epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

మెడికల్ ఫిట్ వారసులకు నియామక పత్రాలివ్వాలి

మెడికల్ ఫిట్ వారసులకు నియామక పత్రాలివ్వాలి
నెలల తరబడి ఎదురుచూస్తున్నా యాజమాన్యానికి ప‌ట్టింపులేదు
సమస్యను పరిష్కరించకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తాం
ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి వంగ వెంకట్
సింగరేణి జీఎం కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ ధర్నా
జనరల్ మేనేజర్ షాలెం రాజుకు వినతిపత్రం అందజేత

కాకతీయ, కొత్తగూడెం : సింగరేణి సంస్థలో ఉద్యోగాలు పొందాలనే ఆశతో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మెడికల్ ఫిట్ డిపెండెంట్లకు వెంటనే నియామక పత్రాలు ఇవ్వాలని ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి వంగ వెంకట్ డిమాండ్ చేశారు. బుధవారం ఉదయం కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో భారీ ధర్నా ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. నియామకాల కోసం ఎదురుచూస్తున్న వారసులు వారి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఉద్యోగంలో ఉన్న సమయంలో అనారోగ్యం ప్రమాదాల వల్ల కార్మికులు సేవలను కోల్పోయినప్పుడు వారి కుటుంబాలకు ఉపాధి భరోసా కల్పించాలనే ఉద్దేశంతో డిపెండెంట్ ఉద్యోగ విధానం వచ్చిందని ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి వి మల్లికార్జున్ రావు తెలిపారు. మెడికల్ పరీక్షల్లో అర్హత సాధించి అన్ని ప్రక్రియలు పూర్తి చేసుకున్నప్పటికీ వందలాది మంది వారసులు నెలల తరబడి ఉద్యోగాల కోసం ఎదురు చూడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ పోషణ పిల్లల చదువులు వైద్య ఖర్చులు భరించలేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు.

కార్మిక కుటుంబాల నిర్లక్ష్యం తగదు
సింగరేణి సంస్థ లాభాల సాధనలో కార్మికుల పాత్ర ఎంతో కీలకమని అలాంటి కార్మికుల కుటుంబాలను నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. మెడికల్ ఫిట్ అయిన ప్రతి వారసుడికి ఆలస్యం లేకుండా నియామక పత్రాలు అందజేసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాబోయే రోజుల్లో మరింత ఉధృతమైన ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. అనంతరం నాయకులు జనరల్ మేనేజర్ షాలెం రాజుకు వినతిపత్రం అందజేశారు.

జీఎం సానుకూల స్పందన
మెడికల్ ఫిట్ డిపెండెంట్ల సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సాధ్యమైనంత త్వరగా పరిష్కారానికి కృషి చేస్తానని జనరల్ మేనేజర్ షాలెం రాజు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ ఆర్గనైజింగ్ కార్యదర్శి వీరస్వామి, వైస్ ప్రెసిడెంట్ కత్తెర్ల రాములు, ఆఫీస్ బేరర్లు సందబోయిన శ్రీనివాస్, హుమాయూన్, పిట్ కార్యదర్శులు భూక్యా రమేష్, కమల్, సౌజన్య, సీనియర్ నాయకులు మండల రాజేశ్వరరావు, సురేందర్, మాచర్ల శ్రీనివాస్, కొవ్వూరి రాజేశ్వరరావు, బండారి మల్లయ్య, అప్పారావు, శశివర్ధన్ రెడ్డి, సురేందర్ రెడ్డి, తిరుపతి పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.