epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

రాధాకృష్ణ రాతలు అవాస్తవాలు

రాధాకృష్ణ రాతలు అవాస్తవాలు
సింగరేణిపై క‌ల్పిత కట్టు కథనాలు
నా వ్యక్తిత్వ హననం చేసేలా ఆయ‌న రాత‌లు
సైట్ విజిట్ నిబంధన కొత్తది కాదు.. దేశవ్యాప్తంగా అమ‌లులో ఉన్న‌దే
డీజిల్ సరఫరాలో కుంబ‌కోణ‌మంటూ నిరాధార ఆరోప‌ణ‌లు
2014 నుంచి జ‌రిగిన‌ అన్ని టెండర్లపై విచారణకు సిద్ధం
సింగ‌రేణిలో కాంట్రాక్ట‌ర్ల‌లో ఎక్కువ మంది బీఆర్ ఎస్‌కు చెందిన‌వారే
సింగరేణి ప్రజల ఆస్తి.. స్వయంప్రతిపత్తితో పనిచేస్తోంది
సింగరేణిపై గద్దలు–రాబందులను వాలనివ్వను
కార్మికుల మనోధైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం జ‌రుగుతోంది
ఆంధ్ర‌జ్యోతి క‌థ‌నాల‌పై మ‌రోసారి ధ్వ‌జ‌మెత్తిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : “రాధాకృష్ణ… నువ్వు రాసింది అవాస్తవమని ఒప్పుకో. లేదంటే అది నా వ్యక్తిత్వ హననంగానే భావించాల్సి వస్తుంది” అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తీవ్ర హెచ్చరిక చేశారు. సింగరేణి సంస్థపై, తనపై వస్తున్న కథనాలు పూర్తిగా వాస్తవ విరుద్ధమని, పెట్టుబడులు–కట్టు కథలతో విషపు రాతలు రాయడం ద్వారా సంస్థకూ, కార్మికులకూ నష్టం కలిగిస్తున్నారని మండిపడ్డారు. శనివారం హైద‌రాబాద్‌లో జ్యోతిరావు పూలే భవన్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణిలో పనిచేస్తున్న దాదాపు 42 వేల మంది పర్మినెంట్ ఉద్యోగులు, 30 వేల మంది ఔట్‌సోర్సింగ్ కార్మికుల మనోధైర్యాన్ని దెబ్బతీసేలా వస్తున్న తప్పుడు కథనాలు తనను తీవ్రంగా ఆవేదనకు గురిచేశాయన్నారు. సింగరేణిలో జరిగే టెండర్లు, కాంట్రాక్టులు, వాటికి సంబంధించిన ఫైళ్లు తన వద్దకు గానీ, రాష్ట్ర ప్రభుత్వానికి గానీ రావని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. సింగరేణి కాలరీస్ సంస్థకు ప్రత్యేక బోర్డు ఉందని, సీనియర్ అధికారులు స్వయంప్రతిపత్తితో నిర్ణయాలు తీసుకుంటారని చెప్పారు. సంస్థలో అమలులో ఉన్న విధివిధానాలు, నిబంధనల ప్రకారమే అన్ని నిర్ణయాలు జరుగుతాయని, రాజకీయ జోక్యానికి ఎక్కడా అవకాశం లేదన్నారు.

సైట్ విజిట్ నిబంధనపై తప్పుడు ప్రచారం

నైనీ బొగ్గు బ్లాక్ టెండర్ విషయంలో కాంట్రాక్టర్లు ముందుగా సైట్ విజిట్ చేయాలన్న నిబంధనను తామే కొత్తగా పెట్టినట్లు రాధాకృష్ణ రాయడం పూర్తిగా అవాస్తవమని భట్టి విక్రమార్క విమర్శించారు. ఈ నిబంధన కేవలం సింగరేణిలో మాత్రమే లేదని, కోల్ ఇండియా, ఎన్ఎండీసీ, ఆయిల్ కంపెనీలు సహా అనేక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఏళ్లుగా అమలులో ఉందన్నారు. 2018 నుంచే సింగరేణిలో ఈ విధానం కొనసాగుతోందని, సీఎంపీడీఐఎల్ రూపొందించిన టెండర్ డాక్యుమెంట్లలో ఇదే స్పష్టంగా ఉందని రుజువులతో వివరించారు. సింగరేణిలో డీజిల్ సరఫరాను కాంట్రాక్టర్లకు అప్పగించడం ద్వారా కుంభకోణం జరిగిందన్న ఆరోపణలను ఆయన ఖండించారు. ఈ విధానం 2022లోనే అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో అమలులోకి వచ్చిందని, జీఎస్టీ మార్పులు, డీజిల్ దొంగతనాలు నివారించడానికే ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. దేశవ్యాప్తంగా కాంట్రాక్టుల్లో ఇదే విధానం అమలులో ఉందని గుర్తుచేశారు.

