ఖమ్మంలో ‘మే డే’ ఉత్సవాలు
28 ఆటో అడ్డాల్లో జెండా ఆవిష్కరణలు
కార్మికులకు అండగా ఉంటామని నేతల హామీ
కాకతీయ, ఖమ్మం : ఖమ్మం నగరంలో ఐఎన్టీయూసీ ఆటో మోటార్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం మే డే వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. జిల్లా అధ్యక్షులు పాల్వంచ కృష్ణ నేతృత్వంలో నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న 28 ఆటో అడ్డాల వద్ద ఐఎన్టీయూసీ జెండాలను ఎగురవేశారు. కార్మికుల హక్కుల పరిరక్షణే లక్ష్యంగా ఐక్యంగా ముందుకు సాగాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు, ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షులు, సీనియర్ కార్పొరేటర్ కమర్తపు మురళి ముఖ్య అతిథులుగా హాజరై జెండాలను ఆవిష్కరించారు. సమాజ నిర్మాణంలో మరియు రవాణా రంగంలో ఆటో కార్మికుల సేవలు వెలకట్టలేనివని వారు కొనియాడారు. కార్మికుల సంక్షేమానికి తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు.
తరలివచ్చిన కార్మిక లోకం..
వేడుకల్లో ఐఎన్టీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మమ్మీ వెంకటేశ్వర్లు, నగర అధ్యక్షులు నరాల నరేష్, జిల్లా అధ్యక్షులు వీరేందర్ రెడ్డి, నగర అధ్యక్షులు తోట సైదులు పాల్గొన్నారు. జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండీ రఫీ, జిల్లా ప్రధాన కార్యదర్శి మైస ఆంజనేయులు, నాయకులు మోహన్ నాయుడు, భద్రం, ఎస్వీ రమణ తదితరులతో పాటు వివిధ అడ్డాల కమిటీ సభ్యులు, ఆటో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని మే డే శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

