స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దడమే నా ధ్యేయం
* సర్పంచ్ చిర్ర యాకాంతం గౌడ్
కాకతీయ, నెల్లికుదురు: మండలంలోని బ్రాహ్మణ కొత్తపెళ్లి గ్రామాన్ని స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దడమే నా ధ్యేయమని సర్పంచ్ చిర్ర యాకాంతం గౌడ్ అన్నారు. బ్రాహ్మణకొత్తపల్లి గ్రామంలో మంగళవారం నిర్వహించిన ప్రత్యేక గ్రామ సభలోగ్రామ సర్పంచ్ డా చిర్ర యాకాంతం గౌడ్ మాట్లాడుతూ ఎజెండా అంశాలలో భాగంగా ఆడపిల్లల, మహిళల భద్రత విషయాలలో పాటించవలసిన అంశాలు, ఇంకుడు గుంతలు, పంట గుంటలు ప్రతి ఒక్కరూ తప్పకుండా సద్వినియోగించుకోవాలని, గ్రామాన్ని స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దడం కోసం గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు. అనంతరం గ్రామంలోని ప్రతి ఇంటికి గ్రామపంచాయతీ నుండి బ్లీచింగ్ పౌడర్ ప్యాకెట్లు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఎర్ర రవి, ఉపసర్పంచ్ పిట్టల ఉప్పలయ్య, వార్డు సభ్యులు పిడుగు అనంత, బొల్లు మురళి, అంగన్వాడీ టీచర్లు, మహిళా సంఘాల ప్రతినిదులు, మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, యువత గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

