epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఉద్యోగుల ఆరోగ్యంపై సర్కారు కక్ష

ఉద్యోగుల ఆరోగ్యంపై సర్కారు కక్ష
హెల్త్ కార్డులు ఇవ్వకుండా జాప్యం చేస్తూ కాలయాపన
ప్రభుత్వ ధోరణి ఇలాగే ఉంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి
సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తున్న సర్కారు
ఉద్యోగుల వేతనాల కోతపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, దేవీప్రసాద్ తీవ్ర ఆగ్రహం
ఉద్యోగ సంఘాలతో కలిసి పోరాటానికి సిద్ధమ‌ని హెచ్చ‌రిక‌
వెంటనే హెల్త్ కార్డులు పంపిణీ చేయాలని డిమాండ్

కాకతీయ, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో సుమారు 15 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కుటుంబాలు తీవ్ర ఆందోళనలో ఉన్నాయని, ప్రభుత్వం వారి ఆరోగ్య భద్రతను గాలికి వదిలేసిందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లు దాటినా, ఇప్పటికీ ఉద్యోగులకు హెల్త్ కార్డులు అందించకపోవడం దారుణమని విమర్శించారు. జూన్ 1 నుంచే హెల్త్ కార్డులు ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట తప్పారని ఆయన ఆరోపించారు.

ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం తగదు
ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు సకాలంలో జీతాలు అందడం లేదని, రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ పెండింగ్‌లో ఉన్నాయని శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. ఈహెచ్‌ఎస్ పథకాన్ని ఆసుపత్రులు నమ్మే పరిస్థితి లేదని, ఆరోగ్యశ్రీ కింద ట్రీట్మెంట్ చేసేందుకు యాజమాన్యాలు అడ్మిట్ చేసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కో ఉద్యోగి జీతం నుండి నెలకు రెండు వేల నుండి మూడు వేల రూపాయల వరకు డబ్బులు కట్ చేస్తున్నారని, ఈ డబ్బులు కట్ చేయమని ప్రభుత్వానికి చెప్పింది ఎవరని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం ఉద్యోగుల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించి, ఎవరైనా చనిపోతే దానికి పూర్తి బాధ్యత సర్కారుదేనని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వ ధోరణి ఇలాగే కొనసాగితే, ప్రజలు రాళ్లతో కొట్టే పరిస్థితి వస్తుందని తీవ్ర హెచ్చరిక చేశారు.

సుప్రీంకోర్టు ఆదేశాలకు తూట్లు
కార్పొరేషన్ మాజీ చైర్మన్ జి. దేవీప్రసాద్ మాట్లాడుతూ, ఉద్యోగుల అనుమతి లేకుండానే మే నెల వేతనాల్లో కోత విధించడం చట్టవిరుద్ధమని అన్నారు. ఉద్యోగి సమ్మతి లేకుండా జీతం కట్ చేయకూడదని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పినా, ప్రభుత్వం బేఖాతరు చేస్తోందని మండిపడ్డారు. హెల్త్ కార్డుల విషయంలో గందరగోళం సృష్టిస్తూ, అసలు ఏయే ఉద్యోగులు ఈ పథకం పరిధిలోకి వస్తారో కూడా స్పష్టత లేదని విమర్శించారు. పోలీసుల జీతాల నుంచి ఇప్పటికే కట్ అవుతున్నా, మళ్లీ అదనంగా కట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఒక ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి, విధివిధానాలు ఖరారు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

బీఆర్ఎస్ హయాంలోనే ఉద్యోగులకు గౌరవం
కేసీఆర్ పరిపాలనలో అంగన్వాడీ వర్కర్లకు దేశంలోనే అత్యధిక వేతనాలు అందించామని, ఉద్యోగులను అపారంగా గౌరవించుకున్నామని శ్రీనివాస్ గౌడ్ గుర్తు చేశారు. పీఆర్సీ విషయంలో ఆరు నెలల్లోనే క్లియర్ చేస్తామని కాంగ్రెస్ మాయమాటలు చెప్పి ఓట్లు దండుకుందని, రెండున్నర ఏళ్లైనా ఇప్పటికీ అమలు చేయడం లేదని విమర్శించారు. తమతో కలిసి వచ్చే ఉద్యోగ సంఘాలతో కలిసి పోరాటం చేస్తామని, ఉద్యోగుల ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో నిలబడతామని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగుల పాత్రను తక్కువ చేసి చూస్తే ఊరుకునేది లేదని వారు తేల్చిచెప్పారు. ఈ సమావేశంలో టీఎన్జీఓ అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఏసీబీకి చిక్కిన ఇద్ద‌రు

ఏసీబీకి చిక్కిన ఇద్ద‌రు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి, సీనియర్‌ అసిస్టెంట్‌ పట్టివేత సీఎంఆర్‌ఎఫ్‌ బిల్లు మంజూరుకు...

ఉప్పల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో లంచాల ప‌ర్వం

ఉప్పల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో లంచాల ప‌ర్వం డాక్యుమెంట్‌ రైటర్ల ద్వారా అదనపు...

దక్షిణ కొరియా వర్సిటీలో నిషితకు సీటు

దక్షిణ కొరియా వర్సిటీలో నిషితకు సీటు ప్రతిష్ఠాత్మక ‘కొయికా’ ఫుల్‌ స్కాలర్‌షిప్‌తో ఎంఎస్సీ...

హైదరాబాద్‌లో లండన్‌ యూనివర్సిటీ క్యాంపస్‌!

హైదరాబాద్‌లో లండన్‌ యూనివర్సిటీ క్యాంపస్‌! క్యాంపస్‌ ఏర్పాటుకు లండన్‌ యూనివర్సిటీ ప్రతినిధుల కసరత్తు విస్తృత...

‘ఖేలో ఇండియా’ గేమ్‌చేంజర్‌

‘ఖేలో ఇండియా’ గేమ్‌చేంజర్‌ గ్రాస్‌రూట్‌ స్థాయి నుంచే క్రీడాకారుల తీర్చిదిద్దడం 2026–31 కాలానికి రూ.29,054...

మాజీ తహసీల్దార్‌ ఇంటిపై ఏసీబీ దాడులు

మాజీ తహసీల్దార్‌ ఇంటిపై ఏసీబీ దాడులు ఒకేసారి 15 చోట్ల సోదాలు ఆదాయానికి మించిన...

కౌండిన్య గౌడ సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కూనూరు నిరంజన్‌ గౌడ్‌

కౌండిన్య గౌడ సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కూనూరు నిరంజన్‌ గౌడ్‌ కాకతీయ,...

తెలంగాణలో దూసుకెళ్తున్న ఈవీలు

తెలంగాణలో దూసుకెళ్తున్న ఈవీలు రాయితీలతో పెరిగిన కొనుగోళ్లు.. ఏడాదిలో 91,107 వాహనాలు కొత్త వాహనాల నమోదులో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.