epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

త్వ‌ర‌లో 4 ల‌క్ష‌ల సాదాబైనామాల‌పై నిర్ణ‌యం

త్వ‌ర‌లో 4 ల‌క్ష‌ల సాదాబైనామాల‌పై నిర్ణ‌యం
తొల‌గిన కోర్టు స్టే- ద‌ర‌ఖాస్తుల‌కు త్వ‌ర‌లో మోక్షం
ద‌శ‌ల వారీగా ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేష‌న్ భ‌వ‌నాల నిర్మాణం
రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో అన్ని స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల‌ను ద‌శ‌ల వారీగా ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేష‌న్ భ‌వ‌నాల ప‌రిధిలోకి తీసుకువ‌స్తామ‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి వెల్ల‌డించారు. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా బుధ‌వారం నాడు గ‌చ్చిబౌలిలోని తాలిమ్‌లో ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేష‌న్ భ‌వ‌న నిర్మాణానికి శంకుస్దాప‌న జ‌రిగిన సంద‌ర్బంగా ఏర్పాటైన స‌భ‌లో మంత్రి పొంగులేటి ప్ర‌సంగించారు. గ‌త ప్ర‌భుత్వం అక్ర‌మంగా తీసుకువ‌చ్చిన ధ‌ర‌ణి పోర్ట‌ల్ ను ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీ మేర‌కు బంగాళాఖాతంలో క‌లిపేశామ‌ని, దేశంలోని 18 రాష్ట్రాల‌లో అధ్య‌య‌నం చేసి భూభార‌తి -2025 చ‌ట్టాన్ని రూపొందించామ‌న్నారు. రోల్ మోడ‌ల్‌గా నిలిచిన ఈ భూభార‌తి చ‌ట్టం మేర‌కు రైత‌న్న‌ల , ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించేందుకు స‌ద‌స్సులు నిర్వ‌హించ‌గా 8.60 ల‌క్ష‌ల ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయ‌ని తెలిపారు. వీటిలో 2ల‌క్ష‌ల ద‌ర‌ఖాస్తులు ప‌రిష్కారం కాగా సుమారు 4ల‌క్ష‌ల సాదాబైనామా ద‌ర‌ఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయ‌ని వివ‌రించారు. రాష్ట్ర హైకోర్టు నిన్న‌నే ఈ సాదాబైనామాల‌పై ఉన్న‌స్టేను తొలగించినందున నిజ‌మైన, అర్హ‌త క‌లిగిన ద‌ర‌ఖాస్తుల‌ను సాధ్య‌మైనంత త్వ‌ర‌గా ప‌రిష్క‌రిస్తామ‌ని మంత్రి పొంగులేటి ప్ర‌క‌టించారు.

రాష్ట్ర ఆర్దిక ప‌రిస్ధితి బాగులేకున్నా…!

రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి బాగులేకున్నా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిగారి నేతృత్వంలో అభివృద్ది, సంక్షేమం రెండు క‌ళ్లుగా ముందుకు సాగుతున్నామ‌ని , గ‌త ప్ర‌భుత్వ త‌ప్పుల‌ను గ‌మ‌నించి ప్ర‌జ‌లు ఇందిర‌మ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నార‌ని అన్నారు. ప్ర‌జ‌ల న‌మ్మ‌కాన్ని వొమ్ము చేయ‌కుండా ప్ర‌గ‌తి సాధ‌న‌లో సాగుతున్నామ‌ని, ఈమేర‌కు ఒక్కొక్క‌టిగా అభివృద్ది కార్యక్ర‌మాలు అమ‌లు జ‌రుగుతున్నాయ‌ని ,దానిలో భాగంగానే ఈ ఇంటిగ్రేటెడ్ స‌బ్ రిజిస్ట్రార్ భ‌వ‌నాల శంకుస్థాప‌న అని వివ‌రించారు. ప్రస్తుతం జిహెచ్ఎంసీ, ఓఆర్ ఆర్ ప‌రిధిలోగ‌ల 39 స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల నుంచి రాష్ట్ర ప్ర‌భుత్వానికి రిజిస్ట్రేష‌న్ల రూపేణా సుమారు 62-63 శాతం ఆదాయం ల‌భిస్తోంద‌ని, వీటిని 11 ఇంటిగ్రేటెడ్ భ‌వ‌నాల ప‌రిధిలోకి తీసుకువ‌స్తామ‌ని తెలిపారు. ఈరోజు శంకుస్థాప‌న చేసుకున్న ఈ భ‌వ‌నం అత్యాధునిక కార్పొరేట్ స్ధాయిలో ఉండ‌బోతోంద‌ని, సుమారు మూడు ఎక‌రాలలోని దాదాపు 50 వేల చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో , 300 కార్లు పార్కింగ్ సౌక‌ర్యం త‌దిత‌రాల‌తో నిర్మిత‌మ‌వ‌బోతోంద‌ని చెప్పారు. ఫైవ్ స్టార్ సౌక‌ర్యాలు సుమారు 8-9 నెల‌ల్లో ఈ భ‌వ‌నాన్ని నిర్మిస్తామ‌ని నిర్మాణ‌సంస్థ‌ చెబుతోంద‌ని, అయితే 6-7 నెల‌ల్లోగా పూర్తి చేయాల‌ని మంత్రిగారు స‌భా ముఖంగా కోరారు. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిగారి చేతుల మీదుగా ఈ భ‌వ‌నం ప్రారంభిస్తామ‌ని చెబుతూ ద‌శ‌ల వారీగా మిగిలిన 10 ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేష‌న్ భ‌వ‌నాల‌తో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా అన్ని సౌక‌ర్యాల‌తో ఇటువంటి భ‌వ‌నాల నిర్మాణం చేప‌డ‌తామ‌ని తెలిపారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

మా కుటుంబాన్ని వేధించొద్దు

మా కుటుంబాన్ని వేధించొద్దు సుమంత్ విష‌యంలో వాస్తవాలను ప‌రిశీలించండి 20 రోజులుగా మా కుటుంబంపై...

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ ప్రజల సమస్యలు,...

ఎర్రవల్లిలో ఉద్రిక్తత

ఎర్రవల్లిలో ఉద్రిక్తత కేసీఆర్ ఫాం హౌస్‌కు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌...

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను మోసం చేసింది వంద...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.