epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఇంటర్‌ ప్రవేశాలకు ఆగస్టు 31 వరకు గడువు

ఇంటర్‌ ప్రవేశాలకు ఆగస్టు 31 వరకు గడువు
ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు మరో అవకాశం
ప్రవేశాల్లో నిబంధనలు తప్పనిసరి
పదో తరగతి ఫలితాల ఆధారంగానే సీట్లు
తెలంగాణ మాధ్యమిక విద్యా బోర్డు ఆదేశాలు

కాక‌తీయ‌,తెలంగాణ బ్యూరో : 2026-27 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరం ప్రవేశాల గడువును ఆగస్టు 31 వరకు పొడిగిస్తూ తెలంగాణ మాధ్యమిక విద్యా బోర్డు నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ప్రవేశాలు పొందలేకపోయిన విద్యార్థులకు మరో అవకాశం కల్పించిన బోర్డు, ప్రవేశ ప్రక్రియలో రిజర్వేషన్‌, నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని కళాశాలల యాజమాన్యాలను ఆదేశించింది. పదో తరగతిలో సాధించిన గ్రేడ్‌ పాయింట్‌ సగటు, విషయాల వారీగా గ్రేడ్‌ పాయింట్లు, అర్హత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగానే ప్రవేశాలు కల్పించాలని స్పష్టం చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు సహాయ, ప్రైవేటు స్వతంత్ర, సహకార, తెలంగాణ నివాస, సాంఘిక సంక్షేమ నివాస, గిరిజన సంక్షేమ నివాస, మోడల్‌, కేజీబీవీ, తెలంగాణ గురుకుల విద్యా సంస్థలు, బీసీ సంక్షేమ, ప్రోత్సాహ జూనియర్‌ కళాశాలలతో పాటు రెండేళ్ల ఇంటర్‌ కోర్సును అందిస్తున్న సమ్మిళిత డిగ్రీ కళాశాలలకు ఈ గడువు పొడిగింపు వర్తిస్తుంది. కళాశాలలు బోర్డు నిర్దేశించిన షెడ్యూల్‌ను తప్పనిసరిగా పాటించాలి.

ప్రవేశ పరీక్షలకు నో

ఇంటర్‌ ప్రవేశాల కోసం ఎలాంటి ప్రవేశ పరీక్షలు నిర్వహించరాదని బోర్డు స్పష్టం చేసింది. విద్యార్థుల పదో తరగతి గ్రేడ్‌లు, మార్కుల ఆధారంగానే సీట్ల కేటాయింపు జరగాలి. రిజర్వేషన్‌ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని సూచించింది. ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 10 శాతం, బీసీలకు 29 శాతం, దివ్యాంగులకు 5 శాతం, ఎన్‌సీసీ, క్రీడలు, ఇతర కార్యకలాపాలకు 5 శాతం, తెలంగాణలో నివసిస్తున్న మాజీ సైనికులు, రక్షణ సిబ్బందికి 3 శాతం, ఆర్థికంగా బలహీన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్‌ అమలు చేయాలని పేర్కొంది. బాలికల కోసం ప్రత్యేక కళాశాలలు లేని ప్రాంతాల్లో మొత్తం సీట్లలో 33.33 శాతం సీట్లను బాలికలకు కేటాయించాలని బోర్డు ఆదేశించింది. గ్యాప్‌ కాలం తర్వాత ఇంటర్‌లో చేరే విద్యార్థులు ఆ వ్యవధికి సంబంధించి స్థానిక అభ్యర్థి లేదా నివాస ధ్రువీకరణ పత్రాన్ని సంబంధిత తహసీల్దార్‌ నుంచి పొందాలి. జోగిని పిల్లల విషయంలో తండ్రి పేరు స్థానంలో తల్లి పేరును నమోదు చేయాలని స్పష్టం చేసింది.

సీట్ల భర్తీపై పరిమితులు

ప్రైవేటు స్వతంత్ర జూనియర్‌ కళాశాలలు బోర్డు అనుమతించిన విభాగాల్లోనే ప్రవేశాలు కల్పించాలి. ఒక్కో విభాగంలో గరిష్ఠంగా 88 మంది విద్యార్థులకే ప్రవేశం ఇవ్వాలి. బోర్డు నిలిపివేసిన కాంబినేషన్లలో ప్రవేశాలు కల్పించరాదని హెచ్చరించింది. అదనపు విభాగాలను ప్రారంభించాలంటే ముందుగా బోర్డు అనుమతి తీసుకోవాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు, గుర్తింపు రద్దు వంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందని పేర్కొంది. కళాశాలలు ప్రవేశ ద్వారం వద్ద అనుమతించిన విభాగాలు, మొత్తం సీట్లు, భర్తీ అయిన సీట్లు, ఖాళీగా ఉన్న సీట్ల వివరాలను రోజువారీగా ప్రదర్శించాలి. ప్రవేశ సమయంలో విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి మత్తు పదార్థాల వ్యతిరేక ప్రకటనను తప్పనిసరిగా తీసుకోవాలి. బాలికల భద్రత, రక్షణకు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించింది. విదేశీ పౌరులు, విదేశాల్లోని భారతీయ పౌరులు ప్రవేశం పొందిన సందర్భంలో సంబంధిత నిబంధనలను పాటించాలని బోర్డు ఆదేశించింది. ప్రవేశం పొందిన 24 గంటల్లో సంబంధిత పోలీస్‌ స్టేషన్‌కు నిర్ణీత ఫారమ్‌ ప్రతిని సమర్పించాలి. విద్యార్థులు బోర్డు గుర్తింపు పొందిన కళాశాలల్లోనే ప్రవేశాలు పొందాలని, గుర్తింపు లేని కళాశాలల్లో చేరి నష్టపోవద్దని సూచించింది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ ప్రజల సమస్యలు,...

ఎర్రవల్లిలో ఉద్రిక్తత

ఎర్రవల్లిలో ఉద్రిక్తత కేసీఆర్ ఫాం హౌస్‌కు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌...

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను మోసం చేసింది వంద...

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా?

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా? మహిళా శాసనసభ్యుల చీరెలు లాగుతారా.....

నీటి కష్టాలకు కేసీఆర్‌ వైఫల్యాలే కార‌ణం

నీటి కష్టాలకు కేసీఆర్‌ వైఫల్యాలే కార‌ణం రూ.1.81 లక్షల కోట్లు ఖర్చు చేసినా...

ఇనుగాల‌కు అవ‌మానం

ఇనుగాల‌కు అవ‌మానం కుడా మాజీ చైర్మ‌న్‌కు నో ఫేర్‌వెల్ ఆఘ మేఘాల మీద నూత‌న...

కాంగ్రెస్‌కు కొండా గుడ్‌బై..?

కాంగ్రెస్‌కు కొండా గుడ్‌బై..? బీఆర్ఎస్‌తో దంప‌తుల‌ మంతనాలు! కేటీఆర్‌ నేరుగా కొండా సురేఖకు ఫోన్‌ గత...

ఇదేం అన్యాయం..!?

ఇదేం అన్యాయం..!? కుడా చైర్‌ప‌ర్స‌న్‌గా సుధారాణి నియామ‌కంపై కాంగ్రెస్‌లో అసంతృప్తి పార్టీ అధికారంలోకి వ‌చ్చాక...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.