epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

అక్షర చిట్ ఫండ్స్ డైరెక్టర్ అరెస్ట్..

అక్షర చిట్ ఫండ్స్ డైరెక్టర్ అరెస్ట్..

బెంగళూరు విమానాశ్రయంలో నాటకీయ అరెస్ట్..

అమెరికాకు పారిపోతుండగా అదుపులోకి..

పెట్టుబడిదారుల నుంచి లక్షల సేకరణ ఆరోపణలు..

సుబేదారి పోలీసుల ప్రత్యేక బృందం ఆపరేషన్..

కోర్టులో హాజరు.. రిమాండ్ విధింపు..

ఆర్థిక లావాదేవీలపై లోతైన దర్యాప్తు..

మరిన్ని బాధితులు వెలుగులోకి వచ్చే అవకాశం..

కాకతీయ, వరంగల్ బ్యూరో : వరంగల్ నగరానికి చెందిన అక్షర చిట్ ఫండ్స్ డైరెక్టర్ పేరాల శ్రీవిద్యను సుబేదారి పోలీసులు అరెస్ట్ చేశారు. 2022లో నమోదైన చిట్ ఫండ్ మోసం కేసులో ఆమె ప్రధాన నిందితురాలిగా ఉన్నారు. కొంతకాలంగా పోలీసులకు దొరకకుండా తప్పించుకుని తిరుగుతుండగా, విశ్వసనీయ సమాచారం ఆధారంగా పోలీసులు బెంగళూరు విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. అమెరికాకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న సమయంలోనే ఆమెను పట్టుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

2022లో నమోదు అయిన కేసు.. పెట్టుబడిదారుల ఫిర్యాదులు..

2022లో సుబేదారి పోలీస్ స్టేషన్ లో శ్రీవిద్యపై మోసం కేసు నమోదైంది. చిట్ ఫండ్ పేరుతో అధిక లాభాల హామీ ఇచ్చి పలువురు పెట్టుబడిదారుల నుంచి లక్షల రూపాయలు సేకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. గడువు పూర్తైన తర్వాత డబ్బులు చెల్లించకుండా కార్యాలయాన్ని మూసివేసి పరారైనట్లు బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

పరారీలో నిందితురాలు.. ప్రత్యేక బృందాల గాలింపు..

కేసు నమోదు అయిన తర్వాత శ్రీవిద్య కొంతకాలం వరంగల్‌లోనే ఉండి, అనంతరం ఇతర ప్రాంతాలకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఆమె విదేశాలకు పారిపోయే ప్రయత్నం చేస్తున్నారన్న సమాచారంతో లుక్‌అవుట్ నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. బెంగళూరు వెళ్లి అక్కడి నుంచి అమెరికాకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న సమయంలోనే ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు అనంతరం శనివారం రాత్రి ఆమెను వరంగల్‌కు తీసుకువచ్చి కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి రిమాండ్ విధించారు. అనంతరం ఆమెను నర్సంపేట జైలు కు తరలించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

ఆర్థిక లావాదేవీలపై లోతైన దర్యాప్తు..

అక్షర చిట్ ఫండ్స్ సంస్థకు సంబంధించిన బ్యాంకు ఖాతాలు, ఆస్తులు, లావాదేవీలపై పోలీసులు సమగ్ర విచారణ చేపట్టినట్లు సమాచారం. బాధితుల నుంచి ఇంకా ఫిర్యాదులు రావచ్చని భావిస్తున్న పోలీసులు, ఎవరైనా మోసపోయి ఉంటే ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని సూచించారు. సంస్థలో ఇతర భాగస్వాములు లేదా సహకరించిన వ్యక్తులు ఉన్నారా అన్న కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతోంది. శ్రీవిద్య అరెస్ట్‌తో బాధితుల్లో కొంత ఊరట కనిపిస్తున్నప్పటికీ, తమ డబ్బులు తిరిగి వస్తాయా అనే ఆందోళన వ్యక్తమవుతోంది. పోలీసుల దర్యాప్తు పూర్తయ్యాక తదుపరి చట్టపరమైన చర్యలు చేపడతామని అధికారులు తెలిపారు. కేసు పురోగతిపై స్థానికంగా ఆసక్తి నెలకొంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం మంచినీరు, ఘన వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణపై ప్రత్యేక...

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక...

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర!

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర! రోడ్లన్నీ ఆక్రమణ.. పార్కింగ్ స్థ‌లాల్లోనూ అమ్మకం చైర్ పర్సన్...

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం పంటల వైవిధ్యీకరణతో వాతావరణ మార్పులు మార్కెట్‌ ఒడిదుడుకులను...

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే కేసీఆర్‌ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి...

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి మట్టి...

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.