epaper
Tuesday, October 27, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కన్నెపల్లి ర్యాంప్‌లో అద‌న‌పు వ‌సూళ్లు

కన్నెపల్లి ర్యాంప్‌లో అద‌న‌పు వ‌సూళ్లు
కాసుల దందాకు టీజీఎండీసీ అధికారుల అండ!
ఆదివారం ఒక్కో లారీకి రూ.2,500 చొప్పున వసూలు
డబ్బులివ్వని లారీ య‌జ‌మానుల వాహ‌నాలు ప‌క్క‌కు
తప్పేమీ లేదన్నట్లుగా అధికారుల స‌మాధానం
అక్రమాలకు క్షేత్ర‌స్థాయి అధికారుల ప్ర‌త్య‌క్ష మ‌ద్ద‌తు

కాకతీయ, తెలంగాణ బ్యూరో / భూపాలపల్లి : ఇసుక ర్యాంపుల్లో పారదర్శకంగా కార్యకలాపాలు నిర్వహించాల్సిన బాధ్యతను పర్యవేక్షణ సంస్థలు విస్మరిస్తున్నాయా? ప్రభుత్వ నిబంధనల ప్రకారం జరగాల్సిన ఇసుక లోడింగ్‌ ప్రక్రియలో అదనపు వసూళ్లకు అవకాశం కల్పిస్తున్నారా? అంటే అవున‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని కన్నెపల్లి ఇసుక ర్యాంప్‌ నుంచి వెలువడుతున్న ఫిర్యాదులు.. అధికారుల స‌మాధానాలు కూడా అక్ర‌మాల‌ను బ‌హిర్గ‌తం చేస్తున్నాయి. జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లా మ‌హ‌దేవ్‌పూర్ మండ‌లంలోని కన్నెపల్లి ఇసుక ర్యాంప్‌లో అదనపు వసూళ్ల వ్యవహారంపై టీజీఎండీసీ అధికారులు విస్తుగొల్పేలా ఉంది. గ‌త కొద్దిరోజులుగా ఇసుక ర్యాంపుల్లో అద‌న‌పు వ‌సూళ్ల ప‌ర్వంతో లారీ య‌జ‌మానులు వేద‌న‌కు గుర‌వుతున్నారు. ఒక్కో లారీకి లోడింగ్‌ ఛార్జీల పేరుతో రూ.2,500 అదనంగా డిమాండ్‌ చేస్తున్నారని లారీ యజమానులు వాపోతున్నారు. ఈ క్ర‌మంలోనే ఆదివారం సైతం క‌న్నెప‌ల్లి ఇసుక ర్యాంపులో అద‌న‌పు వ‌సూళ్ల‌కు తెగ‌బ‌డ్డారు. అడిగిన మొత్తం చెల్లించకపోతే లారీలను పక్కకు నిలిపి ఇసుక లోడింగ్‌ చేయకుండా ఇబ్బందులకు పాల్ప‌డ్డారు. ఈ ఆరోపణలపై టీజీఎండీసీలోని ఓ అధికారిణి వివ‌ర‌ణ కోరే ప్ర‌య‌త్నం చేయ‌గా.. వ‌సూళ్లు చేప‌ట్ట‌డం త‌ప్పేం కాద‌న్న‌ట్లుగా స‌మాధాన ఇవ్వ‌డం విశేషం. కాంట్రాక్ట‌ర్ల‌కు ఏ స్థాయిలో అధికారి స‌హ‌క‌రిస్తున్నాడో.. ఆయ‌న సంభాష‌ణ‌లోనే స్ప‌ష్టమ‌వుతోంది.

లోడింగ్‌ దగ్గరే అదనపు భారం

కన్నెపల్లి ర్యాంప్‌లో ఆదివారం ఒక్కో లారీకి రూ.2,500 చొప్పున అదనంగా వసూలు చేశారని లారీ యజమానులు చెబుతున్నారు. అద‌న‌పు వ‌సూళ్ల‌కు స‌హ‌క‌రించని లారీల‌ను ప‌క్క‌కు పెట్టిన దృశ్యాల వీడియో కూడా కాక‌తీయకు చేరింది. అధికారుల‌కు ఫిర్యాదు చేసినా ప‌ట్టించుకోవ‌డం లేద‌ని లారీ య‌జ‌మానులు వాపోతున్న ఆడియో కూడా కాక‌తీయ‌కు చిక్కింది. అద‌న‌పు వ‌సూళ్ల‌తో త‌మ‌కు ద‌క్కాల్సిన కాసింత శ్ర‌మ‌ను..లాభాన్నికూడా క్వారీ య‌జ‌మానులే లాగేసుకుంటున్నార‌ని, టీజీఎండీసీ అధికారుల‌కు, ఉన్న‌తాధికారుల‌కు ఎన్ని వంద‌ల సార్లు ఫిర్యాదులు చేసినా ప‌ట్టించుకున్న పాపాన పోవ‌డం లేదంటూ ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇసుక కొనుగోలు, రవాణా, వాహన నిర్వహణ ఖర్చులతో ఇప్పటికే ఇబ్బందులు పడుతున్న తమపై ఈ అదనపు భారం మోపడం అన్యాయమని వాపోతున్నారు. అడిగిన డబ్బులు ఇవ్వలేమని చెప్పిన వాహనాలకు లోడింగ్‌ నిలిపివేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఫలితంగా లారీలు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని, వాహనాల పని సమయం వృథా అవడంతో పాటు అదనపు నిర్వహణ ఖర్చులు పెరుగుతున్నాయని పేర్కొంటున్నారు.

