బాధిత కుటుంబానికి అండగా ఉంటాం
డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ
కాకతీయ, నల్లగొండ : నల్లగొండ జిల్లా కాకులకొండారం గ్రామానికి చెందిన బాకీ మల్లయ్య ఇటీవల మృతి చెందారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర గౌరవ అధ్యక్షులు డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ, రాష్ట్ర అధ్యక్షులు రేగుంట సునీల్ మాదిగతో కలిసి శుక్రవారం మల్లయ్య నివాసానికి వెళ్లి చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర కార్యదర్శి బాకీ నర్సింహా మాదిగ, కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ విషాద సమయంలో కుటుంబానికి అండగా ఉంటామని రామకృష్ణ భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కావ్వంపెల్లి రవి మాదిగ, రాష్ట్ర ముఖ్య నాయకులు సప్పి పోచన్న తదితరులు పాల్గొన్నారు.

