epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కౌన్ బ‌నేగా మేయ‌ర్‌

కౌన్ బ‌నేగా మేయ‌ర్‌
కొత్తగూడెం మేయర్ రేసులో ముగ్గురు
ఎస్టీ జనరల్ రిజర్వేషన్‌తో మేయర్ ఎన్నికపై ఉత్కంఠ
సీపీఐలో మూడ్ గణేష్, కళావతి, నునావత్ శ్యామల మధ్య పోటీ
సీపీఐలో అభ్యర్థి ఎంపికపై రాష్ట్ర, జిల్లా నేతల మథనం
కాంగ్రెస్‌లో ఉపమేయర్ పదవిపై తీవ్ర పోటీ
సోమవారం ఎన్నికపై కొత్త‌గూడెం రాజ‌కీయాల్లో ఉత్కంఠ‌

కాకతీయ, కొత్తగూడెం రూరల్ : కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక ఉత్కంఠభరితంగా మారింది. ఎస్టీ జనరల్ రిజర్వేషన్ కింద జరుగుతున్న ఈ ఎన్నికలో సిపిఐ పార్టీ నుంచి ముగ్గురు నేతల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. మూడ్ గణేష్, కళావతి, నునావత్ శ్యామల మేయర్ రేసులో ఉండటంతో అసలు కుర్చీ ఎవరి ఖాతాలో పడుతుందన్నది హాట్ టాపిక్‌గా మారింది. కార్పొరేషన్ ఎన్నికల్లో సిపిఐ కీలక స్థానం దక్కించుకోవడంతో మేయర్ పదవిపై ఆ పార్టీ ఆశలు పెరిగాయి. కార్పొరేషన్ ఎన్నికలు సజావుగా ముగిసినా, మేయర్ ఎంపిక విషయంలో సిపిఐలో అంతర్గత పోటీ స్పష్టంగా కనిపిస్తోంది. గెలుపుతో ఉత్సాహంగా ఉన్నప్పటికీ, ఎవరిని మేయర్‌గా ఎంపిక చేయాలన్న విషయంలో పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకత్వం తలమునకలై చర్చలు కొనసాగిస్తోంది. పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసిన నేతలందరికీ మేయర్ పదవిపై ఆశలు ఉండటంతో నిర్ణయం కీలకంగా మారింది.

సీపీఐలో ట్రయాంగిల్ ఫైట్

కొత్తగూడెం కార్పొరేషన్‌లో తొలిసారి మేయర్ పదవి దక్కించుకునే అవకాశం రావడంతో సిపిఐలో తీవ్ర పోటీ నెలకొంది. 31వ డివిజన్ కార్పొరేటర్ నునావత్ శ్యామల పేరు ఇప్పటికే ప్రధానంగా వినిపిస్తోంది. చదువుకున్న నాయకురాలిగా, పార్టీకి నిబద్ధతతో సేవలందించిన వ్యక్తిగా ఆమెకు మంచి గుర్తింపు ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే సమయంలో సీతంపేట ప్రాంతానికి చెందిన మూడ్ గణేష్, కొత్తగూడెం ప్రాంతానికి చెందిన కళావతి పేర్లు కూడా మేయర్ రేసులో బలంగా వినిపిస్తున్నాయి. ముగ్గురు అభ్యర్థులూ పార్టీకి విధేయులే కావడంతో ఎవరిని ఎంపిక చేయాలన్న విషయంలో సిపిఐ నాయకత్వం తీవ్ర మథనం జరుపుతోంది. ఈ ట్రయాంగిల్ ఫైట్ మేయర్ ఎన్నికను మరింత ఆసక్తికరంగా మార్చింది.

కాంగ్రెస్‌తో ఒప్పందం… అధికార భాగస్వామ్యం

కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించలేకపోయినా, సిపిఐతో పొత్తు కుదుర్చుకుని అధికారంలో భాగస్వామ్యం కావాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సిపిఐ, కాంగ్రెస్ పార్టీల మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ఐదేళ్ల పదవీకాలంలో రెండున్నరేళ్లు సిపిఐ, మిగిలిన రెండున్నరేళ్లు కాంగ్రెస్ పార్టీకి మేయర్ పదవి దక్కేలా అవగాహనకు వచ్చినట్లు సమాచారం. ఈ ఒప్పందంతో సిపిఐలో మేయర్ ఎంపికకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. మొదటి విడతలో మేయర్ పదవి సిపిఐకి దక్కనున్న నేపథ్యంలో ఎవరిని ఎంపిక చేయాలన్న అంశంపై రాష్ట్ర కార్యవర్గం సీరియస్‌గా ఆలోచిస్తున్నట్టు తెలిసింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో కూడా ఉపమేయర్ పదవిపై పోటీ నెలకొంది. కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థులు ఉపమేయర్ పదవిని దక్కించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇప్పటికే నూకల సరిత, దుంపల రాజేష్ పేర్లు ఉపమేయర్ రేసులో వినిపిస్తున్నాయి. పార్టీ నాయకత్వం ఎవరికీ అవకాశం కల్పిస్తుందన్నది ఆసక్తిగా మారింది. కొత్తగూడెం కార్పొరేషన్‌లో మేయర్, ఉపమేయర్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా సిపిఐలో మేయర్ అభ్యర్థి ఎంపిక, కాంగ్రెస్‌లో ఉపమేయర్ పోటీ ఉత్కంఠ రేపుతున్నాయి. సోమవారం జరిగే ఎన్నికలతో మేయర్ కుర్చీ ఎవరి ఖాతాలో పడుతుందన్నది తేలనుంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.