epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఆ బాటిళ్లు ఎక్కడివి..?

ఆ బాటిళ్లు ఎక్కడివి..?
ఐటీడీఏ గోదాం వద్ద నీటి బాటిళ్ల గుట్టలు!
గుట్టుచప్పుడు కాకుండా డిస్పోజల్‌ ప్రక్రియ
అధికారుల పర్యవేక్షణ శూన్యం.. మీడియాను చూసి పరార్‌
జాతర స్టాక్‌ వృథాపై సర్వత్రా విమర్శలు

కాక‌తీయ‌, ఏటూరునాగారం : ఏటూరునాగారం మండల కేంద్రంలోని డీఆర్ఎస్ గోదాం వద్ద భారీగా నిల్వ ఉన్న గడువు ముగిసిన మినరల్ వాటర్ బాటిళ్లు మంగళవారం కలకలం రేపాయి. సుమారు 300 కాటన్లకు పైగా ఉన్న ‘కేన్లీ’ కంపెనీ బాటిళ్లను కొంతమంది వ్యక్తులు గుట్టుచప్పుడు కాకుండా ఖాళీ చేస్తూ డిస్పోజల్‌ చేస్తుండటం స్థానికంగా చర్చనీయాంశమైంది. అధికారుల పర్యవేక్షణ లేకుండా సాగుతున్న ఈ వ్యవహారంపై మీడియా ప్రతినిధులు అక్కడికి చేరుకోగానే, బాటిళ్లను ఖాళీ చేస్తున్న వ్యక్తులు జారుకోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఐటీడీఏ పరిధిలో గడిచిన రెండు మేడారం జాతరల కోసం భారీ స్థాయిలో ఈ నీటి బాటిళ్లను తెప్పించినట్లు సమాచారం. అయితే జాతర సమయంలో భక్తులకు వీటిని పంపిణీ చేయకుండా గోదాముల్లోనే నిల్వ ఉంచడంతో, కాలక్రమేణా గడువు ముగిసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ధనంతో కొనుగోలు చేసిన వేల బాటిళ్లు వినియోగం లేక వృథా కావడం, ఇప్పుడు వాటిని రహస్యంగా పారబోయడంపై స్థానికులు మండిపడుతున్నారు. ఈ అంశంపై గోదాం ఇంచార్జ్ సహా సంబంధిత అధికారులను వివరణ కోరేందుకు ప్రయత్నించగా వారు అందుబాటులోకి రాకపోవడం గమనార్హం.

నిబంధనలు గాలికి!
ప్రభుత్వ నిబంధనల ప్రకారం గడువు ముగిసిన వస్తువులను డిస్పోజ్ చేయాలంటే ముందుగా స్టాక్ వెరిఫికేషన్ నిర్వహించి, ఉన్నతాధికారుల నుంచి లిఖితపూర్వక అనుమతి పొందాలి. మొత్తం ప్రక్రియను అధికారుల పర్యవేక్షణలో పంచనామా నిర్వహించి, ప్లాస్టిక్ బాటిళ్లను రీసైక్లింగ్ కేంద్రాలకు తరలించాలి. కానీ, ఇక్కడ అవేవీ పాటించకుండానే బాటిళ్లను ఖాళీ చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. పర్యావరణానికి హాని కలగకుండా చూడాల్సిన బాధ్యతను అధికారులు విస్మరించారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ ధనం వృథా కావడమే కాకుండా, నిబంధనలకు విరుద్ధంగా డిస్పోజల్‌కు పాల్పడుతున్న వారిపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఏటూరునాగారం వాసులు డిమాండ్ చేస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.