ఘనంగా రాయల జన్మదిన వేడుకలు
కాకతీయ, కూసుమంచి: తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ (వేర్‌హౌసింగ్ కార్పొరేషన్) చైర్మన్ రాయల నాగేశ్వరరావు పుట్టినరోజు వేడుకలను మంగళవారం నేలకొండపల్లి మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బచ్చలకూరి నాగరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో భాగంగా.. మండల కేంద్రంలోని ప్రధాన కూడలిలో పార్టీ నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి, మిఠాయిలు పంచి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ వేడుకల్లో నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వెనుపూసల సీతారాములు, తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ కార్యదర్శి జెర్రిపోతుల అంజనీ, ఎస్సీ సెల్ అధ్యక్షుడు బొడ్డు బొందయ్య, రేగురి వాసవి, జెర్రిపోతుల సత్యనారాయణ, రాయగూడెం సర్పంచ్ బోయిన వేణు, మామిడి వెంకన్న, దోసపాటి శేఖర్, పలపటి సురేష్, బాబు రెడ్డి, ఆదం, మస్తాన్, గుడ్డిబోయిన వెంకటేశ్వర్లు, గొలుసు పవన్, సోమనబోయిన సాయి నవీన్, గట్టిగొండ్ల విజయ్, ఎన్. సైదులు, నోషిన్ లక్ష్మయ్య, వడ్డే జగన్, గండు జానయ్య, రాయపూడి రోహిత్, మన్నే నరేష్, కోడిరేకుల వినోద్, ఊటుకూరి రమేష్, చీరాల అంజి బాబు, నాగేశ్వరరావు, రమేష్, కొమనబోయిన సీత, పసుపులేటి ఉపేందర్, మెల్లచెరువు నాగేశ్వరరావు, అనంతు సత్యనారాయణ కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

