epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

అటవీ శాఖ అమరుల త్యాగం చిరస్మరణీయం: మంత్రి కొండా సురేఖ

కాకతీయ, తెలంగాణ బ్యూరో: విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన అటవీ శాఖ సిబ్బందిని స్మరించుకుంటూ, గురువారం (సెప్టెంబర్ 11) నెహ్రూ జూలాజికల్ పార్కులో అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆమెతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ డాక్టర్ జితేందర్, పీసీసీఎఫ్ సువర్ణ, జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి తదితరులు పాల్గొన్నారు.

మంత్రి మాట్లాడుతూ.. 1730లో రాజస్థాన్‌లో బిష్నోయి తెగకు చెందిన 360 మంది కేజ్రి చెట్లు కాపాడేందుకు ప్రాణత్యాగం చేసిన సంఘటనను గుర్తుచేసుకుంటూ, కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది సెప్టెంబర్ 11న “అటవీ అమరవీరుల దినోత్సవం”గా నిర్వహించాలని నిర్ణయించిందని తెలిపారు. తెలంగాణలో కూడా ఈ రోజున ప్రతి సంవత్సరం అటవీ సిబ్బంది త్యాగాలను స్మరించుకుంటూ కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు.

అటవీ సిబ్బంది త్యాగాలు:
తెలంగాణలో 1984 నుండి ఇప్పటివరకు 22 మంది అటవీ అధికారులు, సిబ్బంది తమ ప్రాణాలను అర్పించి, అడవులను రక్షించారని మంత్రి గుర్తు చేశారు. అక్రమ కలప రవాణా, అటవీ భూముల ఆక్రమణలను అరికట్టడంలో వీరు అచంచల ధైర్యంతో పని చేశారని కొనియాడారు. 2014 నుండి 2025 జూలై వరకు టేకు, మారు జాతి కలప స్మగ్లింగ్‌ కేసులు, 10,375 భూ ఆక్రమణ కేసులు నమోదు అయ్యాయి. 2025 సంవత్సరంలో మాత్రమే 96,813 కేసులు నమోదు చేసి, రూ.149.66 కోట్ల విలువైన కలపను స్వాధీనం చేసుకుని, రూ.51.50 కోట్ల జరిమానా వసూలు చేశారని వివరించారు. అదేవిధంగా 18,002 వాహనాలు స్వాధీనం చేసుకోవడం, 29,858 గుర్తు తెలియని కేసులు (UDOR) నమోదు చేసి, రూ.67.13 కోట్ల విలువైన అక్రమ కలపను స్వాధీనం చేసినట్లు తెలిపారు.

అటవీ రక్షణ కోసం చర్యలు:

*రాష్ట్రంలో 174 బేస్ క్యాంపులు, 62 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు.

*అడవుల్లో పశువుల చొరబాటును అరికట్టేందుకు కాలువలు నిర్మిస్తున్నారు.

*సాయుధ పోలీసు దళాల సహాయంతో కలప స్మగ్లింగ్‌పై కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

*PD Act కింద టేకు అక్రమ రవాణాదారులపై 5 కేసులు నమోదు చేశారు.

అలాగే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అటవీ శాఖను బలోపేతం చేయడానికి 2,118 వాహనాలు (2008 బైక్‌లు, 110 జీపులు) అందజేశామని, 2022లో 1,516 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చి, ప్రస్తుతం రిక్రూట్‌మెంట్ ప్రక్రియ కొనసాగుతోందని మంత్రి తెలిపారు.

అటవీ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది:
అడవులను రక్షించడమే కాకుండా, వన్యప్రాణుల ఆవాసాలను మెరుగుపరచడానికి పలు కార్యక్రమాలు కొనసాగుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. అటవీ సంరక్షణలో ప్రజల భాగస్వామ్యం అవసరమని, ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా మంత్రి అమరుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ, అమరుల స్తూపం వద్ద పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. కార్యక్రమంలో అటవీ శాఖ ఉన్నతాధికారులు, రిటైర్డ్ సిబ్బంది, అమరుల కుటుంబ సభ్యులు పాల్గొని, తమ త్యాగాలతో చరిత్రలో నిలిచిపోయిన అటవీ అమరవీరులను స్మరించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కరెంటు లేక రైతుల అవస్థలు

కరెంటు లేక రైతుల అవస్థలు కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యంతో పంటలు ఎండుతున్నాయి ఎల్‌నినో ముప్పు...

ఏఎమ్మార్‌లో ఈడీ రైడ్‌

ఏఎమ్మార్‌లో ఈడీ రైడ్‌ రూ.650 కోట్ల బొగ్గు నిధుల మళ్లింపుపై సోదాలు! హైదరాబాద్‌లో ఏఎంఆర్‌...

వాస్తవాలు రాస్తే ఉక్రోషం..!

వాస్తవాలు రాస్తే ఉక్రోషం..! నాపై వార్తలు రాసిన వాళ్లపై కేసులు పెట్టండి ‘కాకతీయ’ స్టాఫర్‌పై...

మా కుటుంబాన్ని వేధించొద్దు

మా కుటుంబాన్ని వేధించొద్దు సుమంత్ విష‌యంలో వాస్తవాలను ప‌రిశీలించండి 20 రోజులుగా మా కుటుంబంపై...

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.