epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

తెలంగాణలో దూసుకెళ్తున్న ఈవీలు

తెలంగాణలో దూసుకెళ్తున్న ఈవీలు
రాయితీలతో పెరిగిన కొనుగోళ్లు..
ఏడాదిలో 91,107 వాహనాలు
కొత్త వాహనాల నమోదులో 8.8 శాతం వాటా
కార్లలో ఈవీల వాటా 12.5 శాతం
హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌లోనే 68 శాతం నమోదు

కాకతీయ, హైదరాబాద్‌: తెలంగాణలో ఎలక్ట్రిక్‌ వాహనాల (ఈవీ) మార్కెట్‌ వేగంగా విస్తరిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు, ముఖ్యంగా రోడ్డు పన్ను, రిజిస్ట్రేషన్‌ ఫీజులపై 100 శాతం మినహాయింపుతో ఈవీల కొనుగోళ్లకు భారీగా ఊతమిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా 91,107 ఎలక్ట్రిక్‌ వాహనాలు రిజిస్టర్‌ కాగా.. వీటి మొత్తం ఇన్‌వాయిస్‌ విలువ రూ.6,283 కోట్లుగా ఉంది. మొత్తం కొత్త వాహనాల నమోదులో ఈవీల వాటా 8.8 శాతానికి చేరింది. కార్ల విభాగంలో ఈ వాటా ఏకంగా 12.5 శాతంగా నమోదవడం ఈవీలకు పెరుగుతున్న ఆదరణకు నిదర్శనంగా మారింది. మరోవైపు 243 ఎలక్ట్రిక్‌ బస్సులు కూడా రోడ్డెక్కాయి.

జీఓ 41తో భారీ ఊతం

ఎలక్ట్రిక్‌ వాహనాల కొనుగోళ్లను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2024 నవంబరు 16న జీఓ 41 జారీ చేసింది. దీని ప్రకారం ఈవీలపై రోడ్డు పన్ను, రిజిస్ట్రేషన్‌ ఫీజులో 100 శాతం మినహాయింపు కల్పించింది. గతంలో వాహనాల సంఖ్యపై ఉన్న పరిమితులను తొలగించి.. సంఖ్యతో సంబంధం లేకుండా ఈ రాయితీని వర్తింపజేశారు. ట్యాక్సీలు, ప్రైవేటు కార్లు, ద్విచక్ర వాహనాలు, ఆటోలు, టూరిస్టు క్యాబ్‌లు, తేలికపాటి గూడ్స్‌ వాహనాలు, మూడు సీట్ల ఆటోలు, ఎలక్ట్రిక్‌ ట్రాక్టర్లకు ఈ మినహాయింపు వర్తిస్తోంది. ప్రభుత్వ సంస్థలు ఉద్యోగుల కోసం నడిపే వాహనాలకు కూడా ఈ ప్రయోజనం అందుతోంది.

గ్రేటర్‌ పరిధిలోనే 68 శాతం

రాష్ట్రంలో ఎలక్ట్రిక్‌ వాహనాల కొనుగోళ్లలో హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లాలు ముందంజలో ఉన్నాయి. ఈ మూడు జిల్లాల్లోనే మొత్తం ఈవీ నమోదుల్లో సుమారు 68 శాతం నమోదయ్యాయి. ఆయా ప్రాంతాల్లో ఛార్జింగ్‌ స్టేషన్లు అందుబాటులో ఉండటం, నగర జీవనశైలికి అనుగుణంగా ఈవీల వినియోగం పెరగడం ఇందుకు ప్రధాన కారణాలుగా అధికారులు భావిస్తున్నారు. ఛార్జింగ్‌ మౌలిక వసతులు మరింత విస్తరితే ఈవీల మార్కెట్‌ రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ వేగంగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

పండుగ ఆఫర్లతో పెరిగిన డిమాండ్‌

నెలల వారీగా చూస్తే అక్టోబరు, ఫిబ్రవరిలో ఎలక్ట్రిక్‌ వాహనాల నమోదులు అధికంగా ఉన్నాయి. ఒక్క అక్టోబరులోనే 10,705 ఈవీలు రిజిస్టర్‌ అయ్యాయి. దసరా, దీపావళి సందర్భంగా వాహన తయారీ సంస్థలు ప్రకటించిన ప్రత్యేక ఆఫర్లు కూడా కొనుగోళ్లను పెంచినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు 18,852 ఎలక్ట్రిక్‌ కార్లు నమోదయ్యాయి. 2025–26లో కార్ల విభాగంలో ఈవీల వాటా మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి.

