epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

218 స.నె. భూ నిర్వాసితులకు న్యాయం చేయాలి

218 స.నె. భూ నిర్వాసితులకు న్యాయం చేయాలి
పేదలను రోడ్డున పడేసేలా కాంగ్రెస్ బుల్డోజర్ పాలన
ఖమ్మం నగర బీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షుడు పగడాల నాగరాజు
కలెక్టరేట్లో వినతిపత్రం అందజేసిన బీఆర్ఎస్ నేతలు

కాకతీయ, రఘునాథపాలెం : రఘునాథపాలెం మండలం 218 సర్వే నంబర్‌లోని భూ నిర్వాసితులకు ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలని ఖమ్మం నగర బీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షుడు పగడాల నాగరాజు, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ ఖమర్ డిమాండ్ చేశారు. బాధితులతో కలిసి గురువారం వారు ఖమ్మం కలెక్టరేట్‌లో డీఆర్వోకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పగడాల నాగరాజు మాట్లాడుతూ.. 2009లో వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి హయాంలో 3,000 మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేసినా, అప్పట్లో స్థలాలు చూపలేదని గుర్తు చేశారు. రాష్ట్ర విభజన తర్వాత మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చొరవతో సుమారు 650 మందికి స్థలాలు కేటాయించగా, వారు బేస్‌మెంట్లు, లెంటల్ స్థాయి వరకు ఇళ్లు నిర్మించుకున్నారని తెలిపారు. ప్రస్తుతం అమరావతి హైవే, మోడల్ స్కూల్ పేరుతో లబ్ధిదారులను ఖాళీ చేయించడం సరికాదన్నారు. ప్రత్యామ్నాయ స్థలాలు ఇస్తామని చెప్పిన అధికారులు ఇప్పటికీ ఆ హామీని నెరవేర్చలేదని, పైగా ఎలాంటి ఆటంకం లేని ప్రాంతాల్లో ఉన్న 300 మంది పేదల ఇళ్లను కూడా స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

ముఖ్యమంత్రి పర్యటనలో బాధితుల గోడు
రేపు ముఖ్యమంత్రి ఖమ్మం జిల్లాకు వస్తున్న నేపథ్యంలో, బాధితుల సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే వినతిపత్రం ఇచ్చామని పేర్కొన్నారు. వెలుగుమట్ల కూల్చివేతల మచ్చ ఇంకా పోకముందే, మరో 650 పేద కుటుంబాలను రోడ్డున పడేసే పరిస్థితిని కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టిస్తోందని విమర్శించారు. వైఎస్సార్ ఆశయాల గురించి మాట్లాడే కాంగ్రెస్ నేతలు, ఆయన ఇచ్చిన పట్టాలను గౌరవించకపోవడం విడ్డూరమని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ‘బుల్డోజర్ పాలన’ కొనసాగిస్తోందని, ముఖ్యమంత్రే హిట్లర్‌ను ఆదర్శంగా తీసుకున్నారని పగడాల నాగరాజు ఆరోపించారు. కూల్చివేతలు కాకుండా పేదల జీవితాలకు భరోసా కల్పించడమే ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని, లేనిపక్షంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మక్బుల్, తాజుద్దీన్, సకీనా, చిన్న నాగరాజు, ఉస్మాన్, పోలెపొంగు వెంకట్, గుంటి రాజు, బాధితులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.