జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శిగా కె.పూజ
బాధ్యతలు స్వీకరించిన న్యాయమూర్తి
ఉచిత న్యాయ సహాయానికి ప్రాధాన్యం
లోక్అదాలత్లను మరింత సమర్థవంతంగా నిర్వహిస్తాం
ప్రజల్లో న్యాయ సేవలపై అవగాహన పెంపు లక్ష్యాలని వెల్లడి
కాకతీయ, వరంగల్ బ్యూరో : వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శిగా కె.పూజ శనివారం బాధ్యతలు స్వీకరించారు. పదోన్నతిపై ఇంతకుముందు వరంగల్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా పనిచేసిన ఆమెను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శిగా బదిలీ చేశారు. బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఇన్చార్జి కార్యదర్శి ఎ.ప్రదీప్, సూపరింటెండెంట్ మోహన్రావు, సిబ్బంది కె.పూజకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ ఉచిత న్యాయ సహాయం అందేలా చర్యలు తీసుకోవడంతో పాటు ప్రజల్లో న్యాయ సేవలపై అవగాహన పెంచడం తన ప్రధాన ప్రాధాన్యతలని తెలిపారు. లోక్అదాలత్లు, న్యాయ అవగాహన కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. న్యాయ సేవా కార్యక్రమాలను విస్తృతంగా ప్రజలకు చేరువ చేయాలని, ఇందుకు అధికారులు, సిబ్బంది, ప్యానెల్ న్యాయవాదులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

