epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

వడ్డెపల్లి ఎల్‌పీఎస్ కు ఇనగాల బాట

వడ్డెపల్లి ఎల్‌పీఎస్ కు ఇనగాల బాట
యజమానుల ఆమోదంతో సాకారం
ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ముందడుగు
30 ఎకరాలు అప్పగింతకు ముందుకు వచ్చిన యజమానులు
ఆధునిక మౌలిక సదుపాయాలతో మార‌నున్న ప్రాంతం రూపురేఖలు
భూ యజమానుల స్వచ్ఛంద సహకారం అభినందనీయం
కుడా చైర్మ‌న్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి

కాక‌తీయ‌, వ‌రంగ‌ల్‌బ్యూరో : నగర సుందరీకరణతో పాటు క్రమబద్ధమైన పట్టణాభివృద్ధికి ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ఎంతో ఉపయోగకరమని, భూ యజమానులు స్వచ్ఛందంగా ముందుకు రావడం అభివృద్ధికి శుభపరిణామమని కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి అన్నారు. ల్యాండ్ పూలింగ్ విధానంపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి, వారిని ఒప్పించేందుకు చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి చేసిన కృషి వడ్డెపల్లి ఎల్‌పీఎస్ ప్రాజెక్టులో కీలక మార్పుకు దారితీసింది. ఆయన అనుసరించిన సంప్రదింపుల సరళి, క్షేత్రస్థాయిలో పారదర్శకతను పెంచడం ద్వారా భూ యజమానుల నమ్మకాన్ని పొందగలిగారు. ఫలితంగా హనుమకొండలోని వడ్డెపల్లి ఫిల్టర్ బెడ్స్ పరిధిలో ఉన్న సుమారు 30 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ద్వారా అభివృద్ధి చేసేందుకు భూ యజమానులు స్వచ్ఛందంగా అంగీకారం తెలిపారు. మంగళవారం వడ్డెపల్లి ఫిల్టర్ బెడ్స్ భూ యజమానుల కమిటీ సభ్యులు, ప్రతినిధులు బూర విద్యాసాగర్, ఎం. విజయ్ కుమార్, డి. స్వరాజ్యలక్ష్మి, బూర అశోక్ కుమార్, బల్లెం వెంకటయ్య, రాజేష్, తిరుపతి రెడ్డిలు కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ కార్యాలయంలో చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ అజిత్ రెడ్డిని కలిసి తమ నిర్ణయాన్ని తెలియజేశారు.

ప్రణాళికాబద్ధమైన వసతుల కల్పన

ల్యాండ్ పూలింగ్ స్కీమ్ నిబంధనల ప్రకారం లేఅవుట్ అభివృద్ధికి అవసరమైన అధికారిక దరఖాస్తులు, భూమి యాజమాన్య పత్రాలు, ఇతర సంబంధిత డాక్యుమెంట్ల జిరాక్స్ కాపీలను కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ అధికారులకు భూ యజమానులు సమర్పించారు. వడ్డెపల్లి ఫిల్టర్ బెడ్స్ ప్రాంతంలోని 30 ఎకరాల భూమి ల్యాండ్ పూలింగ్ పరిధిలోకి రావడంతో ఆ ప్రాంతంలో ప్రణాళికాబద్ధమైన రహదారులు, మౌలిక సదుపాయాలు, నివాస లేఅవుట్ల అభివృద్ధికి మార్గం సుగమం కానుంది. నగరానికి కీలకమైన ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులు దృష్టి సారించారు.

త్వరితగతిన కార్యాచరణ అమలు

ఈ ప్రాజెక్టు అమలును మరింత వేగవంతం చేయడానికి వచ్చే నాలుగు రోజుల్లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించి తదుపరి కార్యాచరణను ఖరారు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. భూ యజమానుల కమిటీ ప్రతినిధులు బూర విద్యాసాగర్, ఎం. విజయ్ కుమార్, డి. స్వరాజ్యలక్ష్మి, బూర అశోక్ కుమార్, బల్లెం వెంకటయ్య, రాజేష్, తిరుపతి రెడ్డి పాల్గొన్నారు. ల్యాండ్ పూలింగ్‌లో యజమానులను భాగస్వామ్యం చేయడం ద్వారా నగరానికి లభించే ప్రయోజనాలను వివరించడంలో చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి విజయవంతం కావడంతో, ఈ ప్రాజెక్టు వేగంగా కార్యరూపం దాల్చే అవకాశం కనిపిస్తోంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం మంచినీరు, ఘన వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణపై ప్రత్యేక...

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక...

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర!

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర! రోడ్లన్నీ ఆక్రమణ.. పార్కింగ్ స్థ‌లాల్లోనూ అమ్మకం చైర్ పర్సన్...

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం పంటల వైవిధ్యీకరణతో వాతావరణ మార్పులు మార్కెట్‌ ఒడిదుడుకులను...

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే కేసీఆర్‌ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి...

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి మట్టి...

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.