epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం
వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం
ఆరు గ్యారంటీలు.. 420 హామీలతో ప్రజలను వంచించారు
రైతులు, విద్యార్థులు, కార్మికుల సమస్యలు పట్టించుకోలేదు
కేసీఆర్‌ రావడం పక్కా.. రామరాజ్యం కావడం ఖాయం
కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారు
మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌
ఖ‌మ్మం జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ భారీ నిర‌స‌న‌

కాకతీయ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్‌ పార్టీ అంటేనే దగా, మోసం అని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలతో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను వంచించారని ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ ఖమ్మం నగరంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని అరకొరగా అమలు చేస్తోందని పువ్వాడ అజయ్‌కుమార్‌ ఆరోపించారు. రైతు రుణమాఫీని కూడా సక్రమంగా అమలు చేయకపోవడంతో రైతాంగం ఇబ్బందులు ఎదుర్కొంటోందన్నారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. కేసీఆర్‌ హయాంలో వ్యవసాయాన్ని పండుగ చేయాలనే లక్ష్యంతో అనేక సంస్కరణలు చేపట్టి, రైతుల సంక్షేమానికి పలు పథకాలను అమలు చేశామని తెలిపారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ప్రజలు మోసపోవడం ఖాయమని కేసీఆర్‌ ముందుగానే హెచ్చరించారని గుర్తుచేశారు.

విద్యార్థులు, కార్మికుల సమస్యలపై నిర్లక్ష్యం

విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సక్రమంగా అందక ఇబ్బందులు పడుతున్నారని పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. గురుకుల విద్యార్థులు సైతం అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి కార్మికుల సంక్షేమానికి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చర్యలు తీసుకుందని, అయితే కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని విమర్శించారు. మహిళలు, విద్యార్థులు, రైతులు, ఉద్యోగులు, కార్మికులు సహా అన్ని వర్గాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌ నేతలు భూ కబ్జాలు, భూ దోపిడీలకు పాల్పడుతున్నారని పువ్వాడ అజయ్‌కుమార్‌ ఆరోపించారు. గతంలో ఖమ్మం జిల్లాలో ఒక్క మంత్రిగా ఉన్న సమయంలో చేపట్టిన అభివృద్ధి పనులను, ప్రస్తుతం ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ చేయలేకపోతున్నారని విమర్శించారు. సీతారామ ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రాజెక్టు నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లిందని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రాజెక్టు నిర్వహణ, మిగిలిన పనుల పూర్తి విషయంలో శ్రద్ధ చూపడం లేదని ఆరోపించారు.

కేసీఆర్‌ రావడం పక్కా.. రామరాజ్యం ఖాయం

కాంగ్రెస్‌ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలే కాంగ్రెస్‌ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. కేసీఆర్‌ తిరిగి రావడం పక్కా.. రామరాజ్యం కావడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ హెచ్చరించారు. ఖమ్మం జర్నలిస్టుల కోసం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మంజూరు చేసిన 23 ఎకరాల భూమిని ఇప్పటికీ వారికి కేటాయించలేకపోయారని పువ్వాడ అజయ్‌కుమార్‌ విమర్శించారు. జర్నలిస్టుల సమస్యను పరిష్కరించడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రజా సమస్యలపై బీఆర్‌ఎస్‌ నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలను చైతన్యవంతం చేస్తామని అన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

సీఎం రేవంత్‌పై అనుచిత వ్యాఖ్యలు సహించేది లేదు

సీఎం రేవంత్‌పై అనుచిత వ్యాఖ్యలు సహించేది లేదు కొండా సుష్మిత బహిరంగ క్షమాపణ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.