- వరంగల్ తూర్పులో బీఆర్ ఎస్‌లోకి వంద మంది కార్యకర్తలు
- 32వ డివిజన్ వినాయక కాలనీలో 100 మంది చేరిక
- ప్రజల ఆశీర్వాదం బీఆర్ఎస్ కే ఉంది
- : మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : వరంగల్ తూర్పు నియోజకవర్గం 32వ డివిజన్, వినాయక కాలనీలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు పెద్ద షాక్ తగిలింది. సోమవారం సుమారు 100 మంది నాయకులు, కార్యకర్తలు భారత రాష్ట్ర సమితి పార్టీలో చేరారు. వినాయక కాలనీ మాజీ అధ్యక్షులు డి రాజేశ్వర్, ఉపాధ్యక్షులు మేకల నర్సింగ్ ఆధ్వర్యంలో ఈ చేరికల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు నన్నపునేని నరేందర్ హాజరై పార్టీలో చేరిన వారందరికీ బిఆర్ఎస్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, గతంలో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో జరిగిన అభివృద్ధిని ప్రజలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారని, అందుకే ప్రజలు మళ్లీ టిఆర్ఎస్ వైపు చూస్తున్నారని పేర్కొన్నారు. పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తకు సముచిత గౌరవం, గుర్తింపు కల్పిస్తామని హామీ ఇచ్చారు. రానున్న రోజుల్లో వరంగల్ తూర్పు నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేసి, ప్రజా సమస్యలపై గళం వినిపిస్తామని స్పష్టం చేశారు. వరంగల్ తూర్పులో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ప్రజా మద్దతు తగ్గుతోందని, అభివృద్ధిని కోరుకునే ప్రతి ఒక్కరూ టిఆర్ఎస్ జెండా కిందకు వస్తున్నారని నరేందర్ అన్నారు. ఈ కార్యక్రమంలో 32వ డివిజన్ మాజీ అధ్యక్షులు పొగాకు సందీప్, పరదేశి రాజేష్, ధోనికాల ప్రవీణ్, దస్తగిరి, మటెటి శ్యామ్, పసునూరి సువర్ణ, సీతారాయుడు, నూక రమేష్ తదితరులు పాల్గొన్నారు.

