epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

అభివృద్ధి మాది.. ఆర్భాటం మీదా?

అభివృద్ధి మాది.. ఆర్భాటం మీదా?
బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని మీద‌ని చెప్పుకోవ‌డం సిగ్గుచేటు
ఖమ్మం కార్పొరేషన్‌లో కాంగ్రెస్‌వి ‘కాకి లెక్కలే’
రూ.4వేల కోట్ల ప్రచారం అంతా పచ్చి అబద్ధం
మేం తెచ్చిన నిధులను మీ ఖాతాలో వేసుకుంటారా?
కాంగ్రెస్ పాలకవర్గంపై బీఆర్ఎస్ కార్పొరేటర్ల ధ్వజం
వారసత్వ సంపదపై కాంగ్రెస్ ముద్ర అంటూ విమ‌ర్శ‌లు

కాక‌తీయ‌,ఖ‌మ్మం బ్యూరో : ఖమ్మం నగరపాలక సంస్థలో గత ఐదేళ్లుగా జరిగిన అభివృద్ధిపై అధికార, ప్రతిపక్షాల మధ్య ‘మాటల’ యుద్ధం తారస్థాయికి చేరింది. కాంగ్రెస్ పాలకవర్గం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని, ‘కాకి లెక్కలతో’ కాలం గడుపుతూ అబద్ధపు ప్రచారాలు చేస్తోందని బీఆర్ఎస్ కార్పొరేటర్లు నిప్పులు చెరిగారు. గురువారం ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పగడాల నాగరాజు,కర్నాటి కృష్ణ,మక్బూల్ ,శీలంశెట్టి వీరభద్రం,తోట రామారావు,నాగాండ్ల కోటి,బిక్కసాని ప్రశాంతలక్ష్మిలు మాట్లాడుతూ 6 తేదీన మేయర్ నిర్వహించిన పత్రికా సమావేశాన్ని తీవ్రంగా ఖండించారు. నగరాన్ని రూ. 4వేల కోట్లతో అభివృద్ధి చేశామన్న మాజీ మేయర్ నీర‌జ‌ ప్రకటనను తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన ఈ రెండేళ్లలో నగరంలో జరిగిన అభివృద్ధి శూన్యమని కార్పొరేటర్లు విమర్శించారు. “కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మారింది ఒక్కటే.. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ కండువా కప్పుకున్న మేయర్, కార్పొరేటర్ల రాజకీయ రంగులు మాత్రమే” అని ఎద్దేవా చేశారు. దశాబ్దాల కాలం ఖమ్మాన్ని మురికికూపంలా వదిలేసిన కాంగ్రెస్, ఇప్పుడు బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని తమ ఖాతాలో వేసుకోవడం సిగ్గుచేటన్నారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కృషితోనే నగరం నేడు సీతాకోకచిలుకలా మెరుస్తోందని, 60 ఏళ్లలో జరగని అభివృద్ధిని తాము ఆరేళ్లలో చేసి చూపించామని స్పష్టం చేశారు.

వారసత్వ సంపదపై కాంగ్రెస్ ముద్ర
నగరంలో ప్రస్తుతం కనిపిస్తున్న ప్రతి అభివృద్ధి పని బీఆర్ఎస్ హయాంలో పునాది పడిందేనని నేతలు గుర్తుచేశారు. నూతన బస్టాండ్, కలెక్టరేట్, కార్పొరేషన్ కార్యాలయం, లకారం ట్యాంక్‌బండ్ సుందరీకరణ, వైకుంఠధామాలు, బస్తీ దవాఖానాలు వంటివన్నీ తమ ప్రభుత్వ ఘనతేనని వివరించారు. మున్నేరు వరద బాధితుల కష్టాలు చూసి అజయ్ కుమార్ రూ. 180 కోట్లతో తీగల వంతెనను, రూ. 800 కోట్లతో రిటైనింగ్ వాల్ నిర్మాణాన్ని మంజూరు చేయించారని.. ఆ పనులను ఇప్పుడు కాంగ్రెస్ నేతలు తమవిగా చెప్పుకోవడం ‘మందికి పుట్టిన బిడ్డను మా బిడ్డ’ అని చెప్పుకోవడమేనని మండిపడ్డారు.

బడుగుల సంక్షేమానికి పాతర
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బడుగు, బలహీన వర్గాల పట్ల వివక్ష చూపుతోందని కార్పొరేటర్లు ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో మైనారిటీల కోసం షాదీఖానాకు స్థలం కేటాయించి, నిధులు మంజూరు చేస్తే.. ప్రస్తుత ప్రభుత్వం ఆ పనులను నిలిపివేసిందని ధ్వజమెత్తారు. అదేవిధంగా బీసీ భవన్ నిర్మాణ పనులను కూడా అడ్డుకున్నారని, ఇప్పటికైనా అసత్య ప్రచారాలు మానుకోవాలని హెచ్చరించారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలే కాంగ్రెస్ నాయకులకు తగిన బుద్ధి చెబుతారని వారు హెచ్చరించారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు పగడాల నాగరాజు, కర్నాటి కృష్ణ, మక్బూల్, శీలంశెట్టి వీరభద్రం, తోట రామారావు, నాగాండ్ల కోటి, బిక్కసాని ప్రశాంతలక్ష్మి, బుడిగం శ్రీను, బుర్రి వెంకట్, కూరాకుల బాలరాజు, దండా జ్యోతి రెడ్డి, పసుమర్తి రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.