వీబీ–జీ రామ్‌జీ ఉద్యోగుల పెన్‌డౌన్
కాకతీయ, చింతకాని: తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం వీబీ–జీ రామ్‌జీ (ఎస్ఆర్డీఎస్) స్థిరకాల ఉద్యోగులు చేపట్టిన పెన్‌డౌన్ ఉద్యమం బుధవారానికి ఐదో రోజుకు చేరుకుంది. చింతకాని మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయం ఎదుట నిరసన తెలిపిన ఉద్యోగులు అనంతరం ఎంపీడీఓకు వినతిపత్రం అందజేశారు. వేతన శ్రేణి అమలు, క్యాడర్ ఖరారు, పారదర్శక బదిలీలు, పదోన్నతులు, పెండింగ్ వేతనాల విడుదల, స్థిరకాల ఉద్యోగులను శాశ్వతీకరించడం, వీబీ–జీ రామ్‌జీ ఉద్యోగులందరికీ ఎఫ్‌టీఈ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే సమస్యలను పరిష్కరించాలని, లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు హెచ్చరించారు.

