తాడిచర్ల-1 కోల్ బ్లాక్‌లో వన మహోత్సవం
పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములైన అధికారులు, ఉద్యోగులు
హరిత భవిష్యత్తు కోసం మొక్కలు నాటిన ఎంఆర్ ప్రాజెక్ట్ బృందం
కాకతీయ, మలహర్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘వన మహోత్సవం – 2026’ కార్యక్రమంలో భాగంగా, మండలంలోని తాడిచర్ల-1 కోల్ బ్లాక్ ఎంఆర్ ప్రాజెక్ట్ ప్రాంగణంలో విస్తృత స్థాయిలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా నిర్వహించిన వన మహోత్సవంలో వివిధ శాఖల అధికారులు, సంస్థ ప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అటవీ శాఖ తరపున డి.స్టాట్, సీనియర్ అసిస్టెంట్, టీజీజెన్‌కో తరపున ఏడీఈ వెంకటేశ్వరరావు మొక్కలు నాటారు. ఎంఆర్ తాడిచర్ల-1 కోల్ మైన్ ప్రాజెక్ట్ హెడ్ ఎ.ప్రభాకర్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ కె.ఎన్.మూర్తి, మైన్ మేనేజర్ శ్రీనివాస్, సేఫ్టీ ఆఫీసర్ కె.సురేష్ బాబు మరియు సిబ్బంది మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ, స్థిరమైన గనుల నిర్వహణ మరియు హరిత భవిష్యత్తు నిర్మాణానికి తమ సంస్థ కట్టుబడి ఉందని ఈ సందర్భంగా నిర్వాహకులు తెలిపారు. పచ్చదనాన్ని పెంపొందించడం ద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడాలని అధికారులు ఉద్యోగులకు పిలుపునిచ్చారు.

