మాంట్‌ఫోర్ట్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
27 ఏళ్ల తర్వాత కలుసుకున్న 1998–99 బ్యాచ్ విద్యార్థులు
నాటి గురువులకు ఘన సన్మానం
కాకతీయ, ఖమ్మం: ఖమ్మం గుట్టలబజార్ మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో 1998–99 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. 27 ఏళ్ల తర్వాత ఒకేచోట కలుసుకున్న విద్యార్థులు నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుని ఆనందంగా గడిపారు. నాటి ప్రధానోపాధ్యాయులు బ్రదర్ జార్జిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పూర్వ విద్యార్థులను అభినందించారు. తాము అందించిన విద్య, క్రమశిక్షణకు విద్యార్థుల విజయాలే నిజమైన గుర్తింపన్నారు. నాటి ఉపాధ్యాయులు కలీలుద్దీన్, రమణ, రాజేంద్రప్రసాద్, మల్లయ్య, నరసింహారావు తదితరులు పాల్గొని విద్యార్థులను అభినందించారు. పాఠశాలను, గురువులను గుర్తుచేసుకుని సన్మానించడం అభినందనీయమన్నారు. సమ్మేళనంలో వినయ్‌కుమార్, కిరణ్, వినీత్, చంద్రశేఖర్, మనోహర్, మాతంగి అనిల్‌కుమార్, నాగరాజు, పాపారావు, గణేష్, జి. వెంకటేశ్వర్లు, రవి, విజయ్‌రాజు, నాగేశ్వరరావు, శేఖర్, గురవయ్య, రామారావు, భానుప్రసాద్, రాజేష్, ఖాదర్‌బాబు, కుక్కల క్రాంతి, బసవయ్య, విక్రమ్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