ఫిర్యాదులపై స్పందన ఏదీ?

అద‌న‌పు వ‌సూళ్ల‌పై ఎన్నిమార్లు ఫిర్యాదు చేసినా ఫలితం కనిపించడం లేదని లారీ యజమానులు వాపోతున్నారు. ఫిర్యాదులు అందినప్పుడు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి, వసూళ్లకు సంబంధించిన రికార్డులను పరిశీలించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు స్పందించడం లేదని విమర్శిస్తున్నారు. అయితే అధికారులు ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తున్నార‌నేది స్ప‌ష్ట‌మ‌వుతోంది. నిబంధనల ప్రకారం బిల్లులు చెల్లించిన లారీ యజమానుల నుంచి ఇసుక రైజింగ్‌ కాంట్రాక్టర్లు మళ్లీ అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంపై అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదని, అక్రమాలు జరుగుతున్నా ప్రత్యక్షంగా చూస్తూ మిన్నకుండిపోతోందని లారీ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓవర్‌లోడ్‌, నకిలీ వేబిల్లులు, రాత్రివేళల్లో ఇసుక రవాణా, నదీ గర్భంలో యథేచ్ఛగా తవ్వకాలు వంటి అంశాలు ఇసుక ర్యాంపుల వద్ద తరచూ చర్చకు వస్తున్నాయి. ఇన్ని ఫిర్యాదులు, విమర్శలు వినిపిస్తున్నా వాటిపై సమగ్ర తనిఖీలు, పారదర్శక విచారణ జరుగుతున్నాయా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధుల అండ ఉందనే విమర్శల నేపథ్యంలో, అక్రమాలపై ప్రశ్నించేవారి ఆరోపణలుగా కొట్టిపారేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇసుక రవాణా, లోడింగ్‌ ఛార్జీలు, వేబిల్లులు, తవ్వకాలపై సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి వాస్తవాలను వెల్లడించాలని స్థానికులు కోరుతున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పేదలకు ఇళ్లు.. రైతులకు రహదారులు

పేదలకు ఇళ్లు.. రైతులకు రహదారులు రెండో విడతలో మరో 1,100 ఇందిరమ్మ ఇళ్లు పొలాల...

తుమ్మిడిహెట్టిపై మ‌హారాష్ట్ర సానుకూలం!

తుమ్మిడిహెట్టిపై మ‌హారాష్ట్ర సానుకూలం! 152 మీటర్ల ఎత్తు ప్రతిపాదనపై పునఃపరిశీలనకు సీఎం ఫ‌డ్న‌వీస్‌...

మెడికవర్‌పై ఉన్న శ్రద్ధ.. ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులపై ఏదీ?

మెడికవర్‌పై ఉన్న శ్రద్ధ.. ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులపై ఏదీ? 17 వేల మంది ఉద్యోగుల...

కాంగ్రెస్‌ తెచ్చిన కరువు!

కాంగ్రెస్‌ తెచ్చిన కరువు! దేవాదుల, కల్వకుర్తి నుంచి ఎందుకు నీళ్లు ఎత్తడం లేదు? తమ్మిడిహట్టి...

కరువును వదిలి ఢిల్లీ పర్యటనలా?

కరువును వదిలి ఢిల్లీ పర్యటనలా? ఖర్గే వ్యాఖ్యలు దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం ఓటర్ల ప్రత్యేక...

బౌద్ధ స్తూపానికి పూర్వ వైభవం!

బౌద్ధ స్తూపానికి పూర్వ వైభవం! అంతర్జాతీయ బౌద్ధ పర్యాటక కేంద్రంగా నేలకొండపల్లి 10 రోజుల్లో...

రేడియ‌ల్ రోడ్ టెండ‌ర్ల‌లో అక్ర‌మాలు

రేడియ‌ల్ రోడ్ టెండ‌ర్ల‌లో అక్ర‌మాలు రోడ్‌–2 ప్రాజెక్టులో ఆర్థిక అవకతవకలు జ‌రిగాయి బినామీల‌కు కాంట్రాక్ట‌ర్ల‌కు...

రేవంత్‌.. చరిత్రలో నిలుస్తావా? కాలగర్భంలో కలిసిపోతావా?

రేవంత్‌.. చరిత్రలో నిలుస్తావా? కాలగర్భంలో కలిసిపోతావా? జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డుపై శాశ్వత పరిష్కారం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.