epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఖర్గేపై వివక్షను సహించం

ఖర్గేపై వివక్షను సహించం
దళిత నాయకుడిని అవమానించడం రాజ్యాంగ విలువలకు విరుద్ధం
వేదిక శుద్ధీకరణ కుల వివక్షకు నిదర్శనం
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి
డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్‌ రెడ్డి

కాకతీయ, వరంగల్ బ్యూరో : దళిత నాయకుడు, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేపై హల్ద్వానీలో జరిగిన వివక్షపూరిత చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్‌ రెడ్డి అన్నారు. ఒక జాతీయ నాయకుడు ప్రసంగించిన వేదికను గంగాజలంతో శుద్ధీకరించడం, హవనం నిర్వహించడం కుల వివక్షకు పరాకాష్ఠ అని పేర్కొన్నారు. ఏఐసీసీ పిలుపు మేరకు శుక్రవారం అంబేద్కర్‌ జంక్షన్‌ నుంచి పబ్లిక్‌ గార్డెన్‌ వరకు కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన ర్యాలీ అనంతరం గాంధీ విగ్రహం వద్ద సత్యాగ్రహం చేపట్టారు. వరంగల్‌ పార్లమెంట్‌ సభ్యురాలు డాక్టర్‌ కడియం కావ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌ రెడ్డి, కేఆర్‌ నాగరాజు పాల్గొని ఖర్గేకు సంఘీభావం తెలిపారు.

రాజ్యాంగాన్ని అవమానించడమే

భారత రాజ్యాంగం అస్పృశ్యత, కుల వివక్షను నిషేధించిందని ఇనగాల వెంకట్రామ్‌ రెడ్డి అన్నారు. దేశంలో అత్యున్నత స్థానంలో ఉన్న దళిత నాయకుడిపై ఇలాంటి చర్యలు జరగడం ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ విలువలకు విరుద్ధమన్నారు. కులం, మతం ఆధారంగా ఎవరినీ తక్కువ చేసి చూసే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు. ఖర్గేపై వివక్షకు పాల్పడిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని, అస్పృశ్యత నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. సామాజిక న్యాయం, సమానత్వం, రాజ్యాంగ విలువల పరిరక్షణకు కాంగ్రెస్‌ నిరంతరం పోరాడుతుందని తెలిపారు. కార్యక్రమంలో మాజీ మేయర్‌ గుండు సుధారాణి, పులి ప్రియాంక, తౌటం జాన్సీ, గొట్టిముక్కల సాగరిక రావు, బొద్దిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, ఈ.వి. శ్రీనివాసరావు, బత్తిని శ్రీనివాస్‌ రావు తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం మంచినీరు, ఘన వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణపై ప్రత్యేక...

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక...

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర!

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర! రోడ్లన్నీ ఆక్రమణ.. పార్కింగ్ స్థ‌లాల్లోనూ అమ్మకం చైర్ పర్సన్...

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం పంటల వైవిధ్యీకరణతో వాతావరణ మార్పులు మార్కెట్‌ ఒడిదుడుకులను...

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే కేసీఆర్‌ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి...

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి మట్టి...

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.