epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ప్ర‌ణాళిక‌తోనే హైదరాబాద్‌ అభివృద్ధి

ప్ర‌ణాళిక‌తోనే హైదరాబాద్‌ అభివృద్ధి
విద్య, ఉపాధి అవకాశాలకు న‌గ‌రం ఆశ్రయం
రాష్ట్రాన్ని మూడు విభాగాలుగా విభజించి అభివృద్ధి చేస్తున్నాం
సంక్షేమంతో పాటు అభివృద్ధి పనులకు ప్రాధాన్యం
ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి
అంబర్‌పేట–మూసారాంబాగ్‌ మధ్య మూసీ నదిపై హైలెవల్‌ బ్రిడ్జి ప్రారంభోత్స‌వం

కాకతీయ, తెలంగాణ బ్యూరో : విద్య, ఉపాధి అవకాశాలకు హైదరాబాద్‌ ఆశ్రయంగా నిలిచిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. అన్ని పరిశ్రమలు హైదరాబాద్‌కు రావడం వల్లే నగరం అభివృద్ధి చెందుతోందని తెలిపారు. రాష్ట్రంలో మౌలిక వసతులను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తున్నామని, రాష్ట్రాన్ని మూడు విభాగాలుగా విభజించి అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని చెప్పారు. అంబర్‌పేట–మూసారాంబాగ్‌ మధ్య మూసీ నదిపై నిర్మించిన హైలెవల్‌ బ్రిడ్జిని సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం అంబర్‌పేటలోని స్పోర్ట్స్‌ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రూ.52 కోట్ల వ్యయంతో 400 మీటర్ల పొడవున నిర్మించిన ఈ వంతెన అందుబాటులోకి రావడంతో చాదర్‌ఘాట్‌ వంతెనపై ట్రాఫిక్‌ ఇబ్బందులు తగ్గుతాయని తెలిపారు. పదేళ్లు అధికారంలో ఉన్నవారు అంబర్‌పేటలో వంతెన ఎందుకు నిర్మించలేదని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే హైలెవల్‌ బ్రిడ్జిని నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. బీఆర్‌ఎస్‌ హయాంలో అంబర్‌పేటలో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు నిర్మించారా అని ప్రశ్నించారు. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు నిర్మించినా పేదలకు ఇవ్వకుండా దళారులకు ఇచ్చారని ఆరోపించారు. ‘తెలంగాణ రైజింగ్‌ విజన్‌–2047’ పాలసీని తీసుకొచ్చామని సీఎం తెలిపారు. మూసీ వరదల్లో ప్రజలు ఇబ్బందులు పడినా గత ప్రభుత్వం ఎలాంటి సహాయం చేయలేదని ఆరోపించారు. హైదరాబాద్‌ అభివృద్ధిలో భాగంగా మౌలిక వసతుల కల్పనకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు.

రూ.8 లక్షల కోట్ల అప్పులు చేశారని ఆరోపణ

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తొమ్మిదిన్నరేళ్ల పాలనలో రూ.8 లక్షల కోట్ల అప్పులు చేసిందని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర అప్పును రూ.70 వేల కోట్ల నుంచి రూ.8.10 లక్షల కోట్లకు తీసుకెళ్లారని పేర్కొన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు ప్రస్తుతం నెలకు రూ.7 వేల కోట్ల వరకు వడ్డీలు చెల్లిస్తున్నామని చెప్పారు. రిటైర్‌ అయిన ఉద్యోగుల బకాయిలు రూ.8 వేల కోట్లు పెండింగ్‌లో పెట్టిపోయారని ఆరోపించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు చెల్లిస్తున్నామని తెలిపారు. ఆర్టీసీ, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ వస్తున్నామని చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించినందుకు ఆర్టీసీకి ఇప్పటివరకు రూ.11 వేల కోట్లు చెల్లించామని వివరించారు. ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అందిస్తున్నామని తెలిపారు. సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పనులను కూడా కొనసాగిస్తున్నామని సీఎం పేర్కొన్నారు.

బతుకమ్మకుంటను ఆక్రమణల నుంచి కాపాడాం

అంబర్‌పేటలో పది ఎకరాల్లో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి పేదలకు అందిస్తున్నామని రేవంత్‌రెడ్డి తెలిపారు. బతుకమ్మలను నిమజ్జనం చేసేందుకు చెరువు లేకుండా బతుకమ్మకుంటను ఆక్రమించారని ఆరోపించారు. ఆక్రమణలను తొలగించి బతుకమ్మకుంటను తిరిగి ఆడబిడ్డలకు బహుమతిగా ఇచ్చామని చెప్పారు. బతుకమ్మకుంటను తిరిగి ఆక్రమించేందుకు సుధాకర్‌రెడ్డి అనే వ్యక్తి కుట్రలు చేస్తున్నారని సీఎం ఆరోపించారు. బతుకమ్మకుంటను ఆక్రమించిన సుధాకర్‌రెడ్డి వెనుక ఎవరున్నారో ఆలోచించాలని ప్రజలను కోరారు. చెరువుల్లో ఆక్రమణలను తొలగిస్తున్నామే తప్ప తాము చెరువుల్లో విల్లాలు, ఫామ్‌హౌస్‌లు నిర్మించుకోవడం లేదని స్పష్టం చేశారు. వెయ్యి రోజుల పాలనలో రైతుల కోసం రూ.1.70 లక్షల కోట్లు ఖర్చు చేశామని రేవంత్‌రెడ్డి తెలిపారు. తెలంగాణలో అప్పులేని రైతులు ఉన్నారని నీతి ఆయోగ్‌ చెప్పిందని పేర్కొన్నారు. బతుకమ్మ చీరల విషయంలోనూ బీఆర్‌ఎస్‌ నేతలు కమీషన్లు తిన్నారని ఆరోపించారు. మహిళలను ఆర్టీసీ అద్దె బస్సులకు యజమానులుగా చేశామని, మహిళలు తయారు చేసిన వస్తువులను అమెజాన్‌ ద్వారా విక్రయించుకునే అవకాశం కల్పించామని చెప్పారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో పేదలకు రేషన్‌ కార్డులు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3.48 కోట్ల మందికి సన్నబియ్యం అందిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్‌లో ఏడాదిలోపు లక్ష ఇందిరమ్మ ఫ్లాట్లు నిర్మించి ఆడబిడ్డలకు అందించనున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. సంక్షేమ పథకాలతో పాటు నగరానికి అవసరమైన రహదారులు, వంతెనలు, తాగునీరు, ఇతర మౌలిక వసతులను అభివృద్ధి చేస్తూ హైదరాబాద్‌ను మరింత మెరుగైన నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ ప్రజల సమస్యలు,...

ఎర్రవల్లిలో ఉద్రిక్తత

ఎర్రవల్లిలో ఉద్రిక్తత కేసీఆర్ ఫాం హౌస్‌కు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌...

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను మోసం చేసింది వంద...

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా?

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా? మహిళా శాసనసభ్యుల చీరెలు లాగుతారా.....

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.