epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

పంటల సాగులో

పంటల సాగులో
డ్రోన్లను వినియోగించుకోవాలి

కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్

డార్మెటరీ పనులు త్వరగా పూర్తి చేయాల‌ని ఆదేశాలు

ఐన‌వోలు తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాల తనిఖీ

మల్లికార్జునస్వామికి ప్ర‌త్యేక పూజ‌లు

కాకతీయ, హనుమకొండ : వ్యవసాయంలో ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవడం ద్వారా రైతులు ఎక్కువ లాభాలు పొందవచ్చని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు. ముఖ్యంగా పంటల సాగులో డ్రోన్ల వినియోగం రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. గురువారం హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలో నాబార్డ్ పథకం కింద వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఆధ్వర్యంలో రైతు సేవా సహకార సొసైటీ (నందనం)కు డ్రోన్ల పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతు సేవా సహకార సొసైటీ (నందనం), పీఏసీఎస్ నర్సంపేట, పీఏసీఎస్ నెల్లికుదురు సొసైటీలకు అందించనున్న మూడు డ్రోన్ల వివరాలను వ్యోమిక్ డ్రోన్స్ సంస్థ ప్రతినిధులు హనుమ, జగదీష్ కలెక్టర్‌కు వివరించారు.

రైతులు సాంకేతికతను వినియోగించుకోవాలి

డ్రోన్ల ద్వారా ఎరువులు, పురుగుమందులను సమర్థవంతంగా పిచికారీ చేయవచ్చని తెలిపారు. దీని వల్ల సమయం, ఖర్చు రెండూ తగ్గుతాయని, రైతులు ఈ సాంకేతికతను విస్తృతంగా వినియోగించుకోవాలని సూచించారు. డ్రోన్ల వినియోగంతో పంటల ఉత్పత్తి కూడా పెరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. అదేవిధంగా రైతు సేవా సహకార సొసైటీ (నందనం) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రూరల్ మార్ట్‌ను కలెక్టర్ సందర్శించి అక్కడ విక్రయానికి ఉంచిన వివిధ వస్తువులను పరిశీలించారు. రూరల్ మార్ట్ నిర్వహణ బాగుందని, ఇదే విధంగా కొనసాగించాలని సూచించారు. స్థానిక ప్రజలు ఈ మార్ట్‌ను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.

మల్లికార్జునస్వామి దర్శనం

అనంతరం ఐనవోలు మల్లికార్జున స్వామి దేవాలయాన్ని కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, పూజారులు పూర్ణకుంభం, మంగళ వాయిద్యాలతో ఆలయ మర్యాదలతో కలెక్టర్‌కు ఘన స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వేద పండితులు ఆశీర్వచనం చేసి శేష వస్త్రాలు, ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా దేవస్థానం ప్రాంగణంలో కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) నిధులతో నిర్మాణంలో ఉన్న డార్మెటరీ హాల్ పనులను కలెక్టర్ పరిశీలించారు. నిర్మాణం అసంపూర్తిగా ఉండటంపై వివరాలు తెలుసుకుని పనులు త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాల ఆకస్మిక తనిఖీ

ఐనవోలు మండలంలోని తహసీల్దార్ కార్యాలయం, ఎంపీడీవో కార్యాలయాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. తహసీల్దార్ కార్యాలయంలో రికార్డు రూమ్‌ను పరిశీలించి భూ భారతి దరఖాస్తులు, సాదా బైనామా కేసులపై తహసీల్దార్ విక్రమ్ కుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు సంబంధించిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎంపీడీవో కార్యాలయంలో ఉపాధి హామీ పథకం (ఈజీఎస్) అమలుపై సమీక్షించి, క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులపై వివరాలు తెలుసుకున్నారు. కార్యాలయానికి అదనపు గదులు అవసరమని ఎంపీడీవో నర్మద కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, అంచనా ప్రతిపాదనలు సిద్ధం చేసి సమర్పించాలని సూచించారు. కార్యక్రమంలో టెస్కాబ్ మాజీ చైర్మన్ రవీందర్ రావు, నాబార్డ్ జిల్లా అభివృద్ధి అధికారి చంద్రశేఖర్, వరంగల్ అధికారి చైతన్య, హనుమకొండ, వరంగల్ జిల్లాల డీసీఓలు సంజీవరెడ్డి, నీరజ, హనుమకొండ జిల్లా వ్యవసాయ అధికారి రవీందర్ సింగ్, ఏడీఏ ఆదిరెడ్డి, సహకారశాఖ ఏరియా అధికారి జగన్మోహన్ రావు, స్థానిక సర్పంచులు రఘువంశీ, రాజు, తహసీల్దార్ విక్రమ్ కుమార్, ఎంపీడీవో నర్మద తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం మంచినీరు, ఘన వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణపై ప్రత్యేక...

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక...

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర!

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర! రోడ్లన్నీ ఆక్రమణ.. పార్కింగ్ స్థ‌లాల్లోనూ అమ్మకం చైర్ పర్సన్...

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం పంటల వైవిధ్యీకరణతో వాతావరణ మార్పులు మార్కెట్‌ ఒడిదుడుకులను...

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే కేసీఆర్‌ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి...

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి మట్టి...

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.