epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఉపాధి హామీ చట్టాన్ని పరిరక్షించాలి

ఉపాధి హామీ చట్టాన్ని పరిరక్షించాలి
కేంద్ర బడ్జెట్‌లో రూ.3 లక్షల కోట్లు కేటాయించాలి
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలి
వ్యవసాయ కార్మిక సంఘం నాయ‌కుడు యర్రా శ్రీనివాసరావు
కూసుమంచి ఎంపీడీఓ కార్యాలయం ముందు ధర్నా

కాకతీయ, కూసుమంచి: కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న నూతన బిల్లుల వల్ల ఉపాధి హామీ చట్టం నిర్వీర్యమవుతోందని, దేశంలోని నిరుపేద కూలీల ప్రయోజనాల కోసం ఈ చట్టాన్ని కాపాడుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. మంగళవారం మండల కేంద్రంలోని పద్మారెడ్డి భవనం నుండి ఎంపీడీఓ కార్యాలయం వరకు వ్యవసాయ కార్మికులతో భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం అక్కడ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. విబిజి రాంజీ బిల్లు ద్వారా కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ బాధ్యతల నుండి తప్పుకోవాలని చూస్తోందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వాలు 40 శాతం నిధులు భరించాలనే నిబంధనలు విధిస్తూ భవిష్యత్తులో ఈ పథకాన్ని పూర్తిగా రద్దు చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. కేంద్ర బడ్జెట్‌లో కేవలం రూ.69 వేల కోట్లు మాత్రమే కేటాయించడం వల్ల కోట్లాది మందికి పని దొరకడం లేదన్నారు. ఉపాధి హామీకి రూ.3 లక్షల కోట్లు కేటాయించి, ఏడాదికి 200 రోజులు పని కల్పించాలని, రోజువారీ కూలీ రూ.800కి పెంచాలని ఆయన డిమాండ్ చేశారు.

రాష్ట్ర ప్రభుత్వ హామీలు ఏమైనవి?

రాష్ట్ర ప్రభుత్వంపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీలు నేటికీ అమలుకు నోచుకోలేదని మండిపడ్డారు. వ్యవసాయ కూలీలకు ఏటా ఇస్తామన్న రూ.12,000 నగదు అందడం లేదు. మహిళలకు రూ.2,500 పథకం, పెన్షన్ల పెంపు హామీలు అమలు కాలేదు.
ఉపాధి కూలీకి రూ.400 ఇస్తామన్న హామీ నెరవేరలేదు. జనవరి నుంచి నేటి వరకు మూడు నెలల ఉపాధి బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో పేదలు అర్థాకలితో అలమటిస్తున్నార‌ని అన్నారు. అనంతరం ఉపాధి హామీ కూలీల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు తోటకూరి రాజశేఖర్, కార్యదర్శి చిత్తూరు వెంకన్న, నాయకులు శీలం గురుమూర్తి, రెడ్డిమల్ల వెంకటయ్య, కందుల బాబు, రైతు సంఘం నాయకులు బిక్కసాని గంగాధర్ మరియు పెద్ద సంఖ్యలో వ్యవసాయ కార్మికులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.