epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

30న సీఎం ‘రైతు ఆశీర్వాద సభ’

30న సీఎం ‘రైతు ఆశీర్వాద సభ’
వర్షం కురిసినా అంతరాయం కలగకుండా ఏర్పాట్లు
రైతుల ఖాతాల్లో ధాన్యం న‌గ‌దు జమ చేశాం
అన్నదాతలకు అండగా ప్రజా ప్రభుత్వం
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

కాక‌తీయ‌,ఖ‌మ్మం బ్యూరో : రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సాహసోపేత నిర్ణయాలతో అన్నదాతలకు కొండంత అండగా నిలుస్తోందని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురం గ్రామంలో ఈ నెల 30వ తేదీ మంగళవారం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్న ‘రైతు ఆశీర్వాద సభ’ ఏర్పాట్లను ఆదివారం ఆయన ఉన్నతాధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వ్యవసాయ శాఖ కార్యదర్శి కే. సురేంద్ర మోహన్, కమిషనర్ గోపి, జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్, ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులతో కలిసి సభా ప్రాంగణం, హెలిప్యాడ్, వాహనాల పార్కింగ్ ప్రాంతాలను మంత్రి సమగ్రంగా తనిఖీ చేశారు. వర్షాకాలం నేపథ్యంలో భారీ వర్షాలు కురిసినా కార్యక్రమానికి ఎలాంటి అంతరాయం కలగకుండా జర్మన్ హ్యాంగర్లు ఏర్పాటు చేయాలని, తగిన భద్రత, ట్రాఫిక్ నియంత్రణ చర్యలను అత్యున్నత ప్రమాణాలతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

రైతుల ఖాతాల్లో వారం రోజుల్లోనే నగదు జమ
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. ఎలాంటి వాతావరణ పరిస్థితులు ఎదురైనా రైతు ఆశీర్వాద సభ అనుకున్నదానికంటే మరింత ఘన విజయాన్ని సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సభ రైతు సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతకు నిలువెత్తు ప్రతీకగా నిలుస్తుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో తీసుకున్న సాహసోపేత నిర్ణయాల వల్ల వర్షాలకు తడిసిన ధాన్యానికి సైతం నష్టం కలగకుండా ప్రభుత్వం కొనుగోలు చేసిందని, దానికి సంబంధించిన చెల్లింపులను వారం రోజుల్లోనే రైతుల ఖాతాల్లో జమ చేసి నిబద్ధతను చాటుకున్నామని పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తూముల నాగేశ్వరరావుల సమన్వయంతో ఈ సభను రాష్ట్ర చరిత్రలోనే నిలిచిపోయేలా విజయవంతం చేయనున్నట్లు వెల్లడించారు.

ఇందిరమ్మ రాజ్యంలో సంక్షేమ వెల్లువ
ఇందిరమ్మ రాజ్యం లక్ష్యాలతో ప్రజా ప్రభుత్వం పేదలు, రైతులు, మహిళలు, యువత సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందని మంత్రి తెలిపారు. కేవలం రెండేళ్లలోనే రికార్డు స్థాయిలో 72 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని, త్వరలో మరిన్ని నోటిఫికేషన్లు విడుదల చేస్తామని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఎలాంటి అవినీతికి తావు లేకుండా లబ్ధిదారుల ఖాతాల్లోనే నేరుగా నిధులు జమ చేస్తున్నామని, గ్రామీణ ప్రాంతాల్లో 2.5 లక్షల ఇళ్లు, పట్టణ ప్రాంతాల్లో లక్ష ఇళ్ల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసినట్లు వెల్లడించారు. అసంపూర్తిగా ఉన్న కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తామన్నారు. రాష్ట్ర రహదారుల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రూ.22 వేలు కోట్లు మంజూరు చేయడం అభివృద్ధిపై ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. ఈ ఏర్పాట్ల పరిశీలనలో శాసనసభ్యులు మట్టా రాగమయి దయానంద్, రాందాస్ నాయక్, కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు, జారే ఆదినారాయణ, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర రావు, అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.