ఛార్జింగ్‌ మౌలిక వసతులపై దృష్టి

ఈవీల వినియోగం వేగంగా పెరుగుతున్నప్పటికీ ఛార్జింగ్‌ స్టేషన్ల కొరత ప్రధాన సవాలుగా మారుతోంది. ముఖ్యంగా హైదరాబాద్‌ వెలుపల ఛార్జింగ్‌ మౌలిక వసతులను విస్తరించాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర రవాణా శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఛార్జింగ్‌ స్టేషన్ల సంఖ్య పెరిగితే ప్రజల్లో ఉన్న ఆందోళనలు తగ్గి.. ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగం మరింత విస్తరించే అవకాశం ఉంది. మొత్తంగా పన్ను రాయితీలు, పెరుగుతున్న మోడళ్ల సంఖ్య, పర్యావరణంపై అవగాహన, ఇంధన ఖర్చుల ఆదా వంటి అంశాలు తెలంగాణలో ఈవీ మార్కెట్‌ వేగంగా ఎదగడానికి దోహదం చేస్తున్నాయి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఏసీబీకి చిక్కిన ఇద్ద‌రు

ఏసీబీకి చిక్కిన ఇద్ద‌రు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి, సీనియర్‌ అసిస్టెంట్‌ పట్టివేత సీఎంఆర్‌ఎఫ్‌ బిల్లు మంజూరుకు...

ఉప్పల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో లంచాల ప‌ర్వం

ఉప్పల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో లంచాల ప‌ర్వం డాక్యుమెంట్‌ రైటర్ల ద్వారా అదనపు...

దక్షిణ కొరియా వర్సిటీలో నిషితకు సీటు

దక్షిణ కొరియా వర్సిటీలో నిషితకు సీటు ప్రతిష్ఠాత్మక ‘కొయికా’ ఫుల్‌ స్కాలర్‌షిప్‌తో ఎంఎస్సీ...

హైదరాబాద్‌లో లండన్‌ యూనివర్సిటీ క్యాంపస్‌!

హైదరాబాద్‌లో లండన్‌ యూనివర్సిటీ క్యాంపస్‌! క్యాంపస్‌ ఏర్పాటుకు లండన్‌ యూనివర్సిటీ ప్రతినిధుల కసరత్తు విస్తృత...

‘ఖేలో ఇండియా’ గేమ్‌చేంజర్‌

‘ఖేలో ఇండియా’ గేమ్‌చేంజర్‌ గ్రాస్‌రూట్‌ స్థాయి నుంచే క్రీడాకారుల తీర్చిదిద్దడం 2026–31 కాలానికి రూ.29,054...

మాజీ తహసీల్దార్‌ ఇంటిపై ఏసీబీ దాడులు

మాజీ తహసీల్దార్‌ ఇంటిపై ఏసీబీ దాడులు ఒకేసారి 15 చోట్ల సోదాలు ఆదాయానికి మించిన...

కౌండిన్య గౌడ సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కూనూరు నిరంజన్‌ గౌడ్‌

కౌండిన్య గౌడ సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కూనూరు నిరంజన్‌ గౌడ్‌ కాకతీయ,...

జహీరాబాద్‌ స్మార్ట్‌ సిటీతో 2 లక్షల మందికి ఉపాధి

జహీరాబాద్‌ స్మార్ట్‌ సిటీతో 2 లక్షల మందికి ఉపాధి రూ.15 వేల కోట్ల...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.