శంకర్ గౌడ్ కుటుంబానికి ఆర్థిక బరోసా
15 లక్షల ఆర్థిక సాయం….
ప్రభుత్వం నుంచి 10 లక్షలు….
ఎమ్మెల్యే నిధి నుంచి 5 లక్షలు…
కాకతీయ,నర్సంపేట టౌన్: ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం తక్షణ సాయంగా ముందుకొచ్చింది. బాధిత కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం తరఫున రూ.10 లక్షలు, ఎమ్మెల్యే నిధి నుంచి రూ.5 లక్షలు అందజేయనున్నట్లు నర్సంపేట ఆర్డీఓ ఉమారాణి ప్రకటించారు.అదేవిధంగా కుటుంబానికి దీర్ఘకాలిక భరోసా కల్పించే దిశగా కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. కుటుంబంలో ఒకరికి ఆర్టీసీలో ఉద్యోగం కల్పించనున్నట్లు వెల్లడించారు. అలాగే ప్రభుత్వం తరఫున ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయనున్నట్లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి అన్ని విధాలా అండగా నిలుస్తామని అధికారులు భరోసా ఇచ్చారు. స్థానికంగా ఈ నిర్ణయం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

