ఓబీసీ సాధనే లక్ష్యంగా పోరాడాలి..
*ఆరే సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు ఒలిగే నర్సింగరావు
కాకతీయ, గీసుగొండ: ఆరె కులస్తులకు ఓబీసీ సాధనే లక్ష్యంగా పోరాడాలని ఆరే సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు ఒలిగే నర్సింగ రావు అన్నారు.మండలంలోని కొనాయిమాకుల గ్రామంలో ఆరే సంక్షేమ సంఘం నాయకులు జిల్లా స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర సంఘం నాయకులు ఇంగ్లీ శివాజీ,సుకినే రాజేశ్వరరావు,జిల్లా సంఘం నాయకుడు గుండెకారి రవికుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ఆరె సమాజం అభివృద్ధి కోసం ఐక్యంగా ముందుకు సాగాలని,ప్రభుత్వ పరంగా హక్కులు సాధించేందుకు సంఘటితంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు.అనంతరం జిల్లా కమిటీని ప్రకటించారు.జిల్లా ప్రధాన కార్యదర్శులుగా తుమ్మనపెల్లి శ్రీనివాస్,డోలె చిన్ని,గుండెకారి జగన్,కౌడగాని తిరుపతి, కోశాధికారిగా కౌడగాని మోహన్‌రావు,ఉపాధ్యక్షులుగా సిరిసే రాజేశ్వరరావు,లాండే రమేష్,పుస్కూరి ధర్మేంద్ర, కుసుంభ రఘుపతి, కొల్లూరి రవీందర్, నాగంపల్లి కిరణ్ కుమార్,ప్రచార కార్యదర్శులుగా డౌలత్ బాజీ యుగేందర్,నాయికోటి అంజి బాబు,హింగే రాజేశ్వరరావు, సిర్ల రవీందర్, హుస్సేన్‌పల్లి విరాట్,బెంబిరే మలహర్ రావు, అంబరగొండ రాజు నియమితు లయ్యారు.కొత్తగా నియమితులైన కమిటీ సభ్యులు సంఘ అభివృద్ధికి కృషి చేయాలని నాయకులు ఆకాంక్షించారు.

