epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ట్విట్టర్ టిల్లు మాటలతో ప్రజలు మోసపోరు

ట్విట్టర్ టిల్లు మాటలతో ప్రజలు మోసపోరు
కేటీఆర్ వ్యాఖ్యలపై ఎంపీ చామల కిరణ్‌రెడ్డి ఘాటు కౌంటర్
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించాలని పిలుపు

కాకతీయ, భువనగిరి : సోషల్ మీడియాలో చిల్లర వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కేటీఆర్ ప్రయత్నిస్తున్నారని భువనగిరి లోక్‌సభ సభ్యుడు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి భాషపై విమర్శలు చేసే అర్హత కేటీఆర్‌కు లేదని, బూతు మాటలకు నిజమైన రాజులు బీఆర్‌ఎస్ నేతలేనని ఎద్దేవా చేశారు. “కేటీఆర్ ఎక్స్ (ట్విట్టర్)లో చిల్లర మాటలు రాస్తున్నారు. బూతు అనే పదానికి నాయకుడు ఎవరు అని గూగుల్‌లో వెతికితే మీ నాయన కేసీఆర్ పేరే ముందుగా వస్తుంది” అని ఎంపీ ఘాటుగా వ్యాఖ్యానించారు. గతంలో కేసీఆర్ వాడిన భాష ఎలా ఉందో ఒకసారి యూట్యూబ్‌లో చూసుకోవాలని కేటీఆర్‌కు సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడే భాష మనుషులను బట్టి ఉంటుందని, ప్రజలకు అర్థమయ్యే రీతిలోనే ఆయన విషయాలను వివరిస్తున్నారని ఎంపీ అన్నారు. “మీరు రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకున్నారో, అప్పుల పాలు చేశారో ప్రజలకు పూర్తిగా అర్థమైంది. అందుకే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను ప్రజలు చెంప మీద కొట్టారు” అని ధ్వజమెత్తారు.

వరుస ఎన్నికల్లో ప్రజలు బీఆర్‌ఎస్‌కు బుద్ధి చెప్పారు

2024 లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు గుండు సున్నా ఇచ్చారని, కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లోనూ ప్రజలు తగిన తీర్పు ఇచ్చారని ఎంపీ గుర్తు చేశారు. పంచాయతీ ఎన్నికల్లోనూ బీఆర్‌ఎస్‌ను ప్రజలు చిత్తు చేశారని అన్నారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు దగ్గరపడటంతో కేటీఆర్ మళ్లీ చిల్లర మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండేళ్లలో రాష్ట్రాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. కానీ కేసీఆర్ కుటుంబం మాత్రం “ఇంటికో ఉద్యోగం” అని చెప్పి తమ ఇంట్లోనే ఐదుగురికి ఐదు ఉద్యోగాలు ఇచ్చుకుందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కుటుంబం అసలు తత్వం తెలంగాణ ప్రజలు గుర్తించాలని సూచించారు. రాబోయే వారం రోజుల్లో బీఆర్‌ఎస్ నేతలు గల్లీల్లో తిరుగుతూ చిల్లర ప్రచారం చేస్తారని, ప్రజలు వారి మాటలను పట్టించుకోవద్దని ఎంపీ కోరారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌పై నమ్మకం ఉంచి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాల్సిన అవసరం ఉందని ఎంపీ స్పష్టం చేశారు. “ట్విట్టర్ టిల్లులు పోస్టులు పెట్టినంత మాత్రాన ఏమీ ఒరిగేది లేదు. చివరకు తీర్పు చెప్పేది ప్రజలే” అని చామల కిరణ్‌రెడ్డి తేల్చిచెప్పారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఎస్సారెస్పీ కాలువలతో రైతులను ఆదుకోవాలి

ఎస్సారెస్పీ కాలువలతో రైతులను ఆదుకోవాలి తుంగతుర్తి ప్రాంతానికి నీటిని విడుదల చేయాలి వర్షాభావంతో ఎండుతున్న...

ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని మహిళపై అత్యాచారం

ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని మహిళపై అత్యాచారం సిమెంట్‌ బస్తాలు ఇస్తానంటూ ఇంటికి పిలిచిన...

శ్రీశైలం నీటిని ఏపీ తరలిస్తున్నా.. చూస్తూ ఊరుకుంటారా?

శ్రీశైలం నీటిని ఏపీ తరలిస్తున్నా.. చూస్తూ ఊరుకుంటారా? సాగర్‌ నీటిపై జిల్లా మంత్రులు...

బుల్లెట్ రైలు కారిడార్‌లో నకిరేకల్‌ను చేర్చాలి

బుల్లెట్ రైలు కారిడార్‌లో నకిరేకల్‌ను చేర్చాలి కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు...

భువనగిరి రోడ్ల అభివృద్ధికి గడ్కరీకి ఎంపీ వినతి

భువనగిరి రోడ్ల అభివృద్ధికి గడ్కరీకి ఎంపీ వినతి కాకతీయ, భువనగిరి : భువనగిరి...

తల్లిదండ్రుల జ్ఞాపకార్థం డ్రమ్ములు అందజేత

తల్లిదండ్రుల జ్ఞాపకార్థం డ్రమ్ములు అందజేత కాకతీయ, తుంగతుర్తి: తాను చిన్ననాడు ఓనమాలు నేర్చిన...

మ‌హిళ‌ల‌కు రూ.344 కోట్ల వడ్డీ లేని రుణాలు

మ‌హిళ‌ల‌కు రూ.344 కోట్ల వడ్డీ లేని రుణాలు డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నరసయ్య తుంగతుర్తిలో...

ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి

ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాంకు వినతిపత్రం అందజేత హైదరాబాదులో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.