గుంపెల్లగూడెం వృద్ధుడి అదృశ్యం
కాకతీయ, కారేపల్లి : ఖమ్మం జిల్లా సింగరేణి మండలం గుంపెల్లగూడెం గ్రామానికి చెందిన మూడ్ పంతులు (60) ఈ నెల 19వ తేదీ నుంచి కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆయన తిరిగి రాకపోవడంతో బంధువులు, గ్రామస్తులు అన్ని ప్రాంతాల్లో గాలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. వృద్ధుడి ఆచూకీ తెలిసిన వారు వెంటనే సమాచారం అందించి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని, ఇందుకు సహకరించిన వారికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు తెలుపుకుంటామని బాధితుడి కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు. ప్రజలు ఈ సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా పంపి, వృద్ధుడు సురక్షితంగా ఇంటికి చేరేలా చూడాలని కోరుతున్నారు. సమాచారం తెలిసిన వారు 8466887259, 9704734715 ఫోన్ నంబర్లకు సంప్రదించగలరు. ఈ గాలింపు చర్యల్లో వృద్ధుడు మూడ్ పంతులు కుటుంబ సభ్యులతో పాటు స్థానిక గ్రామస్తులు మరియు బంధువులు అందరూ పాలుపంచుకుంటున్నారు.

