epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

బ్యారేజీల్లో నీటి నిల్వ చేయ‌కుండా ప్ర‌భుత్వం కుట్ర‌

బ్యారేజీల్లో నీటి నిల్వ చేయ‌కుండా ప్ర‌భుత్వం కుట్ర‌
పంపులు నడపడం చాత‌కాకుంటే కేసీఆర్‌కు అప్పగించండి
వారం రోజుల్లో రైతుల భూముల్లోకి నీరు పారించి చూపుతాం
లేకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటాం
ప్రభుత్వ వైఖరిపై మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి
ఇసుక దందా కోసమే బ్యారేజీల్లో నీరు నింపడం లేదు : మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌
చలో కన్నేపల్లికి సిద్ధం : మాజీ మంత్రి గంగుల‌

కాక‌తీయ‌,తెలంగాణ బ్యూరో : కాళేశ్వరం ప్రాజెక్టు పంపులు నడపడంలో ప్రభుత్వం విఫ‌ల‌మ‌వుతోంద‌ని బీఆర్ఎస్ మాజీమంత్రులు గంగుల క‌మ‌లాక‌ర్‌, జ‌గ‌దీశ్‌రెడ్డిలు మండిప‌డ్డారు. గోదావ‌రిలో సాగుతున్న ఇసుక దందా కోస‌మే బ్యారేజీల్లో నీటిని నిల్వ ఉంచ‌కుండా ప్ర‌భుత్వం కుట్ర చేస్తోంద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. కన్నేపల్లి, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నుంచి నీటిని ఎత్తిపోయకపోవడం వెనుక ప్రభుత్వ అసమర్థత మరియు ఇసుక దందా ఉందని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఆరోపించారు. సోమవారం తెలంగాణ భ‌వ‌న్‌లో జ‌రిగిన ప్రెస్‌మీట్‌లో మాజీమంత్రి జ‌గ‌దీష్‌రెడ్డి మాట్లాడుతూ “ప్రాజెక్టు నిర్వహణ చేతకాకపోతే వారం రోజుల పాటు మా నేత కేసీఆర్‌కు అప్పగించండి. మేము రైతుల పొలాల్లోకి నీరు పారించి చూపుతాం. ఒకవేళ ఏవైనా ప్రమాదాలు జరిగితే బాధ్యత బీఆర్ఎస్‌దే. అప్పుడు మేము పార్టీని రద్దు చేసుకుని రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటాం” అని సవాల్ విసిరారు.

చంద్రబాబు కోసం నాటకం ఆడుతున్న ప్రభుత్వం
రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కోసం ఈ నాటకం ఆడుతోందని జగదీశ్ రెడ్డి ధ్వజమెత్తారు. ఎన్‌డీఎస్ఏ పేరుతో భయపెడుతూ ప్రాజెక్టును నిలిపివేయడం దారుణమన్నారు. ప్రాజెక్టులో ఎలాంటి అవినీతి జరగలేదని, కోర్టుల్లో ప్రభుత్వం వేసిన కమిషన్లకు కూడా మొట్టికాయలు పడ్డాయని గుర్తు చేశారు. రైతుల పంటలు ఎండిపోతున్నా పట్టించుకోకుండా, కేవలం రాజకీయ లబ్ధి కోసం, కమీషన్ల కోసం ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.

ఇసుక దందా కోసమే నీరు నింపడం లేదు
మాజీ ఎంపీ బి. వినోద్ కుమార్ మాట్లాడుతూ మేడిగడ్డతో సంబంధం లేకుండా అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో నీరు నింపడానికి ఎటువంటి అభ్యంతరాలు లేవని స్పష్టం చేశారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల వద్ద వందల లారీలతో ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. అందుకే బ్యారేజీల్లో నీరు నింపడం లేదు. అన్నారం, సుందిళ్ల సురక్షితంగా ఉన్నాయని నివేదికలు చెబుతున్నా, ప్రభుత్వం ఎందుకు పంపులు ఆపుతోంద‌ని ప్రశ్నించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ప్రాజెక్టుపై కనీస అవగాహన లేదని, భద్రాచలం కొట్టుకుపోతుందని ఆయన చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదమని వినోద్ కుమార్ ఎద్దేవా చేశారు.

చలో కన్నేపల్లికి సిద్ధం : మాజీమంత్రి గంగుల
మాజీ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ ఎల్లంపల్లి, కన్నేపల్లి నుంచి నీటిని ఎత్తిపోయకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ‘ఛలో కన్నేపల్లి, ఎల్లంపల్లి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఎల్నినో పరిస్థితుల్లో ప్రాజెక్టు నీటి నిల్వపై ప్రభుత్వం ఎన్‌డీఎస్ఏతో ఒక్కసారైనా మాట్లాడిందా అని ప్రశ్నించారు. రైతుల కోసం, కరువు నుంచి ప్రజలను రక్షించడం కోసం కేసీఆర్ ఈ ప్రాజెక్టు కడితే, నేడు ప్రభుత్వం నిర్లక్ష్యంతో వ్యవహరిస్తూ తెలంగాణ ఆత్మను కోల్పోతోందని మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డిలను ఉద్దేశించి విమర్శించారు. ఈ కార్యక్రమంలో గెల్లు శ్రీనివాస్ యాదవ్, ధర్మేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ ప్రజల సమస్యలు,...

ఎర్రవల్లిలో ఉద్రిక్తత

ఎర్రవల్లిలో ఉద్రిక్తత కేసీఆర్ ఫాం హౌస్‌కు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌...

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను మోసం చేసింది వంద...

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా?

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా? మహిళా శాసనసభ్యుల చీరెలు లాగుతారా.....

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.