epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

సీఎంఆర్ దందాలో పెద్ద చేపలెవరు..?

సీఎంఆర్ దందాలో పెద్ద చేపలెవరు..?
చిన్న మిల్లులకే ఉచ్చు.. బడా మిల్లర్లకు మినహాయింపా..?
టార్గెట్‌గా చేసుకుని విజిలెన్స్ దాడులు జ‌రుగుతున్నాయా..?
బకాయిలున్న మిల్లర్లకే మళ్లీ ధాన్యం కేటాయింపులా..?
స్టాక్ లెక్కలు, సీఎంఆర్ బియ్యంపై సమగ్ర విచారణకు డిమాండ్

కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ జిల్లాలో సీఎంఆర్ బియ్యం వ్యవహారం మరోసారి కలకలం రేపుతోంది. ప్రభుత్వ ధాన్యం మిల్లింగ్ ప్రక్రియలో చోటుచేసుకున్న అక్రమాలపై విజిలెన్స్ దాడులు జరుగుతున్నప్పటికీ, ఆ చర్యలు అందరికీ సమానంగా అమలవుతున్నాయా? లేక కొందరికే పరిమితమయ్యాయా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. చిన్న రైస్ మిల్లులపైనే కేసులు నమోదు చేస్తూ, భారీ స్థాయిలో సీఎంఆర్ నిర్వహించిన బడా మిల్లర్ల వ్యవహారంపై అదే స్థాయిలో దృష్టి సారించలేదనే ఆరోపణలు జిల్లాలో చర్చకు దారితీశాయి. దీంతో మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలికితీయాలనే డిమాండ్ బలపడుతోంది.

బకాయిలున్నా… మళ్లీ కేటాయింపులా..?

గత సీజన్‌ల సీఎంఆర్ బకాయిలు, పెనాల్టీలు, వివాదాలు ఉన్నప్పటికీ కొందరు మిల్లర్లకు మళ్లీ ప్రభుత్వ ధాన్యం కేటాయింపులు జరిగాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనల ప్రకారం బకాయిలు పూర్తిగా చెల్లించిన తర్వాతే కొత్త కేటాయింపులు జరగాల్సి ఉండగా, ఆ ప్రక్రియను పూర్తిగా పాటించారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బ్యాంకు గ్యారంటీలు, అర్హత ప్రమాణాలు, ఒప్పంద నిబంధనల అమలుపైనా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని రైస్ మిల్లుల్లో రికార్డుల్లో చూపిన ధాన్యం నిల్వలకు, వాస్తవ స్టాక్‌కు మధ్య వ్యత్యాసాలున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీఎంఆర్ బియ్యం నిల్వలు, రవాణా వివరాలు, గోదాముల లెక్కలను సమగ్రంగా పరిశీలిస్తే అసలు పరిస్థితి బయటపడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అక్రమంగా ధాన్యం తరలింపు, రికార్డుల నిర్వహణలో లోపాలపై కూడా లోతైన విచారణ అవసరమని పలువురు కోరుతున్నారు.

అందరికీ ఒకే న్యాయం ఉండాలి

అక్రమాలకు పాల్పడిన వారు ఎవరైనా చట్టం ముందు సమానమేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. చిన్న మిల్లులపై మాత్రమే చర్యలు తీసుకుని, పెద్ద మిల్లర్లను వదిలేస్తే విచారణపై అనుమానాలు పెరుగుతాయని చెబుతున్నారు. జిల్లాలోని అన్ని రైస్ మిల్లులను ఒకే ప్రమాణంతో తనిఖీ చేసి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై సమానంగా చర్యలు తీసుకుంటేనే ప్రభుత్వానికి నష్టం చేసిన అసలు బాధ్యులు బయటపడతారని అభిప్రాయపడుతున్నారు. సీఎంఆర్ బియ్యం వ్యవహారంలో ఎలాంటి వివక్షకు తావులేకుండా జిల్లాలోని అన్ని మిల్లులపై ప్రత్యేక ఆడిట్ నిర్వహించాలని, గత మూడు సీజన్‌ల ధాన్యం కేటాయింపులు, సీఎంఆర్ బకాయిలు, స్టాక్ రికార్డులు, బ్యాంకు గ్యారంటీలను సమగ్రంగా పరిశీలించాలని రైతు సంఘాలు, మిల్లింగ్ రంగానికి చెందిన పలువురు కోరుతున్నారు. సమగ్ర విచారణ ద్వారానే ఆరోపణలకు తెరపడుతుందని, ప్రభుత్వ ధాన్యం నిర్వహణలో పారదర్శకతకు భరోసా లభిస్తుందని అభిప్రాయపడుతున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.