epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

మిస్సింగ్‌ల మిల్స్ కాలనీ

మిస్సింగ్‌ల మిల్స్ కాలనీ
ఖాకీ నిఘా కరువు… కేటుగాళ్ల వీరంగం
గంజాయి మత్తులో ఆక‌తాయిల‌ రౌడీయిజం
పెరుగుతున్న దొంగల స్వైర విహారం
స్టేషన్‌పై పెరుగుతున్న నిఘా భారం.. భద్రత ప్రశ్నార్థకం
సిబ్బంది కొరతతో క్షీణించిన శాంతిభద్రతలు
స్టేష‌న్ పున‌ర్విభ‌జ‌న ఏర్పాటు ఎప్పుడంటూ ప్ర‌జ‌ల డిమాండ్

కాకతీయ, వరంగల్ ప్రతినిధి : వ‌రంగ‌ల్ నగరంలోని అత్యంత సున్నిత ప్రాంతాల్లో ఒకటైన మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధి నేరాలు పెరుగుతున్నాయి. ఒకప్పుడు ప్రశాంతంగా ఉన్న ఈ ప్రాంతం ఇప్పుడు గంజాయి మత్తు, బెల్ట్ షాపులు, వరుస దొంగతనాలతో అశాంతికి కేంద్రంగా మారింది. రాత్రి9 త‌ర్వాత న‌గ‌రంలోనే భ‌యాన‌క ప‌రిస్థితులు నెల‌కొంటున్నాయి. ప్రజలు బయటకు రావడానికే జంకుతున్నారు. ఖాకీ నిఘా బలహీనపడడంతో కేటుగాల్లు రెచ్చిపోతున్నార‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. ఖిలా వరంగల్ పరిధిలోని పడమర కోట చమాన్ వద్ద జరిగిన తాజా ఘటన పరిస్థితి ఎంత దిగజారిందో అర్థ‌మ‌వుతోంది. మద్యం మత్తులో ఉన్న యువకులు స్వీట్ షాపులోకి చొరబడి యజమానితో ఘర్షణకు దిగారు. దుర్భాషలాడుతూ షాపు సామగ్రిని ధ్వంసం చేశారు. వేయింగ్ మెషిన్ పగలగొట్టి సరుకులను రోడ్డుపై పారేశారు. ఇదొక్క‌టే కాదు మిల్స్ కాలనీ పరిధిలో ఇటీవల జరిగిన ఘర్షణల్లో గంజాయి మత్తులో యువకులు పరస్పరం బీరు సీసాలతో దాడులు చేసుకోవడం తీవ్ర ఆందోళనకు క‌లిగించింది. చిన్న కారణాలకే హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడం అల్ల‌రి మూక‌లు, ఆక‌తాయిల స్వైర్య విహారం, గంజాయి సేవ‌నంలో మైమ‌రిచిపోయి దౌర్జ‌న్యాల‌కు దిగుతున్న ఘ‌ట‌న‌లు అనేకం వెలుగులోకి వ‌స్తున్నాయి. శాంతి భ‌ద్ర‌త‌ల ప‌రిర‌క్ష‌ణ‌లో పోలీసులు విఫ‌ల‌మ‌వుతున్నార‌నే విమ‌ర్శ‌లు ఇప్పుడు వ‌రంగ‌ల్‌లో స‌ర్వ‌త్రా వినిపిస్తున్నాయి.

ఖిలా వరంగల్ లోని స్వీట్ షాప్ పై మద్యం మత్తులో యువకుల దాడి

అర్ధరాత్రి మద్యం విక్రయాలు..!

