epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ప్రజా పాలన కాదు… పర్సంటేజీల పాలన!

ప్రజా పాలన కాదు… పర్సంటేజీల పాలన!
ఎన్నికల హామీలు విస్మరించిన కాంగ్రెస్ ప్ర‌భుత్వం
పరకాల అభివృద్ధి ఘనత బీఆర్‌ఎస్‌దే
కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి నిలిచిపోయింది
రెండేళ్ల పాలనలో పట్టణంలో కనీస అభివృద్ధి లేదు
ప‌ర‌కాల ఎన్నిక‌ల ప్ర‌చారంలో మాజీ ఎమ్మెల్యే ధ‌ర్మారెడ్డి
మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ విజయంపై ధీమా

కాక‌తీయ‌, ప‌ర‌కాల : రాష్ట్రంలో కాంగ్రెస్ పేరుకే ప్రజా పాలన అంటూ చెప్పుకుంటోందని, వాస్తవంలో మాత్రం పర్సంటేజీల పాలన కొనసాగుతోందని ప‌రకాల మాజీ ఎమ్మెల్యే చ‌ల్లా ధ‌ర్మారెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తూ కాలం గడుపుతోందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. పరకాల మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం పట్టణంలోని పలు వార్డుల్లో జ‌రిగిన ప్ర‌చారంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌.ఎస్‌.ప్రవీణ్ కుమార్, మున్సిపాలిటీ కోఆర్డినేటర్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డితో క‌ల‌సి ధ‌ర్మారెడ్డి ప్ర‌చారం నిర్వ‌హించారు. ఈసంద‌ర్భంగా మాజీ ఎమ్మెల్యే ధ‌ర్మారెడ్డి బీఆర్‌ఎస్ నేత పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటింటి ప్రచారం నిర్వ‌హించారు.ఈసంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వమంటూ గొప్పలు చెప్పుకుంటూ ప్రజలను నిలువునా మోసం చేస్తోందన్నారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌కు ప్రజలే తగిన గుణపాఠం చెప్పే రోజులు దగ్గరపడ్డాయని హెచ్చరించారు. పరకాల పట్టణ ప్రజలు మళ్లీ బీఆర్‌ఎస్ పార్టీని ఆశీర్వదించేందుకు సిద్ధంగా ఉన్నారని, మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థుల గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అధికారం లేని కాంగ్రెస్ నేతలు ప్రజలకు ఏం అభివృద్ధి చేస్తారని ప్రశ్నిస్తూ, ప్రజా సమస్యలను పరిష్కరించే సత్తా బీఆర్‌ఎస్‌కే ఉందని స్పష్టం చేశారు.

పరకాల అభివృద్ధి చేసింది బీఆర్‌ఎస్‌నే
పరకాల పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత పూర్తిగా బీఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనని నాయకులు గుర్తుచేశారు. గత రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే పరకాల పట్టణానికి పట్టిన శనిలా మారారని తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పటివరకు పట్టణంలో తట్టెడు మట్టి కూడా పోయని దుస్థితి నెలకొందని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులకు ఇప్పుడు కాంగ్రెస్ నేతలు రంగులు వేసుకుని తమ ఘనతగా చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాలను ధ్వంసం చేసి కొత్తవి పెట్టుకోవడం కాంగ్రెస్ నేతల దుర్మార్గ రాజకీయానికి నిదర్శనమని అన్నారు.

కాంగ్రెస్ పాలనలో హామీలన్నీ హుళక్కే
పట్టణానికి కనీస మౌలిక వసతులు కల్పించడంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, పారిశుధ్యం, తాగునీరు, రహదారుల అభివృద్ధి వంటి అంశాలపై కనీస శ్రద్ధ కూడా పెట్టలేకపోయిందని ఆరోపించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ గాలికొదిలేశారని విమర్శించారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ లేదు, రూ.500 గ్యాస్ సిలిండర్ అమలు కాలేదు, రైతు రుణమాఫీ ఊసే లేదు, ఇందిరమ్మ ఇండ్ల పథకంలో గోల్‌మాల్ జరుగుతోందని, మహిళలకు రూ.2500 ఆర్థిక సహాయం ఇవ్వలేదని, వికలాంగులకు రూ.6000 పెన్షన్ అమలు కాలేదని, విద్యార్థినులకు స్కూటీలు ఇవ్వలేదని మండిపడ్డారు. ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్పనున్నారని అన్నారు.

గులాబీ జెండా ఎగరడం ఖాయం
ఇలాంటి చేతకాని ప్రభుత్వాన్ని గద్దె దించాలంటే ప్రజలంతా ఐక్యంగా నిలబడి పరకాల గడ్డపై గులాబీ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని కోరారు. కాంగ్రెస్ మాటలు విని మళ్లీ మోసపోవడానికి ప్రజలు సిద్ధంగా లేరని స్పష్టం చేశారు. ఎప్పుడెప్పుడు ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలా అని ప్రజలు ఎదురుచూస్తున్నారని, మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో బోగస్ కాంగ్రెస్‌కు ప్రజల చేతుల్లో తప్పకుండా గుణపాఠం తప్పదని హెచ్చరించారు. పరకాల పట్టణాన్ని మున్సిపాలిటీగా మార్చింది, అభివృద్ధి చేసింది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని, భవిష్యత్తులో మరింత అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లేది కూడా బీఆర్‌ఎస్‌నేనని నాయకులు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాల్లో బీఆర్‌ఎస్ కౌన్సిలర్ అభ్యర్థులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువజన విభాగం ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం మంచినీరు, ఘన వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణపై ప్రత్యేక...

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక...

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర!

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర! రోడ్లన్నీ ఆక్రమణ.. పార్కింగ్ స్థ‌లాల్లోనూ అమ్మకం చైర్ పర్సన్...

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం పంటల వైవిధ్యీకరణతో వాతావరణ మార్పులు మార్కెట్‌ ఒడిదుడుకులను...

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే కేసీఆర్‌ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి...

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి మట్టి...

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.