epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

సింగరేణి ఆసుపత్రిని యథావిధిగా నడిపించాలి

సింగరేణి ఆసుపత్రిని యథావిధిగా నడిపించాలి
కొత్త వైద్యులు, సిబ్బందిని నియమించాలి
తక్షణమే డిస్పెన్సరీని పునరుద్ధరించాలి
ఆస్ప‌త్రి సీఎంఓకు ఏఐటీయూసీ వినతిపత్రం
సానుకూలంగా స్పందించిన సీఎంఓ
త్వరలోనే డాక్టర్, స్టాఫ్‌ను నియమిస్తామని హామీ
కాకతీయ, కొత్తగూడెం : భద్రతా కారణాలు, సిబ్బంది కొరత నెపంతో రామవరం సింగరేణి డిస్పెన్సరీని (ప్రాథమిక వైద్యశాల) మూసివేయాలనే ఆలోచనను యాజమాన్యం తక్షణమే విరమించుకోవాలని, మూసేసిన ఆసుపత్రిని తెరిచి యథావిధిగా పునరుద్ధరించాలని గుర్తింపు సంఘం ‘సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్’ (ఏఐటీయూసీ) నాయకులు గట్టిగా డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం సింగరేణి ప్రధాన వైద్యశాల ముఖ్య వైద్యాధికారి (సిఎంఓ) కిరణ్ రాజ్‌ను ఏఐటీయూసీ ప్రతినిధి బృందం కలిసి వినతిపత్రం అందజేసింది.
ఒక్కరు రిటైర్ అయితే ఆసుపత్రికే సీల్ వేస్తారా?
ఈ సందర్భంగా ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి వంగ వెంకట్ మాట్లాడుతూ.. రామవరం ప్రాంతంలో నివసిస్తున్న వందలాది మంది సింగరేణి కార్మికులు, విశ్రాంత (మాజీ) కార్మికులు, వారి కుటుంబ సభ్యులతో పాటు కాంట్రాక్టు కార్మికులకు ఈ ప్రాథమిక వైద్యశాల ఎంతో కాలంగా కొండంత అండగా ఉంటూ వైద్య సేవలు అందిస్తోందన్నారు. ఇక్కడ పనిచేసే ఒక ఉద్యోగి పదవీ విరమణ పొందడంతో, ఆ స్థానంలో కొత్తవారిని నియమించాల్సింది పోయి.. డిస్పెన్సరీకి ఏకంగా తాళాలు వేసి సీల్ చేయడం ఎంతవరకు సమంజసమని యాజమాన్యాన్ని నిలదీశారు.
కార్మికులకు ఆర్థిక, శారీరక శ్రమ..
ఈ ప్రాంతంలో ఉన్న ఆసుపత్రిని మూసివేయడం వల్ల స్థానిక కార్మిక కుటుంబాలు చిన్నపాటి జ్వరం, జలుబు వంటి వైద్య సేవలకు మరియు మందుల కోసం సైతం సుదూర ప్రాంతంలో ఉన్న ప్రధాన వైద్యశాలకు వెళ్లాల్సి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇది వారికి ఆర్థికంగా, శారీరకంగా తీవ్ర భారంగా మారుతోందని పేర్కొన్నారు. సింగరేణి యాజమాన్యం తక్షణమే స్పందించి కొత్త వైద్యులను, అవసరమైన సిబ్బందిని నియమించి రామవరం డిస్పెన్సరీని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) పరిధిలోనే ఈ ప్రాంతం ఉంది కాబట్టి, పాతబడిన డిస్పెన్సరీ భవనానికి తగిన మరమ్మతులు చేయించి పునర్నిర్మించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
వైద్యాధికారి సానుకూల హామీ..
కార్మిక సంఘం నేతల వినతిపై ముఖ్య వైద్యాధికారి (సిఎంఓ) కిరణ్ రాజ్ సానుకూలంగా స్పందించారు. రామవరం డిస్పెన్సరీ భవన సమస్యను త్వరితగతిన పరిష్కరించి, అక్కడ త్వరలోనే కొత్త డాక్టర్‌ను, అవసరమైన వైద్య సిబ్బందిని నియమించి ఆసుపత్రిని పునరుద్ధరిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ కార్పొరేట్ బ్రాంచ్ కార్యదర్శి ఎస్.వి. రమణమూర్తి, సహాయ కార్యదర్శులు గట్టయ్య, రాము, వైస్ ప్రెసిడెంట్ కత్తెర్ల రాములు, పిట్ కార్యదర్శులు అనంతలక్ష్మి, మధు కృష్ణ, కమల్, కార్యాలయ ప్రతినిధులు నాగయ్య, కర్రు రమేష్, సీనియర్ నాయకులు మర్రి గోపి, లక్ష్మీనారాయణ, మండల రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.