epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

హైదరాబాద్‌కు దీటుగా మూడు మహానగరాలు..!

హైదరాబాద్‌కు దీటుగా మూడు మహానగరాలు..!
వరంగల్-ఖమ్మం-కరీంనగర్‌కు గ్రోత్ కారిడార్ మాస్టర్‌ప్లాన్
హైదరాబాద్ తరహాలో ఔటర్ రింగ్ రోడ్ల నిర్మాణానికి డీపీఆర్‌లు
రూ.14 వేల కోట్ల ప్రతిపాదనలకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్
మొదటి విడతలో రూ.5,681 కోట్ల ప్రాజెక్టులకు ఆమోదం
కార్పొరేషన్ ఎన్నికల వేళ కాంగ్రెస్ అస్త్రంగా మెగా ప్రణాళిక
ద్వితీయ శ్రేణి నగరాల రూపురేఖలు మార్చే వ్యూహానికి శ్రీకారం

కాకతీయ, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్‌పై పెరుగుతున్న భారం తగ్గించడంతో పాటు ద్వితీయ శ్రేణి నగరాలను సమాంతర అభివృద్ధి కేంద్రాలుగా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రణాళికకు శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ (డీటీసీపీ) వరంగల్, ఖమ్మం, కరీంనగర్ నగరాలను అనుసంధానిస్తూ ప్రత్యేక గ్రోత్ కారిడార్ మాస్టర్‌ప్లాన్‌ను రూపొందిస్తోంది. ఈ మూడు నగరాలకు హైదరాబాద్ తరహాలో ఔటర్ రింగ్ రోడ్లను నిర్మించి, పారిశ్రామిక, రియల్ ఎస్టేట్, మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఊతమివ్వాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల కోసం కేంద్ర ప్రభుత్వ అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద రూ.14 వేల కోట్ల నిధులను కోరగా, తొలి విడతలో ఐదు కీలక ప్రాజెక్టులకు రూ.5,681.04 కోట్లకు ఆమోదం లభించింది. ఇందులో కేంద్రం తన వాటాగా 25 శాతం మేర రూ.1,420.26 కోట్లను ఇప్పటికే విడుదల చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఔటర్ రింగ్ రోడ్లతో నగరాల రూపురేఖలు మార్పు

వరంగల్, ఖమ్మం, కరీంనగర్ నగరాల్లో ట్రాఫిక్ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడంతో పాటు పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో హైదరాబాద్ తరహాలో ఔటర్ రింగ్ రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందుకోసం డీపీఆర్‌ల తయారీ వేగంగా కొనసాగుతోంది. గ్రోత్ కారిడార్ అమల్లోకి వస్తే పరిశ్రమలు, లాజిస్టిక్స్, గిడ్డంగులు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు కొత్త అవకాశాలు ఏర్పడనున్నాయి. సీడీఎంఏ పరిధిలోని మున్సిపాలిటీలను అనుసంధానిస్తూ ప్రత్యేక అభివృద్ధి క్లస్టర్లను కూడా రూపొందిస్తున్నారు.

టూరిజం.. పరిశ్రమలకు కొత్త కారిడార్లు

ద్వితీయ శ్రేణి నగరాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రత్యేక కారిడార్ల రూపకల్పన కూడా వేగం అందుకుంది. నల్గొండ-యాదాద్రి ప్రాంతాలను అనుసంధానిస్తూ టెంపుల్ కారిడార్, ఆదిలాబాద్-నాగోబా-బాసర-కడెం ప్రాంతాలను కలుపుతూ టూరిజం కారిడార్, మహబూబ్‌నగర్-భూత్పూర్-జడ్చర్ల ప్రాంతాల్లో పారిశ్రామిక కారిడార్, కొత్తగూడెం-పాల్వంచ-సుజాతనగర్ ప్రాంతాల్లో ఎకనామిక్ కారిడార్ ఏర్పాటు దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ కారిడార్లు ప్రాంతీయ సమతుల అభివృద్ధికి దోహదపడతాయని అధికారులు భావిస్తున్నారు.

ఎన్నికల వేళ రాజకీయ ప్రాధాన్యం

వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ మెగా అభివృద్ధి ప్రణాళికలకు శ్రీకారం చుట్టడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ రెండు కార్పొరేషన్లలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోటీ నెలకొన్న నేపథ్యంలో అభివృద్ధి అజెండాతో ప్రజల్లోకి వెళ్లేందుకు అధికార పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. గతంలో బీఆర్ఎస్‌కు బలమైన పట్టున్న ఈ నగరాల్లో ఇటీవల రాజకీయ సమీకరణాలు మారడంతో కాంగ్రెస్ తన బలాన్ని పెంచుకుంది. గ్రోత్ కారిడార్, మౌలిక సదుపాయాల విస్తరణ వంటి అంశాలు ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశముందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

ఆర్థికాభివృద్ధికి బలమైన పునాది

ద్వితీయ శ్రేణి నగరాలను అభివృద్ధి చేయడం ద్వారా హైదరాబాద్‌పై ఒత్తిడి తగ్గడంతో పాటు గ్రామీణ ప్రాంతాల నుంచి వలసలను నియంత్రించాలన్నది ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా ఉంది. ఐటీ, తయారీ రంగాలను జిల్లాలకు విస్తరించడం ద్వారా స్థానికంగానే ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ప్రణాళికాబద్ధమైన పట్టణీకరణతో తాగునీరు, డ్రైనేజీ, రహదారులు, ఇతర మౌలిక వసతులను ముందుగానే అభివృద్ధి చేసే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. భూముల విలువలు పెరగడంతో పాటు రియల్ ఎస్టేట్ రంగానికి కూడా కొత్త ఊపు లభించే అవకాశం ఉందని రియల్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో అమలైతే తెలంగాణలోని ప్రధాన జిల్లా కేంద్రాలు మినీ మహానగరాలుగా రూపాంతరం చెందే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వం భావిస్తోంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ ప్రజల సమస్యలు,...

ఎర్రవల్లిలో ఉద్రిక్తత

ఎర్రవల్లిలో ఉద్రిక్తత కేసీఆర్ ఫాం హౌస్‌కు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌...

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను మోసం చేసింది వంద...

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా?

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా? మహిళా శాసనసభ్యుల చీరెలు లాగుతారా.....

నీటి కష్టాలకు కేసీఆర్‌ వైఫల్యాలే కార‌ణం

నీటి కష్టాలకు కేసీఆర్‌ వైఫల్యాలే కార‌ణం రూ.1.81 లక్షల కోట్లు ఖర్చు చేసినా...

ఇనుగాల‌కు అవ‌మానం

ఇనుగాల‌కు అవ‌మానం కుడా మాజీ చైర్మ‌న్‌కు నో ఫేర్‌వెల్ ఆఘ మేఘాల మీద నూత‌న...

కాంగ్రెస్‌కు కొండా గుడ్‌బై..?

కాంగ్రెస్‌కు కొండా గుడ్‌బై..? బీఆర్ఎస్‌తో దంప‌తుల‌ మంతనాలు! కేటీఆర్‌ నేరుగా కొండా సురేఖకు ఫోన్‌ గత...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.