నవీన్ నాయక్‌కు ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ నివాళి
కాకతీయ, కారేపల్లి: సింగరేణి మాజీ ఎంపీపీ బానోత్ దేవ్లా నాయక్ కుమారుడు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ స్వర్గీయ బానోత్ నవీన్ నాయక్ దశదిన కార్యక్రమానికి వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ హాజరై నివాళులర్పించారు. నవీన్ నాయక్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో ఖమ్మం జిల్లా స్తంభాద్రి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (సుడా) చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, వైరా నియోజకవర్గ పీసీసీ సభ్యులు వడ్డే నారాయణరావు, జిల్లా ఓబీసీ అధ్యక్షులు పుచ్చకాయల వీరభద్రం, సింగరేణి మండల కాంగ్రెస్ అధ్యక్షులు తోటకూరి రాంబాబు, సర్పంచ్ సంఘం అధ్యక్షులు భూక్యా రంజిత్ కుమార్, జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి బానోత్ రామ్మూర్తి నాయక్, అడ్డగోడ ఐలయ్య, వైరా మున్సిపాలిటీ వైస్ చైర్మన్ కట్ల సంతోష్, మద్దిని శ్రీనివాసరావు, గూగులోత్ హర్ష నాయక్, గోపాల్ నాయక్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

