epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఖమ్మంను ప్రభుత్వం గాలికొదిలేసింది

ఖమ్మంను ప్రభుత్వం గాలికొదిలేసింది
ముగ్గురు మంత్రులున్నా.. నగరాన్ని సమస్యల కూపంగా మార్చేశారు
చెత్త కుప్పలే కాంగ్రెస్ పాలనకు నిదర్శనం
ఖ‌మ్మం ప‌ట్ట‌ణ బీఆర్ఎస్ నాయ‌కుల ధ్వ‌జం
స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల‌ని డిమాండ్ చేస్తూ కార్పోరేష‌న్ ముట్ట‌డి
డిప్యూటీ కమిషనర్‌కు వినతిపత్రం

కాకతీయ, ఖమ్మం: ఖమ్మం నగరాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం సమస్యల మయంగా మార్చేసిందని, ప్రజల కష్టాలను పూర్తిగా గాలికొదిలేసిందని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశాల మేరకు బుధవారం మాజీ కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడించి డిప్యూటీ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నగర పాలన పూర్తిగా గాడితప్పిందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ గాలికొదిలేసి ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. ప్రజల సమస్యలు పట్టించుకోకుండా పాలకులు కాలం గడుపుతున్నారని ధ్వజమెత్తారు.

చెత్త కుప్పలే కాంగ్రెస్ పాలనకు నిదర్శనం

నగరంలో పారిశుద్ధ్య వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయిందని, చెత్తను రోజుల తరబడి తొలగించక ప్రజలను రోగాల బారిన పడేలా చేస్తున్నారని ఆరోపించారు. వీధి దీపాలు వెలగక ప్రజలు రాత్రివేళ భయాందోళనలకు గురవుతున్నారని, గుంతలమయమైన రహదారులతో ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయని అన్నారు. పార్కులు నిర్లక్ష్యానికి గురై ప్రజలకు వినియోగం లేకుండా పోయాయని విమర్శించారు. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులు, నీటి కనెక్షన్ల మంజూరు, ఇంటి పన్నుల వ్యవహారం, మున్సిపల్ డీజిల్ వినియోగం, పబ్లిక్ టాయిలెట్లకు అనుబంధంగా షాపుల కేటాయింపులో జరిగిన అక్రమాలపై స్వతంత్ర సంస్థతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అవినీతికి పాల్పడిన వారిని కాపాడే ప్రయత్నాలు మానుకుని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రజా సమస్యలు పరిష్కరించకుండా కాలయాపన చేస్తే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మరింత ఉద్ధృతంగా ప్రజా ఉద్యమాలు చేపడతామని స్పష్టం చేశారు. ప్రజలకు జవాబుదారీతనంతో కూడిన పాలన అందించడం ప్రభుత్వ బాధ్యత అని, ఖమ్మం ప్రజల తరఫున తమ పోరాటం కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, మాజీ నగర పార్టీ అధ్యక్షుడు పగడాల నాగరాజు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆర్‌జేసీ కృష్ణ, మాజీ జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఖమర్, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కర్ణాటక కృష్ణ, మాజీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మబ్బుల్, మాజీ డిప్యూటీ మేయర్ బత్తుల మురళి, మాజీ కార్పొరేటర్లు బిక్కసాని ప్రశాంతలక్ష్మి, పల్లా రోషిలిని, శీలంశెట్టి వీరభద్రం, తోట రామారావు, మాటేటి నాగేశ్వరరావు, కూరాకుల వల్లరాజుతో పాటు తాజుద్దీన్, గొల్లపూడి రాంప్రసాద్, దేవభక్తిని కిషోర్, జస్వంత్, సద్దాం షేక్, మాటేటి కిరణ్, మోరంపూడి సాయి, షకీన, ఉస్మాన్, వీరేందర్, అశోక్, సాజిద్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.