epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

పోడు సాగుదారులపై దాడులను ప్రతిఘటించాలి

పోడు సాగుదారులపై దాడులను ప్రతిఘటించాలి
ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రలను అడ్డుకుంటాం
గ్రామీణ ప్రాంతాల్లో కనీస వసతులు కల్పించడంలో పాలకుల వైఫల్యం
ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను సమిష్టిగా అడ్డుకుందాం
గుండాల ప్రాంతంలో నూతన భూగర్భ గనులు ఏర్పాటు చేయాలి
సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా

కాకతీయ, గుండాల : గుండాల ఏజెన్సీలో గిరిజన, గిరిజనేతర పోడు సాగుదారులు సాగు చేసుకుంటున్న భూములకు తక్షణమే హక్కులు కల్పించాలని సీపీఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా డిమాండ్ చేశారు. పోడు సాగుదారులపై అటవీ, పోలీస్, రెవెన్యూ శాఖల దాడులు, దౌర్జన్యాలను ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. సీపీఐ జాతీయ సమితి పిలుపులో భాగంగా గుండాల మండలంలో కొనసాగుతున్న ప్రజా చైతన్య యాత్రలో భాగంగా ఆదివారం ఆయన మాట్లాడారు. దశాబ్దాలుగా భూములను నమ్ముకుని జీవిస్తున్న పోడు సాగుదారులపై అధికారులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని సాబీర్ పాషా ఆరోపించారు. సాగుభూములను లాక్కోవడం అటవీ హక్కుల చట్టాన్ని నీరుగార్చడమేనన్నారు. తక్షణమే సాగుదారులకు హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు.

ఉపాధి హామీని నిర్వీర్యం చేయొద్దు

గ్రామీణ పేదలకు ఆధారంగా ఉన్న ఉపాధి హామీ పథకాన్ని దశలవారీగా నిర్వీర్యం చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని విమర్శించారు. మారుమూల గ్రామాలకు కనీస రోడ్లు, మౌలిక వసతులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని, ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్‌ శక్తులకు అప్పగిస్తోందని సాబీర్ పాషా ఆరోపించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, ప్రభుత్వ రంగ సంస్థల రక్షణ కోసం పోరాటాలను ఉధృతం చేస్తామన్నారు. గుండాల ప్రాంతంలో నూతన భూగర్భ గనులు ఏర్పాటు చేసి స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. బద్లావ్ జరూరీ హై నినాదంతో చేపట్టిన ప్రజా చైతన్య యాత్రను విజయవంతం చేయాలని, సెప్టెంబర్ 1న నిర్వహించే చలో ఢిల్లీ కార్యక్రమానికి ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా కొమురం భీమ్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సీపీఐ గుండాల మండల కార్యదర్శి వాగబోయిన రమేష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎస్కే షాహిద్ అధ్యక్షతన యాత్ర జరిగింది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ముత్యాల విశ్వనాధం, ఏఐటీయూసీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి నరాటి ప్రసాద్, సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు, పినపాక నియోజకవర్గ కార్యదర్శి సారెడ్డి పుల్లారెడ్డి, సీపీఐ కార్యవర్గ సభ్యులు రేసు ఎల్లయ్య, మహిళా సమైక్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మీ కుమారి, సీపీఐ కార్యవర్గ సభ్యులు ఉప్పుశెట్టి రాహుల్, ఏఐఎస్ఎఫ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి వరక అజిత్, బచ్చల రామయ్య, లక్ష్మయ్య, సమ్మయ్య, సమీర్, సంధ్యారాణి, నాగమణి, ఎర్రమ్మ, అప్రోచ్, నాసిర్, షబ్బీర్, పవన్ కళ్యాణ్, రవి వర్మ, వంశీ, వరుణ్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.