఫైర్ మహిళను కలిసేందుకు...

బెంగాల్ వీధుల్లో ‘అంకుశం’ సీన్ రిపీట్

బెంగాల్ వీధుల్లో ‘అంకుశం’ సీన్ రిపీట్ దోపిడీలు, భూకబ్జాల కేసుల్లో అరెస్టయిన ‘ఫాల్తా...

మంత్రి రామలింగారెడ్డి రాజీనామా!

మంత్రి రామలింగారెడ్డి రాజీనామా! బెంగళూరు అభివృద్ధి శాఖ ఇస్తామని మాటిచ్చి త‌ప్పారు సాగునీటి శాఖ...

రితాబ్రతా బెనర్జీ తిరుగుబాటు

రితాబ్రతా బెనర్జీ తిరుగుబాటు సీపీఎం నుంచి తృణమూల్ మీదుగా బీజేపీ వైపు నయా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.