విలేకరులను బెదిరిస్తే ఊరుకునేది లేదు
: పీడీఎస్‌యూ నేత శివ
కాకతీయ, మణుగూరు : శ్రీకర్ గిరిజనులను అడ్డం పెట్టుకొని, అక్రమ ఇసుక ర్యాంపుల ద్వారా రూ.వందల కోట్ల అవినీతి సొమ్ము సంపాదించాడని పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ నాయకుడు శివ తీవ్ర ఆరోపణలు చేశారు. శనివారం ఆయన మణుగూరులో మీడియాతో మాట్లాడుతూ.. శ్రీకర్ తన అక్రమ దందాను మొదట చర్ల నుంచే ప్రారంభించాడని, గతంలో చర్లలో జీరో (రసీదులు లేని) ఇసుక లారీలు నడిపినందుకు ఆయనపై క్రిమినల్ కేసు కూడా నమోదైందని గుర్తు చేశారు. శ్రీకర్ వెనుక ఉండి నడిపిస్తూ అతడిని పెంచి పోషిస్తోంది టీజీఎండీసీ పీవో శంకర్ నాయక్, డీసీఓ శ్రీనివాస్ గుప్తా ఆరోపించారు. గతంలో ఇక్కడ పనిచేసి బదిలీ అయిన అధికారులే మళ్లీ భద్రాద్రి జిల్లాకు వచ్చి, శ్రీకర్‌తో చేతులు కలిపి గోదావరిలో డీసిల్టేషన్ పేరుతో విచ్చలవిడిగా అక్రమ ఇసుక దందా సాగిస్తున్నారని ఆరోపించారు. ఉత్తరం కాకతీయ పత్రిక ఇసుక దందాలపై నిర్భయంగా నిజాలు రాస్తుంటే, శ్రీకర్ తన బినామీలతో పత్రికపై దుష్ప్రచారం చేయించడం మరియు విలేకరులపై పోలీస్ కేసులు పెడతామంటూ బెదిరింపులకు గురిచేయడం తగదన్నారు. నిజాలు రాసే విలేకరుల జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