నిబంధనల ప్రకారం రాత్రి సమయంలో మూతపడాల్సిన మద్యం దుకాణాలు, బార్లు ఉర్సు రోడ్డులో అర్ధరాత్రి దాటినా కొనసాగుతున్నాయి. మద్యం మత్తులో యువకులు గుంపులుగా చేరి గల్లీల్లో హడావిడి చేయడం, అసభ్య పదజాలంతో కుటుంబాలను ఇబ్బందులకు గురిచేయడం నిత్యకృత్యంగా మారింది. బెల్ట్ షాపులే ఈ నేరాలకు మూలకారణమన్న అభిప్రాయం స్థానికుల్లో వ్యక్తమవుతోంది. మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగలు స్వైర విహారం చేస్తున్నారు. శివనగర్‌లో బైక్‌ల నుంచి పెట్రోల్ దొంగతనాలు, కరీమాబాద్‌లో కార్ల అద్దాల ధ్వంసం వంటి ఘటనలు వరుసగా చోటుచేసుకుంటున్నాయి. తాళం వేసిన ఇళ్లను దోపిడీకి దుండ‌గులు ఎంచుకుంటూ దోచుకెళ్తున్నారు. ఇక అధికారంలో ఉన్న వారికి స‌లాం కొట్టాల్సిందేన‌న్న‌ట్లుగా కొంత‌మంది నేత‌లు వ్య‌వ‌హ‌రిస్తుండ‌టంతో.. పోలీసు విధుల‌కు ఆటంకంగా మారుతోంది. నేరాల‌కు పాల్ప‌డిన వారిని స్టేష‌న్‌కు తీసుకొచ్చ‌ని వెంట‌నే అధికార పార్టీ నేత‌ల నుంచి ఫోన్లు, పైర‌వీలు, సెటిల్ చేయాల‌ని ఒత్తిళ్లు పెరుగుతుండ‌టంతో… ఖాకీలు సైతం అడ‌క‌త్తెర‌లో పోక చెక్క మాదిరిగా న‌లిగిపోతున్న‌ట్లుగా ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

నెలరోజుల క్రింద మిల్క్ కాలనీ పరిధిలో రోడ్డు మీద బీర్ సీసాలతో యువకుల దాడి

పెరుగుతున్న మిస్సింగ్ కేసులు..!

ఇదే సమయంలో మిల్స్‌కాల‌నీ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో మిస్సింగ్ కేసులు పెరుగుతుండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంది. ఒకే రోజు ఇద్దరు చిన్నారులు అదృశ్యమ‌వ‌డం భద్రతా వ్యవస్థపై తీవ్ర సందేహాలు రేకెత్తించింది. సుమారు ఆరు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వేల సంఖ్యలో జనాభా ఉన్న ఈ పరిధికి ఒక్క పోలీస్ స్టేషన్ మాత్రమే ఉండటం ప్రధాన లోపంగా మారింది. మిల్స్ కాల‌నీ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిని రెండుగా విభ‌జించి కొత్త స్టేష‌న్‌ను ఏర్పాటు చేయాల‌నే ప్ర‌తిపాద‌న‌లు ఉన్నా.. ఇప్ప‌టి వ‌ర‌కు అమ‌లు కావ‌డం లేదు. దీంతో శాంతిభ‌ద్ర‌త‌ల ప‌రిర‌క్ష‌ణ స్టేష‌న్ అధికారుల‌కు స‌వాల్‌గా మారింది. స‌రిపోను పోలీస్ సిబ్బంది కూడా లేక‌పోవ‌డంతో భ‌ద్ర‌త ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. మొత్తంగా మిల్స్ కాలనీ పరిస్థితి నియంత్రణ తప్పే దశకు చేరుకుంది. తక్షణమే అదనపు సిబ్బంది నియామకం, రాత్రి నిఘా బలోపేతం, గంజాయి, బెల్ట్ షాపులపై కఠిన చర్యలు చేపట్టకపోతే చిన్న ఘటనలు పెద్ద నేరాలకు దారితీసే ప్రమాదం ఉందని జ‌నాలు హెచ్చరిస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం మంచినీరు, ఘన వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణపై ప్రత్యేక...

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక...

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర!

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర! రోడ్లన్నీ ఆక్రమణ.. పార్కింగ్ స్థ‌లాల్లోనూ అమ్మకం చైర్ పర్సన్...

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం పంటల వైవిధ్యీకరణతో వాతావరణ మార్పులు మార్కెట్‌ ఒడిదుడుకులను...

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే కేసీఆర్‌ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి...

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి మట్టి...

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.