సుజన్ రెడ్డి కంపెనీపై కట్టు కథలు

సింగరేణి టెండర్లను ముఖ్యమంత్రి బావమరిదికి కట్టబెడుతున్నారన్న ప్రచారం పూర్తిగా కట్టుకథేనని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. శోధా కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ దీప్తి రెడ్డి అని, ఆమె మాజీ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కుమార్తె అని చెప్పారు. ఆమె భర్తే సుజన్ రెడ్డి అని వివరించారు. అలాగే సింగరేణి సంస్థలో ప్రధాన కాంట్రాక్టర్లుగా ఉన్న ఐదుగురు కూడా టీఆర్‌ఎస్‌కు సంబంధించిన వారేనని తెలిపారు. హరీశ్ రావు లేఖ రాస్తే, నైనీ బ్లాక్ టెండర్‌తో పాటు 2014 నుంచి ఇప్పటి వరకు సింగరేణిలో జరిగిన అన్ని టెండర్లు, కాంట్రాక్టులపై విచారణకు సిద్ధంగా ఉన్నామని భట్టి విక్రమార్క ప్రకటించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి విదేశీ పర్యటన నుంచి రాగానే స్వయంగా ఆయనను ఒప్పించి విచారణకు ఆదేశాలు ఇప్పిస్తానన్నారు. అప్పుడు వాస్తవాలు ప్రజల ముందుకు వస్తాయని చెప్పారు.

సింగరేణి తెలంగాణ ప్రజల ఆస్తి

“నేను రాజకీయాల్లోకి వచ్చినది ఆస్తులు దోచుకోవడానికి కాదు. ప్రజల ఆస్తులను కాపాడటానికే వచ్చాను” అని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. 40 ఏళ్లుగా ఉన్నత విలువలతో రాజకీయాల్లో ఉన్నానని, సింగరేణి కార్మికుల రక్తం–చెమటతో ఏర్పడిన ఈ సంస్థపై గద్దలు, రాబందులు, పెద్దలను వాలనివ్వనని తేల్చిచెప్పారు. వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాల కోసం సింగరేణిపై తప్పుడు ప్రచారాలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. రాధాకృష్ణ తన రాతలు అవాస్తవమని స్వయంగా తిరిగి రాయకపోతే, వాటిని వ్యక్తిత్వ హననంగా భావించి తదుపరి చర్యలు తీసుకుంటామని మరోసారి హెచ్చరించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కరెంటు లేక రైతుల అవస్థలు

కరెంటు లేక రైతుల అవస్థలు కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యంతో పంటలు ఎండుతున్నాయి ఎల్‌నినో ముప్పు...

ఏఎమ్మార్‌లో ఈడీ రైడ్‌

ఏఎమ్మార్‌లో ఈడీ రైడ్‌ రూ.650 కోట్ల బొగ్గు నిధుల మళ్లింపుపై సోదాలు! హైదరాబాద్‌లో ఏఎంఆర్‌...

వాస్తవాలు రాస్తే ఉక్రోషం..!

వాస్తవాలు రాస్తే ఉక్రోషం..! నాపై వార్తలు రాసిన వాళ్లపై కేసులు పెట్టండి ‘కాకతీయ’ స్టాఫర్‌పై...

మా కుటుంబాన్ని వేధించొద్దు

మా కుటుంబాన్ని వేధించొద్దు సుమంత్ విష‌యంలో వాస్తవాలను ప‌రిశీలించండి 20 రోజులుగా మా కుటుంబంపై...

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.